సొంతగడ్డపై న్యూజిలాండ్ చేతిలో 3-0తో ఘోర పరాభవం చవిచూసిన టీమిండియా.. ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ (డబ్ల్యూటీసీ) ఫైనల్ రేసులో వెనకపడిపోయింది. డబ్ల్యూటీసీ ఫైనల్‌కు చేరుకోవాలంటే ఆస్ట్రేలియాతో జరిగే బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ 2024లో సిరీస్ విజయంతో పాటు ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోకూడదు. ఐదు టెస్ట్ మ్యాచ్‌ల్లో కనీసం నాలుగింటిలో విజయం సాధించాలంటే.. న్యూజిలాండ్ సిరీస్‌లో పేలవ ప్రదర్శన చేసిన రోహిత్ సేన గొప్పగా పుంజుకోవాల్సి ఉంది. సిరీస్ గెలవాలంటే సీనియర్స్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ గాడిలో…
క్రికెట్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సమయం రానే వచ్చింది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) రిటెన్షన్ జాబితా ప్రకటనకు బీసీసీఐ ఇచ్చిన గడువు నేటితో ముగిసింది. ఈ నేపథ్యంలో పది ఫ్రాంచైజీలు తమ రిటెన్షన్ లిస్ట్‌ను అధికారికంగా ప్రకటించాయి. ఐపీఎల్లో ఐదుసార్లు ఛాంపియన్ అయిన ముంబై ఇండియన్స్ తన రిటైన్ జాబితాను ప్రకటించింది. ముంబై ఓనర్ ఆకాష్ అంబానీ జట్టును సోషల్ మీడియాలో ప్రకటించారు. జస్ప్రీత్ బుమ్రా, రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా,…
టీమిండియా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రాపై ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్ గ్లెన్ మ్యాక్స్‌వెల్ ప్రశంసలు కురిపించాడు. తాను ఎదుర్కొన్న అత్యంత కఠినమైన బౌలర్ బుమ్రానే అని తెలిపాడు. ప్రపంచంలోనే అన్ని ఫార్మాట్లలో ఆల్‌టైమ్ బెస్ట్ బౌలర్‌గా ఎదుగుతున్నాడన్నాడు. బంతిని రెండు వైపులా స్వింగ్ చేయగల సామర్థ్యం బుమ్రా సొంతం అని మ్యాక్స్‌వెల్ పేర్కొన్నాడు. ఆస్ట్రేలియా జట్టు, ఐపీఎల్ మ్యాచ్‌లలో చాలాసార్లు బుమ్రా బౌలింగ్‌ను మ్యాక్సీ ఎదుర్కొన్నాడు. ఈఎస్పీఎన్-క్రిక్ఇన్ఫో షేర్ చేసిన వీడియోలో గ్లెన్ మ్యాక్స్‌వెల్ మాట్లాడుతూ… ‘నేను ఎదుర్కొన్న…
న్యూజిలాండ్‌తో శుక్రవారం జరుగుతున్న తొలి టెస్టు మ్యాచ్‌లో భారత ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా గాయపడ్డాడు. అయితే.. అతనికి గాయం ఎంత తీవ్రంగా ఉందనే దానిపై బీసీసీఐ అప్డేట్ ఇవ్వలేదు. ఇప్పటికే.. మోకాలి గాయం కారణంగా రిషబ్ పంత్ ఆటకు దూరంగా ఉండటంతో టీమ్ మేనేజ్మెంట్లో ఆందోళన పెరిగింది. బుమ్రా వేలికి గాయమైనప్పటికీ.. మూడో రోజు లంచ్ బ్రేక్ తర్వాత బుమ్రా బౌలింగ్ చేశాడు.
India vs New Zealand: భారత్ వేదికగా అక్టోబర్ 16వ తేదీ నుంచి ప్రారంభం కానున్న మూడు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ కోసం 15 మంది సభ్యులతో కూడిన భారత జట్టును బీసీసీఐ ప్రకటించింది.
టెస్టు ర్యాంకింగ్స్‌లో టీమిండియా ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా ప్రపంచ టాప్ ఫాస్ట్ బౌలర్‌గా నిలిచాడు. ఆ తర్వాత.. మరో టీమిండియా స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ఉన్నాడు. బుమ్రా ఇటీవల బంగ్లాదేశ్‌తో ఆడిన రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో అద్భుత ప్రదర్శన చేశాడు. దీంతో.. ఐసీసీ తాజా టెస్ట్ ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానంలో నిలిచాడు.
Zaheer Khan Fab Four: ప్రస్తుత తరంలో అత్యుత్తమ టెస్టు క్రికెటర్లను ‘ఫ్యాబ్ 4’గా ఎంచుకుంటారన్నా విషయం తెలిసిందే. ప్రస్తుతం విరాట్ కోహ్లీ, స్టీవ్ స్మిత్, జో రూట్, కేన్ విలియమ్స్ ఈ జాబితాలో ఉన్నారు. అయితే ఈ ట్యాగ్ కేవలం బ్యాటర్లకేనా?.. బౌలర్లకు వర్తించదా? అనే అనుమానం చాలామంది అభిమానుల్లో ఉంది. తాజాగా టీమిండియా మాజీ పేసర్ జహీర్ ఖాన్ పేస్ విభాగంలో తన ఫ్యాబ్ 4ని ఎంచుకుని.. ఆ లోటును భర్తీ చేశాడు. దీంతో…
IND Playing 11 vs BAN For 2nd Test: బంగ్లాదేశ్‌తో చెన్నైలో జరిగిన తొలి టెస్టులో టీమిండియా ఘన విజయం సాధించింది. బంగ్లాను ఏకంగా 280 పరుగుల తేడాతో చిత్తు చేసింది. అదే ఊపులో కాన్పూర్ వేదికగా శుక్రవారం ఆరంభమయ్యే రెండో టెస్టులోనూ గెలిచి.. సిరీస్ క్లీన్ స్వీప్ చేయాలని రోహిత్ సేన చూస్తోంది. అంతేకాదు సిరీస్‌ను 2-0తో కైవసం చేసుకుని డబ్ల్యూటీసీ పాయింట్స్ టేబుల్లో అగ్రస్థానాన్ని మరింత పదిలం చేసుకోవాలని లక్ష్యంతో రెడీ అవుతోంది.…
Jasprit Bumrah Likely To Rested for IND vs BAN 2nd Test: బంగ్లాదేశ్‌తో చెన్నైలోని చెపాక్ స్టేడియంలో జరిగిన మొదటి టెస్టులో భారత్ ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ విజయంతో వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ (డబ్ల్యూటీసీ) 2023-25లో టీమిండియా తన అగ్ర స్థానాన్ని మరింత పదిలం చేసుకుంది. ఇక సెప్టెంబర్ 27 నుంచి ఆరంభమయ్యే రెండో టెస్టులోనూ గెలిచి.. డబ్ల్యూటీసీ ఫైనల్స్‌కు మరింత చేరువకావాలని భావిస్తోంది. అయితే ఈ కీలక టెస్ట్…
Jasprit Bumrah Record: టీమిండియా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా అరుదైన రికార్డు నెలకొల్పాడు. ఈ ఏడాదిలో అంతర్జాతీయ క్రికెట్ (మూడు ఫార్మాట్స్)లో అత్యధిక వికెట్లు పడగొట్టిన బౌలర్‌గా రికార్డులకెక్కాడు. చెన్నై వేదికగా బంగ్లాదేశ్‌తో జరుగుతున్న తొలి టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో బంగ్లా ఓపెనర్ జకీర్ హసన్‌ను ఔట్ చేసిన బుమ్రా.. ఈ రికార్డును సొంతం చేసుకున్నాడు. 2024లో ఇప్పటివరకు 14 మ్యాచ్‌లు మాత్రమే ఆడిన బుమ్రా ఏకంగా 47 వికెట్లు పడగొట్టాడు. ఇంతకుముందు ఈ రికార్డు…