ప్రస్తుతం బాలీవుడ్‌లో బయోపిక్‌ల హవా నడుస్తుంది. మరో మాజీ క్రికెటర్ బయోపిక్‌కి సన్నాహాలు జరుగుతున్నట్లు బీటౌన్ వర్గాలు చర్చించుకుంటున్నాయి. యువరాజ్ సింగ్ నిజజీవితాన్ని ఆధారంగా ప్రముఖ దర్శక, నిర్మాత కరణ్ జోహార్ సిద్ధమయైనట్లు తెలుస్తోంది. దీనిపై యువరాజ్‌తో సంప్రదింపులు కూడా జరిపాడని సమాచారం. కరణ్ ప్రతిపాదనకు యువీ వైపు నుంచి కూడా గ్రీన్ సిగ్నల్ వచ్చిందని, త్వరలో ఈ ప్రాజెక్ట్ పట్టాలెక్కబోతుందని బీటౌన్ వర్గాల్లో జోరుగా చర్చ సాగుతోంది. అయితే యువీ ప్రతిపాదించిన ఇద్దరు స్టార్ హీరోలను కాదని కరణ్.. కొత్త ముఖం వైపు మొగ్గు చూపుతున్నాడని సమాచారం. కాగా.. క్రికెటర్లలో ఇప్పటికే ధోని బయోపిక్ వచ్చిన సంగతి తెలిసిందే. గంగూలీ బయోపిక్ కూడా ప్రస్తుతం రూపొందుతున్న సంగతి తెలిసిందే.