రణబీర్, అలియా, బిగ్ బి, మౌని రాయ్, డింపుల్ కపాడియా, నాగార్జున అక్కినేని కీలక పాత్రల్లో నటిస్తున్న భారీ సైన్స్ ఫిక్షన్ మూవీ “బ్రహ్మాస్త్ర”. అయాన్ దర్శకత్వం వహించిన ‘బ్రహ్మాస్త్ర’ చిత్రాన్ని కరణ్ జోహార్ నిర్మిస్తున్నారు. 2022 సెప్టెంబర్ 9న విడుదల కానున్న ఈ సినిమాకు సంబంధించిన ప్రెస్ మీట్ ను తాజాగా హైదరాబాద్ లో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాజమౌళి ముఖ్యఅతిథిగా పాల్గొనగా, చిత్రబృందంతో కలిసి సినిమాలో భాగమైన నాగార్జున కూడా పాల్గొన్నారు. ఇందులో భాగంగా నిర్మాత కారం జోహార్ మాట్లాడుతూ దర్శక దిగ్గజం రాజమౌళిపై ప్రశంసల వర్షం కురిపించారు.
Read Also : ఏది పడితే అది తీస్తే పాన్ ఇండియా అవ్వదు : రాజమౌళి
రాజమౌళి సినిమాను బాలీవుడ్ లో విడుదల చేయడం గౌరవంగా భావిస్తున్నాను అని అన్నారు. ‘బాహుబలి’ గురించి మాట్లాడుతూ ప్రభాస్, రానాను కూడా ప్రశంసించారు. రాజమౌళి టాలెంట్, జీనియస్ మాత్రమే కాదు… ఆయన సినిమాలు చూసినప్పుడు నాకు అద్భుతమైన ఫీలింగ్ కలుగుతుంది. ఆయన ఈగ సినిమా చూసి గాల్లో తేలిపోయాను. రాజమౌళి ఇక్కడ ఉండడం ఇండియన్ సినిమాకు గర్వకారణం. ఈ జీనియస్ వల్లనే మనం ఈరోజు పాన్ ఇండియా సినిమా గురించి మాట్లాడుతున్నాము. ఆయన ఇండియన్ సినిమాకు ఉన్న పరిధులను విస్తరించారు అంటూ రాజమౌళిని ఆకాశానికి ఎత్తేశారు.
ఇక ‘బ్రహ్మాస్త్ర’ గురించి మాట్లాడుతూ అలియా భట్ ఈ సినిమాతోనే పెరిగింది. ప్రభుత్వాలు మారాయి… ఈ ఐదేళ్లలో ఎన్నో మారాయి. కానీ రణబీర్ మాత్రం ఈ సినిమాలో నటించడం ఆపలేదు అన్నారు. ఇక దర్శకుడు అయాన్ టాలెంట్ పై నమ్మకం వ్యక్తం చేస్తూ చిత్రబృందానికి కృతజ్ఞతలు తెలిపారు. ఇక నాగార్జున, అమలను మా అమ్మానాన్న కలిశారు. సినిమా షూటింగ్ సమయంలో ఈ జంటను కలిసిన మా అమ్మానాన్న నాగ్, అమల గురించే మాట్లాడారు. నాగార్జున వంటి నైసెస్ట్ పర్సన్ ని నేను ఇంతకుముందు చూడలేదు. ఆయనతో సినిమా చేయడం సంతోషంగా ఉంది అంటూ నాగార్జునపై పొగడ్తల వర్షం కురిపించారు.