Bumrah-Hardik: అంతర్జాతీయ మ్యాచ్ షెడ్యూల్‌ను దృష్టిలో ఉంచుకుని భారత కీలక ఆటగాళ్ల వర్క్‌లోడ్ మేనేజ్మెంట్పై జట్టు యాజమాన్యం ప్రత్యేక శ్రద్ధ చూపుతోంది. ఈ నేపథ్యంలో రానున్న న్యూజిలాండ్‌తో జరిగే మూడు వన్డేల సిరీస్‌కు జస్ప్రీత్ బుమ్రా, హార్దిక్ పాండ్యాలకు విశ్రాంతి ఇవ్వాలని నిర్ణయించినట్లు సమాచారం. త్వరలో జరిగే టీ20 ప్రపంచకప్ ప్రధాన లక్ష్యంగా ఉండటంతో.. ఈ ఇద్దరు కీలక వైట్‌బాల్ ఆటగాళ్లు పూర్తిస్థాయిలో ఫిట్‌గా ఉండాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. IP68+IP69+IP69K రేటింగ్స్, Snapdragon 8s…
భారత్ పర్యటన సందర్భంగా జరిగిన కొన్ని అనూహ్య సంఘటనలపై దక్షిణాఫ్రికా కెప్టెన్ టెంబా బవుమా తాజాగా స్పందించారు. టీమిండియా స్టార్స్ జస్ప్రీత్ బుమ్రా, రిషభ్ పంత్ తనపై చేసిన అనుచిత వ్యాఖ్యలపై క్షమాపణలు చెప్పినట్లు వెల్లడించారు. మైదానంలో ఏం జరిగినా అది మైదానం వరకే పరిమితం చేయాలని, ఆ మాటలను మర్చిపోకుండా కసితో పోరాడాలన్నారు. అలాగే ప్రోటీస్ హెడ్ కోచ్ షుక్రీ కాన్రాడ్ చేసిన ‘గ్రోవెల్’ వ్యాఖ్య విషయంలో ఆయన మాటలు మరింత జాగ్రత్తగా ఉండాల్సిందని బవుమా…
దక్షిణాఫ్రికాతో జరుగుతున్న టీ20 సిరీస్‌లో భారత జట్టుకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఆల్‌రౌండర్ అక్షర్ పటేల్ సిరీస్‌లోని మిగిలిన రెండు మ్యాచ్‌లకు దూరమయ్యాడు. అనారోగ్యం కారణంగా అతడు వైదొలగాల్సి వచ్చిందని బీసీసీఐ ప్రకటనలో పేర్కొంది. మూడో టీ20 మ్యాచ్‌లోనూ అక్షర్ ఆడని విషయం తెలిసిందే. వైద్య పరీక్షల నిమిత్తం ప్రస్తుతం అక్షర్ లక్నోలో జట్టుతోనే ఉన్నాడు. అతడి స్థానంలో షాబాజ్ అహ్మద్‌ను జట్టులోకి తీసుకున్నట్లు బీసీసీఐ తెలిపింది. రంజీ ట్రోఫీ, సయ్యద్ ముస్తాఖ్ అలీ ట్రోఫీలో రాణించడంతో…
Arshdeep Singh jokes on Jasprit Bumrah bowling: సోషల్ మీడియాలో చురుకుగా ఉండే టీమిండియా స్పిన్నర్ యుజ్వేంద్ర చహల్ ఇప్పుడు భారత జట్టుకు దూరమైన విషయం తెలిసిందే. మ్యాచ్‌కు ముందు, మ్యాచ్ అనంతరం సహచరులతో యూజీ చేసే అల్లరిని మనం మిస్ అయ్యాము. అయితే ఆ లోటును పూడ్చడానికి పేస్ బౌలర్ అర్ష్‌దీప్ సింగ్ వచ్చాడు. ఇటీవలి రోజుల్లో చహల్ మాదిరే అర్ష్‌దీప్ కూడా సహచరులతో కలిసి సరదాగా రీల్స్ చేస్తున్నాడు. విశాఖలో దక్షిణాఫ్రికాతో జరిగిన…
‘ఆట’ అన్నాక గాయాలు అవ్వడం సహజమే. క్రికెట్ కూడా అందుకు ఏమాత్రం మినహాయింపు కాదు. అంతర్జాతీయ క్రికెట్లో గాయాల పాలు కాని ఆటగాళ్లు చాలా అరుదు అనే చెప్పాలి. ఎందుకంటే ప్రతి ప్లేయర్ ఎప్పుడోకప్పుడు ఇంజురీకి గురవుతాడు. అయితే టీమిండియాకు కొన్నేళ్ల నుంచి గాయాలు పెద్ద సమస్యగా మారుతున్నాయి. స్టార్ ప్లేయర్స్ నెలల తరబడి మైదానంకు దూరమవుతున్నారు. ఈ లిస్ట్ చాలా పెద్దదే. ఇటీవలి గాయాలు చూస్తే.. ప్రస్తుత క్రికెటర్లు మరీ సున్నితంగా తయారవుతున్నారా? అనే సందేహాలు…
IND vs SA: కోల్‌కతా ఈడెన్ గార్డెన్స్ వేదికగా భారత్, దక్షిణాఫ్రికా మధ్య జరుగుతున్న తొలి టెస్ట్ మ్యాచ్ తొలి రోజే దక్షిణాఫ్రికా తక్కువ స్కోరుకే కుప్పకూలింది. టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ ఎంచుకున్న దక్షిణాఫ్రికా, భారత బౌలర్ల ధాటికి కేవలం 159 పరుగులకే కుప్పకూలింది. జస్ప్రీత్ బుమ్రా ధాటికి ప్రోటిస్ బ్యాటర్లు క్యూ కట్టారు. బుమ్రాకి తోడుగా సిరాజ్, ల్దీప్ కూడా కీలక వికెట్లు తీసి మరింత ఒత్తిడి తెచ్చారు. ఓపెనర్లు ఐడెన్ మార్క్రామ్, రికెల్టన్…
Ashwin Questions Gambhir: మెల్బోర్న్లో జరిగిన రెండో T20 లో ఆస్ట్రేలియా చేతిలో భారత్ నాలుగు వికెట్ల తేడాతో ఓడిపోయిన తర్వాత టీమిండియా మాజీ ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్, భారత జట్టు హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్‌ను, జట్టు యాజమాన్యాన్ని సూటిగా ప్రశ్నించారు. ఆస్ట్రేలియాతో జరుగుతున్న సిరీస్‌లో అర్ష్‌దీప్ సింగ్‌ను ప్లేయింగ్ ఎలెవెన్‌లో చేర్చకపోవడంపై ఆయన ఆశ్చర్యం వ్యక్తం చేశాడు. అర్ష్‌దీప్ రికార్డును బట్టి చూస్తే జస్ప్రీత్ బుమ్రా తర్వాత తను ఫాస్ట్ బౌలర్‌గా రెండవ…
క్రికెట్ ఆటలో ఎవరూ ఊహించని పలు రికార్డులు నమోదవుతుంటాయి. మైదానంలో ఎప్పటికప్పుడు ప్రపంచ రికార్డులు బద్దలు అవుతూనే ఉంటాయి. అలాంటి ఒక రేర్ రికార్డు గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. 145 సంవత్సరాల టెస్ట్ క్రికెట్లో ఎన్నడూ సాధించని రికార్డును ఓ టీమిండియా బౌలర్ బ్యాటింగ్‌లో బద్దలు కొట్టాడు. ఈ రికార్డు స్టార్ బ్యాట్స్మెన్లకు కూడా సాధ్యం కాలేదు. భారత ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా బ్యాటింగ్‌లో అరుదైన రికార్డు నెలకొల్పాడు. 2022 సంవత్సరంలో బర్మింగ్‌హామ్ (ఎడ్జ్‌బాస్టన్)లో…
ఐసీసీ టెస్ట్ బౌలింగ్ ర్యాంకింగ్స్‌లో టీమిండియా పేసర్ మహ్మద్ సిరాజ్ దుమ్మురేపాడు. కెరీర్లో అత్యుత్తమ టెస్టు రేటింగ్ పాయింట్లు ఖాతాలో వేసుకున్నాడు. బుధవారం ఐసీసీ విడుదల చేసిన ర్యాంకింగ్స్‌లో మూడు స్థానాలు ఎగబాకిన సిరాజ్.. 12వ స్థానానికి చేరుకున్నాడు. హైదరబాదీ పేసర్ ఖాతాలో ప్రస్తుతం 718 రేటింగ్ పాయింట్లు ఉన్నాయి. వెస్టిండీస్‌తో జరిగిన మొదటి టెస్టులో రెండు ఇన్నింగ్స్‌ల్లో ఏడు వికెట్లు పడగొట్టడంతో సిరాజ్ దూసుకొచ్చాడు. అక్టోబర్ 10 నుంచి న్యూఢిల్లీలో ఆరంభం కానున్న రెండో టెస్టులో…
IND vs WI: అహ్మదాబాద్‌లో జరుగుతున్న భారత్, వెస్టిండీస్ మధ్య తొలి టెస్ట్ మ్యాచ్‌లో కరీబియన్ జట్టు భారీ ఒత్తిడిని ఎదుర్కొవడంతో టీమిండియా బౌలర్ల దెబ్బకి కుప్పకూలింది. టాస్ గెలిచిన వెస్టిండీస్ బ్యాటింగ్ ఎంచుకున్నప్పటికీ, భారత బౌలర్లకు ఎదురొడ్డి నిలవలేక 44.1 ఓవర్లలో 162 పరుగులకే ఆలౌట్ అయింది. వెస్టిండీస్ జట్టు ఆరంభం నుంచే వరుస వికెట్లు కోల్పోయింది. ఓపెనర్ ట్యాగెనరైన్ చాందర్‌పాల్ డక్ అవుట్ కాగా.. జాన్ కాంప్‌బెల్ (8) త్వరగానే పెవిలియన్ చేరారు. మధ్యలో…