5G India Rollout: దేశంలో అక్టోబర్ 1న 5జీ సేవలను ప్రారంభించారు ప్రధాని నరేంద్ర మోదీ. మొదటి విడతలో 13 నగరాల్లో 5జీ సేవలు అందుబాటులోకి వచ్చాయి. అయితే దశల వారీగా మరిన్ని నగరాల్లో ఈ సేవలను అందించేందుకు టెలికాం సంస్థలు ప్రయత్నిస్తున్నాయి. మార్చి, 2023 నాటికల్లా దేశంలోని 200 నగరాల్లో 5జీ సేవలను ప్రారంభించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు కేంద్ర టెలికాం శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడించారు.
దేశంలో 5జీ సేవలు సజావుగా అందేందుకు తీసుకోవాల్సిన తక్షణ చర్యలపై స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థలు, టెలికాం నెట్‌వర్క్ సంస్థలతో టెలికాం-ఐటీ ఉన్నతాధికారులు బుధవారం సమావేశం నిర్వహించనున్నారు.
Jio 5G: ప్రఖ్యాత టెలికాం సంస్థ రిలయెన్స్ జియో 5జీ వేగంలో అగ్రగామిగా నిలిచింది. ప్రత్యర్థి సంస్థలకు అందనంత ఎత్తులో జియో ఉంది. అక్టోబర్ 1న 5జీ సేవలు మొదలు కాగా, దీనికంటే ముందే టెలికం ఆపరేటర్లు తమ నెట్ వర్క్ లను పరీక్షించినట్టు ఊక్లా తెలిపింది.
Airtel 5G: ప్రముఖ టెలికాం సంస్థ ఎయిర్‌టెల్ దేశంలోని 8 నగరాల్లో 5జీ ప్లస్ సేవలను ప్రారంభించింది. ఈ సేవలను పొందేందుకు సిమ్ కార్డు మార్చాల్సిన అవసరం లేదని, 5జీ ఫోన్ ఉంటే సరిపోతుందని ఎయిర్‌టెల్ వెల్లడించింది.
5G services in India: దేశంలో 5జీ సేవలను అక్టోబర్ 1 నుంచి ప్రధాని నరేంద్రమోదీ అట్టహాసంగా ప్రారంభించారు. దేశంలో సాంకేతిక విప్లవానికి 5జీ నాంది పలుతుకుందని ఆయన అభిప్రాయపడ్డారు. ఇదిలా ఉంటే దేశంలో ప్రస్తుతం 13 నగరాల్లో మాత్రమే 5జీ సేవలు అందుబాటులోకి రానున్నాయి. అయితే మొదటగా ఎయిర్ టెల్ వినియోగదారులు మాత్రమే 5జీ సేవలను ఉపయోగించుకోనున్నారు. ప్రస్తుతం 5జీ సేవలు అందుబాటులోకి వచ్చిన నగరాల్లో ఢిల్లీ, ముంబై, చెన్నై, కోల్‌కతా, బెంగళూరు, చండీగఢ్. గురుగ్రామ్,…
Time's 100 Emerging Leaders-Akash Ambani in list: టైమ్స్ మ్యాగజిన్ 100 మంది ఎమర్జింగ్ లీడర్ల జాబితాను ప్రకటించింది. వ్యాపారం, వినోదం, క్రీడలు, రాజకీయం, ఆరోగ్యం, సైన్స్, ఇలా పలు రంగాల్లో 100 మంది ఎమర్జింగ్ లీడర్ల జాబితాను టైమ్స్ రూపొందించింది. దీంట్లో ఇండియా నుంచి ముఖేష్ అంబానీ కొడుకు ఆకాష్ అంబానీ చోటు దక్కించుకున్నాడు. భారత్ నుంచి కేవలం ఒక్క ఆకాష్ అంబానీ మాత్రమే ఈ జాబితాలో ఉన్నారు. అయితే భారత సంతతికి చెందిన…
భారత్లో త్వరలోనే 5జీ సేవలు ప్రారంభం కాబోతున్నాయి.. అక్టోబర్ 1వ తేదీన 5జీ సేవలను ప్రారంభించనున్నట్టు ఇప్పటికే నేషనల్ బ్రాడ్ బ్యాండ్ మిషన్ ప్రకటించింది. 5జీ స్పెక్ట్రమ్కు సంబంధించిన వేలం ఇటీవలే ముగియగా.. ఈ వేలంలో ఎయిర్ టెల్, రిలయన్స్ జియో, వొడాఫోన్ ఐడియా, ఆదానీ డేటా నెట్వర్క్స్ పోటీపడి టెలీకాం సెక్టార్లను సొంతం చేసుకున్నాయి.. అక్టోబర్ 1వ తేదీన ప్రధాని నరేంద్ర మోడీ 5జీ సేవలను ప్రారంభించనున్నారు.. ఇక, 5జీ స్మార్ట్ఫోన్లు కూడా భారత్ మార్కెట్లోకి…
ఇప్పటికే దేశంలోనే అతిపెద్ద టెలికం సంస్థగా ఉన్న రిలయన్స్ జియో.. మరోసారి సత్తా చాటింది.. ఆ మధ్య కొత్త కస్టమర్లను యాడ్ చేసుకోవడం అటుంచితే.. ఉన్నవారినే కోల్పోయిన సందర్భాలున్నాయి.. అయినా.. నెంబర్ వన్గా కొనసాగుతూ వచ్చింది ఆ సంస్థ.. తాజాగా.. మళ్లీ కొత్త కస్టమర్లను యాడ్ చేసుకుంటూ దూకుడు చూపిస్తోంది.. జూన్ నెలకుగాను టెలికం సంస్థల యూజర్ల డేటాను టెలికం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా విడుదల చేసింది.. జియో మరోసారి అదరగొట్టింది. టెలికం రంగంలోని మిగతా…