Time’s 100 Emerging Leaders-Akash Ambani in list: టైమ్స్ మ్యాగజిన్ 100 మంది ఎమర్జింగ్ లీడర్ల జాబితాను ప్రకటించింది. ప్రపంచవ్యాప్తంగా వ్యాపారం, వినోదం, క్రీడలు, రాజకీయం, ఆరోగ్యం, సైన్స్, ఇలా పలు రంగాల్లో 100 మంది ఎమర్జింగ్ లీడర్ల జాబితాను టైమ్స్ రూపొందించింది. దీంట్లో ఇండియా నుంచి ముఖేష్ అంబానీ కొడుకు ఆకాష్ అంబానీ చోటు దక్కించుకున్నాడు. భారత్ నుంచి కేవలం ఒక్క ఆకాష్ అంబానీ మాత్రమే ఈ జాబితాలో ఉన్నారు. అయితే భారత సంతతికి చెందిన అమెరికన్ బిజినెస్ లీరడ్ అమ్రపాలి గన్ కూడా ఈ జాబితాలో చోటు దక్కించుకున్నారు.
మల్టీ బిలియనీర్, రిలయన్స్ సంస్థల అధిపతి ముఖేష్ అంబానీ కుమారుడిగా ఆకాష్ అంబానీ అందరికి తెలుసు. రానున్న కాలంలో ఆకాష్ అంబానీ కూడా ప్రపంచస్థాయి వ్యాపారవేత్తగా ఎదుగుతారని టైమ్స్ అంచనా వేసింది. ఆకాష్ అంబానీ వ్యాపారంలో ఎదగడానికి కష్టపడుతున్నాడంటూ టైమ్స్ వ్యాఖ్యానించింది.
Read Also: Lt General Anil Chauhan: కొత్త సీడీఎస్ గా అనిల్ చౌహాన్.. బిపిన్ రావత్ మరణం తర్వాత నియామకం
30 ఏళ్ల ఆకాష్ అంబానీ భారతదేశ అతిపెద్ద టెలికాం కంపెనీ జియోకు చైర్మన్ గా జూన్ లో పదవీ బాధ్యతలు తీసుకున్నారు. కేవలం 22 ఏళ్ల వయసులోనే బోర్డు సీటును పొందారు. ప్రస్తుతం జియోకు 42.6 కోట్లమంది ఖాతాదారులు ఉన్నారు. ఆకాష్ అంబానీ గూగుల్, ఫేస్ బుక్ వంటి వాటిలో బిలియన్ డాలర్ల పెట్టుబడుతు పెడుతున్నారు. ఈ జాబితాలో అమెరికన్ సింగర్ సీజా, యాక్టర్ సిడ్నీ స్వీనీ, బాస్కెట్ బాల్ ప్లేయర్ జా మోరాంట్, స్పానిష్ టెన్నిస్ ప్లేయర్ కార్లోస్ అల్కరాజ్, యాక్టర్ కేకే పామర్, పర్యావరణ కార్యకర్త ఫర్విజా వంటి వారు ఉన్నారు.