బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ 2024 తొలి టెస్టు మొదటి ఇన్నింగ్స్‌లో భారత బౌలర్లు అదరగొట్టారు. ఆతిథ్య ఆస్ట్రేలియాను 104 పరుగులకు ఆలౌట్ చేశారు. ఓవర్‌నైట్ 67/7 స్కోరుతో రెండో రోజు ఆటను ప్రారంభించిన ఆసీస్ మరో 37 రన్స్ జోడించి ఆలౌట్ అయింది. టెయిలెండర్స్ మిచెల్ స్టార్క్ (26: 112 బంతుల్లో 2 ఫోర్లు), హేజిల్‌వుడ్ (7 నాటౌట్; 31 బంతుల్లో)తో భారత బౌలర్ల సహనానికి పరీక్ష పెట్టారు. చివరకు హర్షిత్ రాణా వికెట్ తీయడంతో భారత్ ఊపిరి…
పెర్త్‌లోని ఆప్టస్ స్టేడియంలో ఆస్ట్రేలియాతో జరుగుతున్న మొదటి టెస్టులో భారత్ స్టాండ్ ఇన్ కెప్టెన్ జస్ప్రీత్ బుమ్రా అత్యుత్తమ ప్రదర్శన చేశాడు. ఫస్ట్ ఇన్నింగ్స్‌లో మొదటిరోజు ముగిసేసరికి 10 ఓవర్లు బౌలింగ్ చేసి కేవలం 17 పరుగులు మాత్రమే ఇచ్చి.. 4 కీలక వికెట్స్ పడగొట్టాడు. నాథన్ మెక్‌స్వీ, స్టీవ్ స్మిత్, ఉస్మాన్ ఖావాజా సహా కెప్టెన్ ప్యాట్ కమ్మిన్స్‌ను అవుట్ చేశాడు. బ్యాటింగ్‌లో తక్కువ స్కోరుకే పరిమితమై.. డీలా పడ్డ టీమిండియాలో బుమ్రా తన సంచలన…
టీమిండియా తాత్కాలిక కెప్టెన్, స్టార్ ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా అరుదైన ఫీట్ నమోదు చేశాడు. టెస్టు క్రికెట్లో ఆస్ట్రేలియా స్టార్ బ్యాటర్ స్టీవ్ స్మిత్‌ను గోల్డెన్ డకౌట్ చేసిన రెండో బౌలర్‌గా రికార్డుల్లోకెక్కాడు. బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ 2024లో భాగంగా పెర్త్ వేదికగా జరుగుతున్న మొదటి టెస్టులో స్మిత్‌ను బుమ్రా మొదటి బంతికే అవుట్ చేశాడు. ఎల్బీ రూపంలో గోల్డెన్ డకౌట్ అయిన స్మిత్ నిరాశగా పెవిలియన్ చేరాడు. అయితే అతడు రివ్యూ కూడా తీసుకోకుండా వెళ్ళిపోయాడు.…
Ind vs Aus KL Rahul: బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా పెర్త్‌లోని ఆప్టస్ స్టేడియంలో భారత్, ఆస్ట్రేలియా మధ్య తొలి మ్యాచ్ జరుగుతోంది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా లంచ్ సమయానికి 25 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 51 పరుగులు చేసింది. ఈ మ్యాచ్‌లో, లంచ్‌కు కొంత సమయం ముందు ఒక ఆశ్చర్యకరమైన సంఘటన కనిపించింది. ప్రస్తుతం కేఎల్ రాహుల్ అవుట్ అయినా తీరు ప్రపంచవ్యాప్తంగా చర్చలకు దారితీస్తోంది. మొదట ఫీల్డ్…
బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ 2024-25లో భాగంగా పెర్త్ వేదికగా ఆస్ట్రేలియా, భారత్ జట్ల మధ్య తొలి టెస్టు ప్రారంభమైంది. టాస్ సమయంలోనే పెర్త్ టెస్టుకు ఓ అరుదైన ఘనత దక్కింది. క్రికెట్ చరిత్రలో ఈ రెండు జట్లకు ఫాస్ట్ బౌలర్లు కెప్టెన్లుగా వ్యవహరించడం ఇదే తొలిసారి. 1947 తర్వాత తొలిసారి ఇరు జట్ల సారథులూ బౌలర్లే కావడం ఇదే మొదటిసారి. భారత జట్టుకు జస్ప్రీత్ బుమ్రా, ఆసీస్‌కు ప్యాట్ కమిన్స్ కెప్టెన్లుగా వ్యవహరిస్తున్నారు. 2021 చివరి నుండి ప్యాట్…
బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ 2024-25కి సమయం ఆసన్నమైంది. ఐదు టెస్ట్ మ్యాచుల సిరీస్‌లో భాగంగా పెర్త్ వేదికగా శుక్రవారం నుంచి ఆస్ట్రేలియా, భారత్ జట్ల మధ్య తొలి టెస్టు ప్రారంభం కానుంది. ఈ టెస్టులో విజయం సాధించాలని ఇరు జట్లు బరిలోకి దిగుతున్నాయి. పెర్త్ పిచ్‌లో ఇంట్రాస్క్వాడ్ వార్మప్ మ్యాచ్ ఆడిన భారత్ ఆటగాళ్లు.. అక్కడి పరిస్థితులపై అవగాహన తెచ్చుకున్నారు. ప్రాక్టీస్ సెషన్స్‌లోనూ తీవ్రంగా సాధన చేస్తున్నారు. పెర్త్‌లో ట్రైనింగ్ సెషన్‌ను ప్రత్యక్షంగా చూసిన ఆస్ట్రేలియా మాజీ ఆటగాడు…
పేసర్లు కెప్టెన్లుగా ఉండాలని తాను ఎప్పుడూ చెబుతుంటానని, మైదానంలో వారి ట్రిక్‌లు భిన్నంగా ఉంటాయని టీమిండియా తాత్కాలిక కెప్టెన్ జస్ప్రీత్ బుమ్రా తెలిపాడు. కపిల్ దేవ్ సహా గతంలో చాలామంది పేసర్లు కెప్టెన్లుగా ఉన్నారని, ఈ కొత్త సంప్రదాయానికి ఇది ప్రారంభం అని తాను ఆశిస్తున్నానన్నారు. కెప్టెన్సీ ఓ గౌరవం అని, తనకు సొంత శైలి ఉందని బుమ్రా చెప్పుకొచ్చాడు. కుమారుడి పుట్టిన కారణంగా రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ శర్మ పెర్త్ టెస్టుకు అందుబాటులో ఉండడం లేదు.…
మరో కొన్ని గంటల్లో బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ 2024-25 ఆరంభం కానుంది. భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య శుక్రవారం నుంచి పెర్త్ వేదికగా తొలి టెస్టు ప్రారంభం కానుంది. ఈ టెస్ట్ కోసం జట్లు నెట్స్‌లో చెమటోడ్చుతున్నాయి. పెర్త్ టెస్టుకు ముందు ఆస్ట్రేలియా క్రికెటర్లు పాట్ కమిన్స్, ట్రావిస్ హెడ్, నాథన్ లైయన్, మిచెల్ మార్ష్ ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఒకవేళ ఆస్ట్రేలియా జట్టును ఎంపిక చేసే అవకాశం వస్తే.. టీమిండియా నుంచి ఎవరిని ఎంచుకుంటావు? అని కమిన్స్‌ను…
బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ 2024-25 మరో రెండు రోజుల్లో ఆరంభం కానుంది. ఐదు టెస్టుల సిరీస్‌లో భాగంగా శుక్రవారం ఆస్ట్రేలియా, భారత్ టీమ్స్ పెర్త్ వేదికగా తొలి టెస్ట్ ఆడనున్నాయి. కుమారుడు పుట్టిన కారణంగా కెప్టెన్ రోహిత్ శర్మ మొదటి టెస్టుకు అందుబాటులో ఉండడం లేదు. రోహిత్ గైర్హాజరీలో వైస్ కెప్టెన్ జస్ప్రీత్ బుమ్రా భారత జట్టును నడిపించనున్నాడు. మొదటి టెస్టులో ఆడే తుది జట్టుపై బుమ్రా ఇప్పటికే ఓ అంచనాకు వచ్చాడని తెలుస్తోంది. రోహిత్ శర్మ జట్టుకు…
బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ 2024-25 నవంబర్ 22 నుంచి ఆరంభం కానుంది. శుక్రవారం నుంచి పెర్త్‌లో జరిగే తొలి టెస్టు మ్యాచ్‌లో భారత కెప్టెన్ రోహిత్ శర్మ ఆడడం లేదు. ఈ విషయాన్ని రోహిత్ శర్మ బీసీసీఐకి తెలియజేసాడు. అతను ఇటీవలే రెండోసారి తండ్రైన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో.. తన కుటుంబంతో కొంత సమయం గడపాలని కోరుకుంటున్నట్లు చెప్పాడు. కాగా.. రోహిత్ గైర్హాజరీలో జట్టు వైస్ కెప్టెన్ ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా జట్టు బాధ్యతలు చేపట్టనున్నాడు.