BGT Series: మెల్బోర్న్ వేదికగా జరగనున్న నాలుగో టెస్టుకు ముందు టీమిండియా కష్టాల్లో పడింది. కెప్టెన్ రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్ గాయాల కారణంగా టీమిండియా జట్టు ప్రణాళికలకు ఇబ్బంది కలిగే అవకాశం ఉంది. శనివారం కేఎల్ రాహుల్ చేతికి గాయం కాగా, ఆదివారం రోహిత్ శర్మ మోకాలికి గాయమైంది. ఈ ఇద్దరి గాయాల తీవ్రత ఇంకా స్పష్టంగా తెలియనప్పటికీ, వారు టెస్టుకు దూరమైతే జట్టుకు పెద్ద దెబ్బ అవుతుంది. ఇక 5 టెస్టుల సిరీస్ ప్రస్తుతం…
AUS vs IND: బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా బ్రిస్బేన్ లోని గబ్బా వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడో టెస్టులో భారత జట్టు ‘ఫాలో ఆన్’ ప్రమాదం నుంచి బయటపడింది. జస్ప్రీత్ బుమ్రా, ఆకాశ్ దీప్ చివరి వికెట్కు 39 పరుగుల కీలక భాగస్వామ్యం అందించడంతో టీమిండియా ‘ఫాలో ఆన్’ గండం నుండి బయట పడింది. వీరి మెరుపు ఇన్నింగ్స్తో భారత్ జట్టు ‘ఫాలో ఆన్’ ముప్పును తప్పించుకుంది. ఈ కారణంతో డ్రెస్సింగ్ రూమ్లో టీమిండియా కోచ్…
India Follow On: భారత్, ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న బ్రిస్బేన్లోని గబ్బా వేదికగా 3వ టెస్టు 4వ రోజు అంటే మంగళవారం (డిసెంబర్ 17)న వర్షం, బ్యాడ్ లైట్ కారణంగా ఆట చాలాసార్లు అంతరాయం కలిగింది. అయితే, ఇది భారత జట్టు దృష్టిలో మంచి విషయం అని చెప్పాలి. దీనికి కారణం ట్రావిస్ హెడ్, స్టీవ్ స్మిత్ సెంచరీలతో ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్లో 445 పరుగుల భారీ స్కోర్ చేసింది. ఇక నాల్గవ రోజు ఆట ముగిసే…
బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా భారత్-ఆస్ట్రేలియా మధ్య గబ్బా వేదికగా మూడో టెస్టు మ్యాచ్ జరుగుతోంది. తొలిరోజు మాదిరిగానే మూడో రోజు కూడా వర్షం ప్రభావం చూపింది. కాగా.. ఆసీస్ జట్టు తొలి ఇన్నింగ్స్లో 445 పరుగులు చేసింది. అందుకు బదులుగా బరిలోకి దిగిన టీమిండియా పేలవమైన ప్రదర్శన కనబరిచింది.
ఆస్ట్రేలియాతో జరుగుతున్న బోర్డర్–గవాస్కర్ ట్రోఫీ 2024-25లో భారత పేసర్ జస్ప్రీత్ బుమ్రా అదరగొడుతున్న విషయం తెలిసిందే. మొదటి టెస్టులో 8 వికెట్స్ పడగొట్టిన బుమ్రా.. రెండో టెస్టులో 4 వికెట్స్ తీశాడు. బ్రిస్బేన్ వేదికగా ప్రస్తుతం జరుగుతున్న మూడో టెస్టు తొలి ఇన్నింగ్స్లో ఆరు వికెట్ల ప్రదర్శన చేశాడు. మిగతా బౌలర్లు విఫలమైన చోట ఆరు వికెట్స్ పడగొట్టిన బుమ్రాపై ప్రశంసల వర్షం కురుస్తోంది. అయితే రెండో రోజు ఆట సందర్భంగా బుమ్రాపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన…
భారత జట్టుకు ఆస్ట్రేలియా బ్యాటర్ ట్రావిస్ హెడ్ కొరకరాని కొయ్యగా మారాడు. వన్డే ప్రపంచకప్ 2023లో భారత్ కొంపముంచిన హెడ్.. బోర్డర్–గవాస్కర్ ట్రోఫీ 2024-25లోనూ విజయాలను దూరం చేస్తున్నాడు. అడిలైడ్ టెస్టులో సెంచరీ చేసిన అతడు బ్రిస్బేన్ టెస్టులో శతకం బాదాడు. వన్డే తరహాలో 160 బంతుల్లో 152 పరుగులు చేశాడు. టీమిండియాకు సింహస్వప్నంలా మారిన హెడ్.. జస్ప్రీత్ బుమ్రాపై ప్రశంసలు కురిపించాడు. బుమ్రా అద్భుత బౌలర్ అని, మూడో టెస్టు రెండో రోజు ఆటలో అతడి…
బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ 2024-25లో భాగంగా ఆస్ట్రేలియా, భారత్ జట్ల మధ్య మూడో టెస్టు బ్రిస్బేన్లోని గబ్బా స్టేడియంలో డిసెంబర్ 14 నుంచి ఆరంభం కానుంది. భారత కాలమాన ప్రకారం.. శనివారం ఉదయం 5.50 గంటలకు మ్యాచ్ మొదలు కానుంది. పెర్త్ టెస్టులో భారత్ 295 పరుగుల తేడాతో గెలవగా.. అడిలైడ్ టెస్టులో ఆస్ట్రేలియా 10 వికెట్స్ తేడాతో గెలుపొందింది. ప్రస్తుతం 1-1 సిరీస్ సమంగా ఉన్న నేపథ్యంలో గబ్బా టెస్ట్ కీలకంగా మారింది. ఈ మ్యాచ్ కోసం…
Mohammed Shami Double Century: ప్రస్తుతం దేశంలో దేశీయ క్రికెట్ టోర్నీ సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ 2024 జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ టోర్నీ టి20గా జరుగుతోంది. ఈ టోర్నీ చివరి దశకు చేరుకుంది. ఈ నేపథ్యంలో సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ 2024 మొదటి క్వార్టర్ ఫైనల్ మ్యాచ్ బరోడా, బెంగాల్ జట్ల మధ్య జరిగింది. ఈ మ్యాచ్లో బరోడా జట్టు 41 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఇకపోతే, టీమిండియా స్టార్ బౌలర్…
ICC Mens Player Of The Month: బోర్డర్-గవాస్కర్ సిరీస్ లో అదరగొడుతున్న జస్ప్రీత్ బుమ్రాకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ముందుగా నవంబర్ 2024 నెలకు గాను ఐసీసీ పురుషుల ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డుకు ఐసీసీ జస్ప్రీత్ బుమ్రాను నామినేట్ చేసింది. బుమ్రాతో పాటు మార్కో యాన్సెన్, హారిస్ రౌఫ్ కూడా ఈ అవార్డుకు నామినేట్ అయ్యారు. తాజాగా ఐసీసీ ఈ అవార్డు విజేతను ప్రకటించింది. ఇందులో పాకిస్తాన్ పేసర్ హారిస్ రౌఫ్ ఈ…
ICC Test Rankings: ఇంగ్లాండ్ బ్యాట్స్మన్ హ్యారీ బ్రూక్ బుధవారం ఐసీసీ తాజాగా విడుదల చేసిన ర్యాంకింగ్స్ లో బ్యాటింగ్లో అగ్రస్థానాన్ని అందుకున్నాడు. అతను తన సహచర ఆటగాడు జో రూట్ ను దాటుకొని మొదటి స్థానానికి చేరుకున్నాడు. గత కొంత కాలం నుండి రూట్ మొదటి స్థానంలో ఉన్నాడు. హ్యారీ బ్రూక్ 27 నెలల క్రితం ఇంగ్లాండ్ తరఫున అరంగేట్రం చేశాడు. ఆ తర్వాత చాలా తక్కువ సమయంలో టెస్టుల్లో నంబర్ వన్ బ్యాట్స్మన్ అయ్యాడు.…