IND vs AUS: భారత్ vs ఆస్ట్రేలియా 5 మ్యాచ్‌ల బోర్డర్ గవాస్కర్ టెస్ట్ సిరీస్‌లో ఐదవ, చివరి టెస్ట్ సిడ్నీ క్రికెట్ గ్రౌండ్‌లో జరుగుతోంది. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా 185 పరుగులకు ఆలౌటైంది. ఇక moiరోజు ఆట ముగిసే సమయానికి ఆస్ట్రేలియా కూడా 9 పరుగులకే 1 వికెట్ కోల్పోయింది. ఆస్ట్రేలియా బాట్స్మెన్ ఉస్మాన్ ఖవాజాను టీమిండియా కెప్టెన్ జస్ప్రీత్ బుమ్రా పెవిలియన్ కు పంపించాడు. ఉస్మాన్ ఖవాజా వికెట్‌కు ముందు.. ఆస్ట్రేలియా బ్యాటింగ్ సమయంలో జస్ప్రీత్ బుమ్రా, సామ్ కాన్‌స్టాంట్స్ మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది.
Also Read: Narendra Modi: ఢిల్లీ ప్రజలకు వరాల జల్లు కురిపించిన ప్రధాని మోడీ
ABSOLUTE CINEMA IN SYDNEY. 🍿
– Sam Konstas involved in an argument with Bumrah.
– Bumrah removed Khawaja on the last ball.
– Team India totally fired up.
– Bumrah gives an ice cold stare to Konstas after the wicket. 🥶#INDvsAUST #AUSvIND pic.twitter.com/sQawQgOYAZ— 𝓟𝓻𝓲𝓷𝓬𝓮 🥂 (@whyy__prince) January 3, 2025
ఇక అంతకుముందు టీమిండియా ఫస్ట్ ఇన్నింగ్స్ లో రిషబ్ పంత్ 40 పరుగులతో భారత్ తరఫున అత్యధిక స్కోరర్‌గా నిలిచాడు. ఆస్ట్రేలియా తరఫున స్కాట్ బోలాండ్ నాలుగు వికెట్లు, మిచెల్ స్టార్క్ మూడు, పాట్ కమిన్స్ రెండు వికెట్లు, లయన్ ఒక వికెట్ తీశారు. భారత ఇన్నింగ్స్‌లో వాషింగ్టన్ సుందర్ వికెట్‌పై దుమారం రేగింది. స్నికో మీటర్ మరోసారి టీమ్ ఇండియాకు ద్రోహం చేసిందని టీమిండియా అభిమానులు గగ్గోలు పెడుతున్నారు. సుందర్ బ్యాట్, గ్లోవ్స్ కు తగలకుండానే స్నికో మీటర్‌పై కదలిక కనిపించింది. దాంతో థర్డ్ అంపైర్ ఔట్ ఇచ్చాడు. పుల్ షాట్‌కు ప్రయత్నించిన పంత్ మరోసారి అవుటయ్యాడు. విరాట్ కోహ్లి పరిస్థితి ఫామ్ అలాగే కొనసాదింది. అతను ఈ సిరీస్‌లో 7వ సారి స్లిప్‌లో క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు.
Stumps on Day 1 in Sydney!
Captain Jasprit Bumrah with the opening wicket for #TeamIndia 🙌
Australia 9/1, trail by 176 runs.
Scorecard – https://t.co/NFmndHLfxu#AUSvIND pic.twitter.com/Z3tFKsqwM2
— BCCI (@BCCI) January 3, 2025