బుల్లితెర ప్రేక్షకుల అభిమాన టీవీ రియాలిటీ షోలలో ఒకటి “బిగ్ బాస్”. హిందీలోనే కాదు అనేక ఇతర ప్రాంతీయ భాషలలో కూడా ఈ కార్యక్రమం విజయవంతంగా రన్ అవుతోంది. ఈద్ సందర్భంగా “బిగ్ బాస్ సీజన్ 15″కు హోస్ట్ గా వ్యవహరించనున్న సల్మాన్ ఖాన్ “బిగ్ బాస్ ఓటిటి” సరికొత్త సీజన్‌ను ఆవిష్కరించారు. “బిగ్ బాస్ ఓటిటి” ఆగస్టు 8న వూట్‌లో ప్రదర్శించబడుతుంది. ఈ ప్రోమో వైరల్ అయిన తరువాత ఈ కొత్త సీజన్‌కు ఎవరు హోస్ట్ గా వ్యవహరిస్తారు అనే విషయం ప్రేక్షకుల్లో చర్చనీయాంశం అయ్యింది. ఆ జాబితాలో సిధార్థ్ శుక్లా, ఫరా ఖాన్, రోహిత్ శెట్టి వంటి అనేక పేర్లు రౌండ్లు వేస్తున్నాయి.
Read Also : రాజ్ కుంద్రా చుట్టూ బిగుసుకుంటున్న ఉచ్చు… కీలక ఆధారాలు లభ్యం
తాజాగా కొత్త సీజన్ హోస్ట్‌ను అధికారికంగా ప్రకటించడం ద్వారా మేకర్స్ అన్ని ఊహాగానాలకు చెక్ పెట్టారు. ప్రముఖ దర్శకుడు, నిర్మాత, నటుడు కరణ్ జోహార్ హోస్ట్ గా ఈ కార్యక్రమాన్ని నిర్వహించబోతున్నారు. “బిగ్ బాస్ ఓటిటి” ఆరు వారాల పాటు 24×7 ప్రసారం కానుంది. ఇది టెలివిజన్ వెర్షన్ కంటే ముందే వూట్‌లో ప్రసారం అవుతుంది. సల్మాన్ ఖాన్ ఈ ఏడాది చివర్లో టెలివిజన్ వెర్షన్ ప్రారంభించనున్నారు.