Botsa Satyanarayana: పార్వతీపురం మన్యం జిల్లా వైఎస్సాఆర్ కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో శాసనమండలి విపక్ష నేత మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ, రీజనల్ కో-ఆర్డినేటర్ కురుసాల కన్నబాబుతో పాటు అరకు ఎంపీ గుమ్మ తనూజ రాణి, ఉమ్మడి జిల్లా జడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు, మాజీ మంత్రులు పాముల పుష్పా శ్రీవాణి, పీడిక రాజన్న దొర, ఎమ్మెల్సీ పాలవలస విక్రాంత్, మాజీ ఎమ్మెల్యే అలజంగి జోగారావు, విశ్వాసరాయి కళావతి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ.. ప్రజాస్వామ్యంలో రాజకీయాల్లో రెండు పక్షాలు ఉంటాయి.. ఒకటి అధికార పక్షం, రెండొది ప్రతి పక్షం.. ప్రతిపక్షం బాధ్యత ప్రజలు పడుతున్న ఇబ్బందులపై గొంతుగా నిలవడం.. ఇచ్చిన హామీలపై నిలదీయడమే మా బాధ్యత.. అమలు కానీ హామీలపై అడిగితే కేసులు పెట్టడం, నలకమందం అనడం సంప్రదాయం కాదు అని బొత్స సత్యనారాయణ చెప్పుకొచ్చారు.
Read Also: Rising Fear of Marriage: భర్తలను చంపుతున్న భార్యలు.. ఇంత కృరంగా ఎందుకు మారుతున్నారు?
ఇక, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఇద్దరు కలిసి త్రికరణశుద్ధితో చెప్పిన హామీలు.. 13 నెలలు అయినా ఎప్పుడు అమలు చేస్తారని మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ ప్రశ్నించారు. 40 శాతం ఓట్లు ఉన్న మాకు ప్రజలు తరుపున అడిగే హక్కు ఉంది.. ప్రజల చేత నడ్డి ఇరకొట్టించి అమలు చేయించే బాధ్యత మా పార్టీకి ఉందన్నారు. జిల్లా, నియోజకవర్గ, మండల, గ్రామీణ స్థాయిలో ఈ ప్రభుత్వ మోసాలను నిలదీస్తాం.. ఏడాది పాలనలో ఉన్న ఉద్యోగాలు తీసి నిరుద్యోగ భృతి మాట లేకుండా చేశారని మండిపడ్డారు. ఏడాది నుంచి నెలకు రూ. 3 వేల చొప్పున నిరుద్యోగ భృతి రూ. 36 వేలు ఎప్పుడు ఇస్తారని అడిగారు. మా ప్రభుత్వంలో హామీల అమలు కోసం మేనిఫెస్టోను జోబులో పెట్టుకుని తిరిగితే.. కుటమి నాయకులు అమలు చేయాలేక వారి మేనిఫెస్టోను బిరువాలో పెట్టారని బొత్స ఆరోపించారు.
Read Also: Nehal Modi: పీఎన్‌బీ బ్యాంకు మోసం కేసు, అమెరికాలో నీరవ్ మోడీ సోదరుడు నేహాల్ మోడీ అరెస్ట్..
ఇక, పువ్వు పుట్టగానే పరుమలించినట్లు లోకేష్ మంత్రి అయ్యారు అని బొత్స సత్యనారాయణ పేర్కొన్నారు. తండ్రికి మించిన అబద్ధాలు లోకేష్ మాట్లాడుతున్నారు.. అన్నదాత సుఖీభవ కార్యక్రమం పేరు గొప్పగా ఊరు దిబ్బల ఉందన్నారు. ఏడాది పుర్తి అయినప్పటికీ కేంద్రం ఇచ్చిన సాయం తప్ప రాష్ట్రం ఇప్పటి వరకు హామీని అమలు చేయలేదని తెలిపింది. ప్రజల సాక్షిగా మే నెలలో పథకాలు అమలు చేస్తామని చెప్పిన మంత్రి లోకేష్ ఏ మే నెలలో ఇస్తారో చెప్పాలని డిమాండ్ చేశారు. వైద్య విద్యార్థులపై ఆడపిల్లలు, చిన్న పిల్లలు అని చూడకుండా లాఠీ ఛార్జ్ చేయడం ధర్మం కాదన్నారు. ఏం చేసిన అడిగే వారే లేరని ఇష్టానుసారంగా వ్వవహారిచండం సరికాదు అన్నారు. చంద్రబాబు ఎప్పుడు రైతులు, మహిళాలనే మోసం చేసి ముఖ్యమంత్రి అవుతున్నారని ఎమ్మెల్సీ బొత్స విమర్శించారు.