IPhone 5G Update: దేశంలో 5జీ సేవలు సజావుగా అందేందుకు తీసుకోవాల్సిన తక్షణ చర్యలపై స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థలు, టెలికాం నెట్‌వర్క్ సంస్థలతో టెలికాం-ఐటీ ఉన్నతాధికారులు బుధవారం సమావేశం నిర్వహించనున్నారు. ఇందులో టెలికాం-ఐటీ కార్యదర్శులతో పాటు యాపిల్, శాంసంగ్, వివో, షియోమీ వంటి మొబైల్ తయారీ కంపెనీల నిర్వాహకులతో పాటు దేశీయ టెలికాం ఆపరేటర్లయిన రిలయన్స్, ఎయిర్‌టెల్, వొడాఫోన్ ఐడియా ప్రతినిధులు పాల్గొననున్నారు. దేశీయంగా 5జీ సేవలు పొందేలా సాఫ్ట్‌వేర్ అప్‌డేట్‌లను వినియోగదారులకు పంపేందుకు మొబైల్ తయారీ సంస్థలు ‘ప్రాధాన్యత’ ఇవ్వాలని కోరనున్నారు. దేశంలో 5జీ సేవలు ప్రారంభమైనప్పటికీ.. 5జీ సేవలకు అనువైన సాఫ్ట్‌వేర్‌ను డిసెంబర్ నాటికి అప్‌డేట్ చేస్తామని యాపిల్ తెలిపింది. డిసెంబరు నాటికి ఐఫోన్ 14 సహా ఇప్పటికే అందుబాటులో ఉన్న ఆ సంస్థకు చెందిన అన్ని 5జీ మోడళ్లకు సాఫ్ట్‌వేర్ అప్‌డేషన్ అందిస్తామని మంగళవారం తెలిపింది. 5జీ సేవల నాణ్యత, పనితీరుపై జరుగుతున్న ప్రయోగ పరీక్షలు సఫలమైన వెంటనే అప్‌డేట్ అందిస్తామని పేర్కొంది. ప్రస్తుతం ఐఫోన్ 12, ఐఫోన్ 13, ఐఫోన్ 14 సిరీస్‌లతో పాటు ఐఫోన్ ఎస్‌ఈ (3వ తరం) ఫోన్లు 5జీ సామర్థ్యం కలిగి ఉన్నాయి. వీటిని ఎయిర్‌టెల్, జియో 5జీ నెట్‌వర్క్‌లపై యాపిల్ పరీక్షిస్తోంది.
NASA: దారి మళ్లిన గ్రహశకలం.. నాసా డార్ట్ ప్రయోగం సక్సెస్
రిలయన్స్ జియో 4 నగరాల్లో ప్రయోగాత్మక సేవలు అందిస్తున్నట్లు ప్రకటించగా.. భారతీ ఎయిర్‌టెల్ 8 నగరాల్లో వాణిజ్య సేవలను అందుబాటులోకి తెచ్చినట్లు తెలిపాయి. వచ్చే ఏడాది కల్లా ఈ సేవలను గణనీయంగా విస్తరిస్తామని ప్రకటించాయి. దేశంలో 10 కోట్ల మందికి పైగా వినియోగదారులు ఇప్పటికే ‘5జీ రెడీ’ అని ప్రకటితమైన స్మార్ట్‌ఫోన్లు కొనుగోలు చేసుకున్నారు. యాపిల్ తాజా ఆవిష్కరణ అయిన ఐఫోన్ 14 సహా ఇప్పటికే అందుబాటులో ఉన్న ఆ సంస్థకు చెందిన 5జీ మోడళ్లు, శాంసంగ్‌కు చెందిన పలు ప్రీమియం స్మార్ట్‌ఫోన్లు కూడా దేశంలో 5జీ సేవలకు అనువైన సాఫ్ట్‌వేర్‌ను అప్‌డేట్ చేయాల్సి ఉందని పరిశ్రమ వర్గాలు పేర్కొంటున్నాయి. ఈ నేపథ్యంలోనే టెలికాం విభాగ కార్యాలయంలో బుధవారం అత్యున్నత సమావేశం నిర్వహించనున్నారు. ఇందులో టెలికాం-ఐటీ కార్యదర్శులతో పాటు యాపిల్, శాంసంగ్, వివో, షియోమీ వంటి మొబైల్ తయారీ కంపెనీల నిర్వాహకులతో పాటు దేశీయ టెలికాం ఆపరేటర్లయిన రిలయన్స్, ఎయిర్‌టెల్, వొడాఫోన్ ఐడియా ప్రతినిధులు పాల్గొననున్నారు. దేశీయంగా 5జీ సేవలు పొందేలా సాఫ్ట్‌వేర్ అప్‌డేట్‌లను వినియోగదారులకు పంపేందుకు మొబైల్ తయారీ సంస్థలు ‘ప్రాధాన్యత’ ఇవ్వాలని కోరనున్నారు.