ఆస్ట్రేలియాలోని పెర్త్ నగరానికి చెందిన ఎన్.ఆర్.ఐ. జన సైనికులు, వీర మహిళలతో వర్చువల్ సమావేశంలో శాసన మండలి సభ్యులు, జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి కె. నాగబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అణుశక్తి లాంటి విభిన్న స్వభావాలు కలిగిన నాయకుడు పవన్ కళ్యాణ్ అని అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి పాలన ప్రజలకు చేరువైందన్న ఆయన పిఠాపురం నియోజకవర్గం అభివృద్ధికి రూ.308 కోట్లు ఖర్చు పెట్టారని అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా పశువుల కోసం నీటి తొట్టెలు, ఏజెన్సీ వాసులు డోలీ కష్టాలు తీర్చేందుకు రోడ్ల నిర్మాణం చేపట్టారని అన్నారు.
Also Read:The Rajasaab : టీజర్ లో ఆ లుక్ లేదు.. కారణం అదేనా..?
పవన్ కళ్యాణ్ లాంటి నాయకుడు అణుశక్తి లాంటివాడు.. న్యూక్లియర్ అంటే కేవలం పేలుడు కాదు… అది పర్యావరణానికి మేలు చేసే శక్తి. ఈ క్రమంలో పార్టీకి ఆర్థిక సహాయం అందిస్తున్న వీర మహిళలకు కృతజ్ఞతలు తెలిపిన నాగబాబు. కూటమి ప్రభుత్వం ప్రజలకు చేరువైందని అన్నారు. ‘తల్లికి వందనం’ పథకం ద్వారా రూ.10,091 కోట్లను ఒకే రోజు ఖాతాల్లో జమ చేశాం అని ఆయన అన్నారు. ఇక అలాగే 80% పిల్లలకు విద్యార్థి మిత్ర కిట్లు పంపిణీ చేసిన అంశంలో విద్యాశాఖ మంత్రి లోకేష్‌ను అభినందించారు నాగబాబు. రాష్ట్రంలో 55 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశామని, రైతులకు మద్దతుగా నిర్ణయాలు తీసుకుంటున్నామని అన్నారు.
Also Read:Kishan Reddy: కాళేశ్వరం ప్రాజెక్ట్ తెలంగాణకు నష్టం.. కేంద్రమంత్రి షాకింగ్ కామెంట్స్..!
సర్పంచుల అభ్యర్థన మేరకు గ్రామాల్లో మౌలిక సదుపాయాలకు పవన్ నిధుల కేటాయిస్తున్నారని ఆయన అన్నారు. గణతంత్ర, స్వాతంత్ర దినోత్సవాలకు గ్రామ స్థాయిలో రూ.10 వేల, మండల స్థాయిలో రూ.25 వేల రూపాయలు కేటాయిస్తున్నామని అన్నారు. ఇక సంక్షేమం, అభివృద్ధి, సుపరిపాలనలతో రాష్ట్రాన్ని ఎన్డీఏ కూటమి పాలన మలుపు తిప్పిందని అన్నారు. మెగా DSC ద్వారా 16 వేల టీచర్ ఉద్యోగాల భర్తీకి రంగం సిద్ధం చేశామని, పోలవరం, రాజధాని, రైల్వే జోన్, స్టీల్ ప్లాంట్… అన్నీ కూటమి పాలనలోనే మళ్లీ పుంజుకున్నాయని అన్నారు.