IND vs AUS: మెల్‌బోర్న్‌లో భారత్, ఆస్ట్రేలియా మధ్య ఐదు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో నాల్గవ మ్యాచ్ జరుగుతోంది. ఈ బాక్సింగ్ డే టెస్టు మ్యాచ్‌లో తొలి రోజు ఆస్ట్రేలియా ఆధిపత్యం కనిపించింది. అయితే, మరోవైపు భారత్‌కు 6 వికెట్లు లభించాయి కూడా. అయితే, నలుగురు బ్యాట్స్‌మెన్‌ల హాఫ్ సెంచరీలతో ఆస్ట్రేలియా 311 పరుగులు చేసింది. ఆస్ట్రేలియాకు శామ్ కాన్‌స్టాస్, ఉస్మాన్ ఖవాజా గట్టి ఆరంభాన్ని అందించారు. కొంటాస్ 60 పరుగుల ఇన్నింగ్స్, ఉస్మాన్ ఖవాజా 57 పరుగులు చేసి ఔటయ్యారు. ఆ తర్వాత మార్నస్ లాబుషాగ్నే 72 పరుగులు వద్ద అవుట్ అవ్వగా.. ఆస్ట్రేలియా స్టార్ బ్యాట్సమెన్ స్టీవెన్ స్మిత్ 68 పరుగులతో క్రీజ్ లో కొనసాగుతున్నాడు. ఇక ప్రస్తుత బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ మూడు టెస్టుల మ్యాచ్‌ల తర్వాత సిరీస్ 1-1తో సమమైంది. తొలి మ్యాచ్‌లో భారత్ విజయం సాధించగా, రెండో మ్యాచ్‌లో ఆస్ట్రేలియా విజయం సాధించింది. గబ్బాలో జరిగిన మ్యాచ్ డ్రా అయింది.
Also Read: Oppo Reno 12: మొబైల్‌పై భారీ డిస్కౌంట్ అందిస్తున్న ఒప్పో
ఇక భారత శిబిరంలో బుమ్రా మూడు వికెట్లు తీయగా.. ఆకాష్ దీప్, రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్ లు చెరో వికెట్ ను పడగొట్టారు. ఆస్ట్రేలియా ఓపెనర్ సామ్ కాన్‌స్టాస్‌పై విరాట్ కోహ్లీ చేసిన కవ్వింపు చర్యను ఐసీసీ సీరియస్ గా తీసుకుంది. దానితో మెల్‌బోర్న్ టెస్టు తొలిరోజు ఆట ముగిసిన వెంటనే విరాట్ కోహ్లీకి జరిమానా విధించారు అధికారులు. విరాట్ కోహ్లీ మ్యాచ్ ఫీజులో 20 శాతం కొత్త విధించారు. నివేదికల ప్రకారం, విరాట్ కోహ్లీ లెవల్ 1 దోషిగా తేలింది. మెల్‌బోర్న్ టెస్టు తొలి రోజు ఆట ముగిసిన వెంటనే విరాట్ కోహ్లీ మ్యాచ్ రిఫరీ ఆండీ పైక్రాఫ్ట్ ముందు మాట్లాడాడు. అక్కడ విరాట్ కోహ్లీ తన నేరాన్ని అంగీకరించాడు. ఆట 10వ ఓవర్ ముగిసిన తర్వాత విరాట్ కోహ్లీ కాన్స్టాస్‌ను భుజంతో ఢీ కొట్టాడు. విరాట్ కోహ్లి మరో ఎండ్‌లో స్లిప్ వైపు వెళుతుండగా, సామ్ కాన్స్టాన్స్ కూడా తన ఎండ్‌ను మార్చుకుంటున్నాడు. ఆ సమయంలో కోహ్లి నేరుగా సామ్ కాన్స్టాన్స్ భుజంను ఢీ కొట్టాడు. ఈ ఘటన తర్వాత విరాట్ కోహ్లీపై పెద్దెత్తున తీవ్ర విమర్శలు వచ్చాయి.