Jio: ఆ విషయంలో జియోనే తోపు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టెలికం రంగం.. రిలయన్స్ జియో ఎంట్రీకి ముందు.. జియో ఎంట్రీ తర్వాత అని చెబుతుంటారు.. అంటే జియో టెలికం మార్కెట్‌లో అడుగుపెట్టిన తర్వాత పెను మార్పులు చోటు చేసుకున్నాయి.. అన్నీ ఫ్రీ అంటూ టెలికం మార్కెట్‌లో తొలి అడుగులు వేసినా.. ఆ తర్వాత చార్జీలు వడ్డించినా.. ఆ సంస్థ అందిస్తోన్న సేవలతో.. కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో మినహాయిస్తే.. క్రమంగా యూజర్ల సంఖ్య పెరుగుతూనే ఉంది. దేశంలోని ప్రముఖ టెలికం కంపెనీగా ఉన్న రిలయన్స్ జియో మరోసారి తన సత్తా చాటింది. డౌన్‌లోడ్ మరియు అప్‌లోడ్ వేగంలో మరోసారి అగ్రస్థానంలో నిలిచింది.. ఈ మేరకు టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్) ఓ నివేదికను విడుదల చేసింది. ట్రాయ్ డేటా ప్రకారం, సెప్టెంబర్‌లో జియో 4జీ యొక్క సగటు డౌన్‌లోడ్ వేగం 19.1 ఎంబీపీఎస్ కాగా, అక్టోబర్‌లో అది 20.3 ఎంబీపీఎస్‌కి పెరిగింది.
Read Also: Bank strike : డబ్బు కావాలంటే త్వరపడండి.. ఆ రోజు బ్యాంకులు పనిచేయవు
Also Read
- Petrol Diesel Price Hike: వాహనదారులకు షాక్.. పెట్రోల్ రూ.5, డీజిల్ రూ.3 పెంపు
- October 15: అక్టోబర్ 15 నుంచి ఏటీఎంలలో సరికొత్త రూల్స్! ఇక ఆ చిక్కులు ఉండవు..
- EPFO Claim Rejection: మీ PF క్లెయిమ్ రిజెక్ట్ అవుతోందా..? ముందుగా ఈ విషయాలు చెక్ చేయండి
- RBI: ఆర్‌బీఐ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా సుధాకర్ మల్లి నియామకం
ఇదే సమయంలో మిగతా టెలికం సంస్థల విషయానికి వస్తే.. భారతీ ఎయిర్‌టెల్ యొక్క 4జీ డౌన్‌లోడ్ స్పీడ్ 15 ఎంబీపీఎస్ కాగా, వొడాఫోన్ ఐడియా యొక్క 4జీ డౌన్‌లోడ్ వేగం 14.5 ఎంబీపీఎస్‌గా ఉంది.. అంటే.. ఈ రెండింటితో పోలిస్తే, జియో యొక్క సగటు డౌన్‌లోడ్ వేగం 5 ఎంబీపీఎస్ ఎక్కువగా ఉంది. మరోవైపు, అప్‌లోడ్ వేగంలోనూ రిలయన్స్ జియోనే అగ్రస్థానంలో ఉంది. ఈ విషయంలో సెప్టెంబర్‌లో తొలిసారి టాప్ పొజిషన్‌కు చేరుకున్న జియో.. అక్టోబర్‌లోనూ తన స్థానాన్ని సుస్థిరం చేసుకుంది. జియో సగటు 4జీ అప్‌లోడ్ వేగం 6.2 ఎంబీపీఎస్‌తో అగ్రస్థానంలో ఉంది. ఇక, వోడాఫోన్ ఐడియా 4.5 ఎంబీపీఎస్ అప్‌లోడ్ వేగంతో రెండవ స్థానంలో కొనసాగుతోంది. ఈ విషయంలో ఎయిర్‌టెల్ పరిస్థితి మరీ దారుణంగా ఉంది. అక్టోబర్‌లో ఎయిర్‌టెల్ 4జీ అప్‌లోడ్ వేగం 2.7 ఎంబీపీఎస్‌కే పరిమితం అయ్యింది.. అంటే జియోతో పోలిస్తే ఎయిర్‌టెల్ అప్‌లోడ్ వేగం సగం కంటే తక్కువగా ఉంది.. ఇలా, అటు డౌన్‌లోడ్… ఇటు అప్‌లోడ్‌లోనూ మరోసారి తానే తోపు అని నిరూపించుకుంది రిలయన్స్ జియో.
తాజావార్తలు
-
Aadhaar Name Update: ఆధార్‌లో పేరు మార్చాలా? UIDAI కొత్త SOP.. ఇక ప్రతి మార్పుకు ప్రత్యేక అఫిడవిట్!
-
Asaduddin Owaisi: ‘‘హైదరాబాద్‌లో జంతర్ మంతర్ కన్నా పెద్ద నిరసన’’..ఓవైసీ వార్నింగ్..
-
KCC Loan Limit: రైతుకు KCC ద్వారా ఎంత డబ్బు వస్తుంది? భూమి, పంట ఆధారంగా లోన్ లిమిట్ ఎలా నిర్ణయిస్తారంటే
-
Prahaar : సాలిడ్ సక్సెస్ కోసం యంగ్ హీరోపై చాలా నమ్మకం పెట్టుకున్న నిర్మాణ సంస్థ
-
Legendary Director Singeetham Srinivasa Rao : తెలుగు సినిమా ప్రమోగశాల మూతపడింది..
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!