చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఇద్దరు కలిసి త్రికరణశుద్ధితో చెప్పిన హామీలు.. 13 నెలలు అయినా ఎప్పుడు అమలు చేస్తారని మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ ప్రశ్నించారు. 40 శాతం ఓట్లు ఉన్న మాకు ప్రజలు తరుపున అడిగే హక్కు ఉంది.
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తన ఇద్దరు కుమారులతో ఉన్న ఫొటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయింది. పెద్ద కుమారుడు అకీరా నందన్, చిన్న కుమారుడు మార్క్ శంకర్‌లతో కలిసి పవన్ ఈరోజు ఉదయం మంగళగిరిలోని తన నివాసానికి చేరుకున్నారు. హైదరాబాద్ నుంచి ప్రత్యేక హెలికాఫ్టర్‌లో మంగళగిరికి చేరుకోగా.. పవన్ వెంట ఇద్దరు కుమారులు ఉన్నారు. ప్రస్తుతం ముగ్గురి ఫొటో నెట్టింట వైరల్‌గా మారింది. ఫాన్స్ ఈ ఫొటోకు ‘తండ్రీ తనయులు’ అని కామెంట్స్…
కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గంలో కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం కుమార్తె క్రాంతి యాక్టివ్ అవుతున్నారు. పరామర్శల పేరుతో నిత్యం ప్రజలను కలుస్తున్నారు. అంతేకాదు ఆపదలో ఉన్న వారికి ఆర్థిక సాయం చేస్తున్నారు. క్రాంతి నిత్యం జనాల్లో ఉంటూ.. ప్రజాదరణ పెంచుకుంటున్నారు. ఈ క్రమంలో క్రాంతి జనసేన కీలక పదవిపై ఆశలు పెట్టుకున్నట్లు తెలుస్తోంది. ప్రత్తిపాడు నియోజకవర్గం జనసేన ఇంఛార్జి వరుపుల తమ్మయ్య బాబును పార్టీ నుంచి సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే. ప్రత్తిపాడు ప్రభుత్వ…
ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం ఏర్పాటై ఏడాది పూర్తయిన సందర్భంగా... ఇంటింటికి ప్రజా ప్రతినిధులు, పార్టీల నేతలు వెళ్ళి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాల గురించి వివరించాలని నిర్ణయించారు.దీనికి సంబంధించి తెలుగుదేశం పార్టీ సమావేశం నిర్వహించింది. తమ ఏడాది ఘనతను జనంలోకి దూకుడుగా తీసుకువెళ్ళాలని డిసైడయ్యారు టీడీపీ లీడర్స్.
ఆస్ట్రేలియాలోని పెర్త్ నగరానికి చెందిన ఎన్.ఆర్.ఐ. జన సైనికులు, వీర మహిళలతో వర్చువల్ సమావేశంలో శాసన మండలి సభ్యులు, జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి కె. నాగబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అణుశక్తి లాంటి విభిన్న స్వభావాలు కలిగిన నాయకుడు పవన్ కళ్యాణ్ అని అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి పాలన ప్రజలకు చేరువైందన్న ఆయన పిఠాపురం నియోజకవర్గం అభివృద్ధికి రూ.308 కోట్లు ఖర్చు పెట్టారని అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా పశువుల కోసం…
డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. నెలలో 15 రోజులు, రెండు పూటలా రేషన్ సరకుల పంపిణీ చేపట్టనున్నట్లు తెలిపారు. ఆ మేరకు ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. పేదలకు ప్రభుత్వం అందించే రేషన్ సరుకుల చౌక ధరల దుకాణాలు గత ప్రభుత్వంలో మూసేసి, ఇంటింటికి అందిస్తాం అని రూ.1600 కోట్లతో వాహనాలు కొనుగోలు చేసిన విషయాన్ని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గుర్తు చేశారు.
జనసేన పార్టీ నుంచి బహిష్కరణకు గురైన తూగో జిల్లా సినీ డిస్ట్రిబ్యూటర్, అనుశ్రీ ఫిలిమ్స్ అధినేత అత్తి సత్యనారాయణ రాజమండ్రిలో సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రముఖ సినీ నిర్మాత దిల్ రాజుపై తీవ్ర ఆరోపణలు చేస్తూ, తనపై వచ్చిన ఆరోపణలు పూర్తిగా అబద్ధమని, ఇదంతా దిల్ రాజు కుట్రలో భాగమని ఆరోపించారు. సినిమా థియేటర్ల బంద్ విషయంలో తన పేరును దురుద్దేశంతో లాగారని, ఈ వివాదం వెనుక దిల్ రాజు, అతని సోదరుడు శిరీష్ రెడ్డి, సురేష్…
ఇవాళ రాజమండ్రిలో మీడియా ముందుకు జనసేన నుంచి బహిష్కరణకు గురైన అత్తి సత్యనారాయణ అలియాస్ అనుశ్రీ ఫిలిమ్స్ సత్యనారాయణ మీడియా సమావేశం నిర్వహించారు. థియేటర్ల బంద్ కు సూత్రధారి అత్తి సత్యనారాయణ అంటూ ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో ఆయన తన వివరణ ఇచ్చారు. దిల్ రాజుపై అత్తి సత్యనారాయణ సంచలన కామెంట్స్ చేశారు. దురుద్దేశంతోనే దిల్ రాజు నా పేరు చెప్పారు.. పవన్ కళ్యాణ్ వార్నింగ్ ఇవ్వడంతో దిల్ రాజు జనసేన పేరు ఎత్తారని అన్నారు. Also…
తెలుగు రాష్ట్రాల థియేటర్ల బంద్ పిలుపు వ్యవహారంలో జనసేన కీలక నేత, రాజమండ్రి పార్టీ ఇన్చార్జ్ అను శ్రీ సత్యనారాయణ అలియాస్ అత్తి సత్యనారాయణ మీద జనసేన పార్టీ చర్యలు తీసుకుంది. అవాంఛనీయమైన థియేటర్ల బంద్ పిలుపు నిర్ణయంలో మీరు భాగస్వాములేనని మీపై తీవ్రమైన ఆరోపణలు వచ్చినందున, జనసేన పార్టీలోని మీ సభ్యత్వాన్ని రద్దు చేస్తున్నామని, అలాగే మిమ్మల్ని పార్టీ రాజమండ్రి నగర నియోజకవర్గ ఇన్చార్జ్ బాధ్యతల నుంచి తొలగిస్తున్నామని పేర్కొన్నారు. Also Read:Pushpa: పుష్పలో నారా…