Pawan Kalyan: ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ-జనసేన-బీజేపీ మధ్య పొత్తుల వ్యవహారం కొలిక్కి వచ్చింది.. సీట్లపై కూడా ఫైనల్‌గా ఓ నిర్ణయానికి వచ్చారు.. అయితే, గతంలో అనుకున్న సీట్ల కంటే జనసేనకు మరింత కోత పడింది.. ఈ రోజు సీట్ల కోతపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు జనసేన అధినేత పవన్ కల్యాణ్.. నేను తీసుకున్న సీట్లు తక్కువా.. ఎక్కువా.. అనేది పక్కన పెట్టండి. జనసేన, టీడీపీ, బీజేపీలు 175 స్థానాల్లో పోటీ చేస్తున్నాయని భావించాలని సూచించారు.. వైఎస్ జగన్ అధికారంలో ఉండకూడదు. ఒక్కడి దగ్గర ఇంత సంపద ఉండకూడదు అని స్పష్టం చేశారు. జగన్ అధికారంలోకి వస్తే.. రాష్ట్రానికే కాదు.. దేశానికే ముప్పు అని హెచ్చరించారు జనసేనాని.. ఏపీలో జగన్ పోవాలి.. భీమవరంలో గ్రంధి శ్రీనివాస్ పోవాలి అంటూ నినాదాలు చేశారు..
Read Also: Divi Vadthya: రవితేజ పక్కన హీరోయిన్ గా ఛాన్స్.. రాత్రికి రాత్రే లేపేశారు.. నెగిటివ్ కామెంట్స్
గ్రంధి శ్రీనివాసును అక్కడి నుంచి తరిమేయాలని పిలుపునిచ్చారు పవన్.. గ్రంధి భీమవరంలో చాలా మందికి బంధువే. మన కులస్తుడని గ్రంధిని వదిలేయాలా..? అని ప్రశ్నించారు ఓ వీధిరౌడీని ఎమ్మెల్యే చేయడం వల్ల భీమవరంలో నిమ్మకాయ షోడా అమ్ముకునే వ్యక్తిని కూడా బెదిరించే పరిస్థితి వచ్చిందన్నారు. తన డ్రైవరును చంపి డోర్ డెలివరి చేసిన అనంతబాబు మన కులస్తుడేనని వదిలేస్తామా..? జైలుకెళ్లిన అనంతబాబు బెయిల్ మీద వస్తే.. బాస్ ఈజ్ బ్యాక్ అనడం కరెక్టేనా..? అని నిలదీశారు. ఇక, పార్టీ పెట్టడానికి సొంత అన్నను కూడా కాదని వచ్చాను. సొంత అన్నను ఇబ్బంది పెట్టే వచ్చాను అన్నారు పవన్.. నేను గెలిచి ఉంటే భీమవరంలో డంపింగ్ యార్డును తొలగించేవాడిని. నేను చాలా హ్యాండ్సాన్ పొలిటిషీయన్ను.. పద్దతిగా మాట్లాడతాను.. కానీ, ఎదుటి వాళ్లు యుద్ధం కోరుకుంటే నేను దానికి రెడీ అన్నారు.
Read Also: Blood Donation: వామ్మో.. రక్తదానం చేస్తే ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలా..? ఇంకెందుకు ఆలస్యం…!
సిద్ధం.. సిద్ధం అంటూ సీఎం జగన్ కోకిలలా కూస్తున్నాడు. జగన్‌తో యుద్దానికి సిద్ధం.. యుద్ధం అంతిమ ఫలితం ప్రక్షాళనే అన్నారు పవన్ కల్యాణ్.. జగన్ జలగలను తీసేస్తాం.. భీమవరంలో ఉన్న జగన్ జలగ గ్రంధిని తీసేస్తాం. కాపు కులస్తుడని గ్రంధిని వెనకేసుకు వస్తే.. ఆ ప్రభావం కులం మీద పడుతుంది.. ఆలోచించాలని సూచించారు. గొడవలు పెంచే వారు నాకొద్దు.. తగ్గించేవారు కావాలి.. అందుకే రామాంజనేయులను పార్టీలోకి ఆహ్వానించాను అన్నారు. వచ్చే ఎన్నికల్లో జనసేన భీమవరాన్ని కొట్టి తీరాలి. భీమవరంలో జనసేన గెలుపును ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలని సూచించారు పవన్ కల్యాణ్.