నామినేటెడ్ పోస్టుల భర్తీ టీడీపీకి ఛాలెంజింగ్గా మారింది. పెద్ద ఎత్తున ఆశావహులు ఉండటంతో నామినేటెడ్ పదవుల భర్తీ కత్తి మీద సాములా మారింది. టీటీడీ, ఏపీఎస్సార్టీసీ, ఏపీ ఎండీసీ, ఏపీఐఐసీ, ఏపీ ఎంఎస్ఐడీసీ, పీసీబీ, అప్కాబ్, మార్క్ ఫెడ్, దుర్గ గుడి ఛైర్మన్ వంటి కీలక పదవులకు డిమాండ్ పెరిగింది. చాలా మంది నేతలు టీటీడీ బోర్డు మెంబర్ల పదవుల పైనే కన్నేశారు. కొంత మంది సీనియర్ ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు రాకపోవడంతో నామినేటెడ్ పదవుల పైనే దృష్టిపెట్టారు. కేబినెట్ ర్యాంకున్న పదవులకు విపరీతమైన డిమాండ్ ఉంది. సామాజిక సమీకరణాలతో పదవుల నామినేటెడ్ కూర్పు చేయనున్నారు. సీనియార్టీ, సిన్సియార్టీ, లాయల్టీ, యువతకు పెద్ద పీట వేసే యత్నం చేస్తారు.
READ MORE: Nara Lokesh: “మంగళగిరితో ముడిపడిన బంధం నన్ను చేనేత కుటుంబ సభ్యుడిని చేసింది”
చంద్రబాబు టూర్లు, యువగళం పాదయాత్రలో కష్టపడిన వారికి ప్రయార్టీ ఉండే ఛాన్స్ ఉంది. నామినేటెడ్ పోస్టుల భర్తీపై పార్టీ పొలిట్ బ్యూరో భేటీలో చర్చ జరిగింది. నామినేటెడ్ పదవుల భర్తీలో మిత్రపక్షాలకూ సముచిత స్థానం కల్పిస్తున్నట్లు సమాచారం. పార్టీ కోసం కష్టపడ్డ వారి సమాచారాన్ని టీడీపీ ఇప్పటికే క్షేత్ర స్థాయి నుంచి తీసుకుంది. కాగా.. మరో పది రోజుల్లో నామినేటెడ్ పదవులు కేటాయించనున్నట్లు సమాచారం. నామినేటెడ్ పదవుల భర్తీపై ముఖ్యమంత్రి చంద్రబాబు చేస్తున్న విస్తృత కసరత్తు దాదాపు తుదిదశకు చేరుకుంది. మరో వారం, పది రోజుల్లో తొలివిడత భర్తీ ప్రక్రియ చేపట్టనున్నారు. ఆ పార్టీలు పోటీచేసిన దామాషాలోనే నామినేటెడ్ పోస్టులూ ఇవ్వనున్నట్లు టాక్ నడుస్తోంది.