వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్‌పై జనసేన నేతలు ఫైర్ అవుతున్నారు.. జనసేన అధినేత, ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌పై దువ్వాడ చేసిన వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న ఆ పార్టీ శ్రేణులు.. ఓవైపు దువ్వాడకు వ్యతిరేకంగా ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తూనే.. మరోవైపు.. వరుసగా పోలీస్ స్టేషన్లలో వైసీపీ ఎమ్మెల్సీపై ఫిర్యాదులు చేస్తున్నారు..
కుటుంబ సభ్యులతో కలిసి ఈ రోజు జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌తో సమావేశం అయ్యారు దొరబాబు.. ఇక, దొరబాబు చేరికకు పవన్ కల్యాణ్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో.. ఈ నెల 9వ తేదీన ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, మున్సిపల్ కౌన్సిలర్ లతో కలిసి విజయవాడలో పవన్ కల్యాణ్ సమక్షంలో జనసేన పార్టీ కండువా కప్పుకోవడానికి సిద్ధం అయ్యారు మాజీ ఎమ్మెల్యే పెండెం దొరబాబు..
మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ చిక్కుల్లో పడ్డారు.. గురువారం రోజు మాధవ్ మీడియాతో మాట్లాడు చేసిన వ్యాఖ్యలపై అనంతపురం జిల్లా ఎస్పీ జగదీష్ కు ఫిర్యాదు చేశారు టీడీపీ, జనసేన నేతలు.. అయితే, నిన్న మీడియాతో మాట్లాడిన మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్.. రాష్ట్రంలో అంతర్యుద్ధం మొదలవుతుందంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన కూటమి నేతలు.. గోరంట్ల మాధవ్ పై చర్యలు తీసుకోవాలని కోరుతూ జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశారు..
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో జనసేన శాసనసభా పక్ష సమావేశం జరిగింది. మంగళగిరిలోని జనసేన పార్టీ ప్రధాన కార్యాలయంలో మూడు గంటల పాటు సుదీర్ఘంగా జరిగిన ఈ సమావేశంలో పలు కీలక అంశాలు ప్రస్తావనకు వచ్చాయి. పార్టీ అధ్యక్షుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో పాటు ఎంపీలు పాల్గొన్నారు.
జనసేన తిరుపతి ఇంఛార్జి కిరణ్ రాయల్‌పై ఓ మహిళ కోటి ఇరవై డబ్బులు ఇవ్వాలంటూ ఆరోపణలు చేయడం, వీడియోలు బయటకు రావడం సంచలన రేపాయి.2013 లో తీసుకున్న డబ్బులు ఎప్పుడో తిరిగి ఇచ్చేశానని కాని ఇచ్చేసిన డబ్బులను, మార్ఫింగ్ వీడియోలతో వైసీపీ నేతలు ఆ మహిళతో కలసి కుట్ర పన్ని ఇలా చేస్తున్నారంటూ తిరుపతి పోలీసులు కిరణ్ రాయల్ ఫిర్యాదు చేశారు..
జూదం, గుండాట, పేకాట మాకొద్దు అంటూ జనసేన వినూత్న నిరసన చేపట్టింది.. కృష్ణా జిల్లా బాపులపాడు మండలం అంపాపురం పంచాయతీ పరిధిలో బాపులపాడు జనసేన మండల కార్యదర్శి కందుకూరి శ్రీధర్ ఆధ్వర్యంలో మూడురోజుల పాటు ఈ నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.. ఈ సందర్భంగా శ్రీధర్ మాట్లాడుతూ.. అంపాపురం గ్రామంలో సంక్రాంతి పండుగను పురస్కరించుకుని సంప్రదాయకంగా జరగవలసిన ఆటల పోటీలను కలుషితం చేస్తున్నారని.. సంక్రాంతి పండగను అడ్డం పెట్టుకుని గుండాట, పేకాట, కోళ్లకు కత్తులు కట్టి హింసాత్మక వాతావరణం…
ఏలూరు జిల్లా నిడమర్రు మండలంలో బావయ్య పాలెం ఈనెల 12వ తేదీ రాత్రి రైస్ మిల్లులో జనసేనకి చెందిన నాయకుడు పుట్టినరోజు సందర్భంగా జరిగిన అశ్లీల నృత్యాలు ఘటనలో పోలీసులు 17 మందిని అరెస్టు చేశారు. ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
కాకినాడ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ(కుడా-KUDA) ఛైర్మన్ తుమ్మల బాబు ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమంలో అపశృతి చోటుచేసుకుంది. పరిమితికి మించి అధికంగా స్టేజ్‌పైకి జనం చేరడంతో ఒక్కసారిగా స్టేజ్ కుప్పకూలింది.
శ్రీకాకుళం జిల్లా టెక్కలికి చెందిన వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్‌కు శనివారం పోలీసులు 41ఏ నోటీసులు జారీ చేశారు. అక్కవరం గ్రామం సమీపంలో దువ్వాడ శ్రీనివాస్ నివాసం ఉంటున్న ఇంటికి వెళ్లి పోలీసులు నోటీసులు అందజేశారు.