IND vs AUS: బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ (BGT) 2024-25 సిరీస్ లో భాగంగా భారత్, ఆస్ట్రేలియా మధ్య నాల్గవ టెస్ట్ మెల్‌బోర్న్ క్రికెట్ గ్రౌండ్ (MCG)లో జరుగుతోంది. ఈ మ్యాచ్ డిసెంబర్ 26న మొదలు కాగా.. నేడు మూడో రోజు (డిసెంబర్ 28) భారత జట్టు తన తొలి ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్ చేస్తోంది. లంచ్ సమయానికి భారత జట్టు స్కోరు 244/7 వద్ద కొనసాగుతుంది. క్రీజులో వాషింగ్టన్ సుందర్, నితీష్ కుమార్ రెడ్డి ఉన్నారు. ఫాలోఆన్‌ను తప్పించుకోవాలంటే భారత్ స్కోరు 275 పరుగులు దాటాలి. అంటే టీమిండియా ఫాలో ఆన్ తప్పించుకోవాలంటే మరో 30 పరుగులు చేయాల్సి ఉంది. ఈ మ్యాచ్‌లో తొలి ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా జట్టు 474 పరుగులకు పరిమితమైంది. ఇందులో స్టీవ్ స్మిత్ 140 పరుగులతో అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు. జస్ప్రీత్ బుమ్రా అత్యధికంగా 4 వికెట్లు పడగొట్టాడు.
Also Read: Mahesh Babu : మహేష్-రాజమౌళి మూవీ కోసం హాలీవుడ్ లెవల్ అవార్డ్ విన్నింగ్ యాక్టర్
ఇక మూడో రోజు ఆటలో రవీంద్ర జడేజా 17 పరుగుల వద్ద, రిషబ్ పంత్ 28 పరుగులకు పెవిలియన్ చేరారు. ఆస్ట్రేలియా బౌలర్స్ లో స్కాట్ బొలాండ్ 3, పాట్ కమ్మిన్స్ 2 , నాథన్ లియోన్ ఒక వికెట్ ను సాధించారు.