First multiplex in Jammu Kashmir: జమ్మూ కాశ్మీర్ లో కొత్త చరిత్ర మొదలైంది. మూడు దశాబాద్ధాల కాశ్మీరీ ప్రజల కల నెరవేరింది. గతంలో నిత్యం ఉగ్రవాద దాడులు, కాల్పులతో అట్టుడుకుతూ ఉండే కాశ్మీర్ లో ప్రజలు ఇప్పుడిప్పుడే వినోదానికి దగ్గర అవుతున్నారు. కాశ్మీర్ జిల్లాల్లో థియేటర్లు ఓపెన్ అవుతున్నాయి. ఆదివారం పుల్వామా, షోఫియాన్ జిల్లాల్లో మల్లిపర్సస్ థియేటర్లను ప్రారంభించారు జమ్మూ కాశ్మీర్ లెఫ్టినెంట్ జనరల్ మనోజ్ సిన్హా. దీన్ని చారిత్రాత్మక రోజుగా ఆయన అభివర్ణించారు. రానున్న…
Hybrid Terrorists Arrested In Jammu Kashmir: జమ్మూకాశ్మీర్ లో ఇద్దరు హైబ్రిడ్ టెర్రిస్టులను అరెస్ట్ చేశారు. నిషేధిత ఉగ్రవాద సంస్థ అన్సర్ గజ్వత్ ఉల్ హింద్ టెర్రర్ గ్రూపుకు చెందిన ఇద్దరు ఉగ్రవాదుల్ని ఆర్మీ, పోలీసులు కలిసి అరెస్ట్ చేశారు. వీరి వద్ద నుంచి మందుగుండు సామాగ్రి, ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. తీవ్రవాదుల కదలికలు ఉన్నాయనే పక్కా సమాచారంతో అనంత్ నాగ్ జిల్లా వాఘామా-ఓప్జాన్ రోడ్లో ఆర్మీ, పోలీసులు సంయుక్తంగా తనిఖీలు చేపట్టింది. ఈ సమయంలోనే…
Supreme Court: తెలంగాణ, ఏపీలో అసెంబ్లీ సీట్ల పెంపుపై దాఖలైన రిట్ పిటిషన్ను సుప్రీంకోర్టు విచారణకు స్వీకరించింది. తెలంగాణలో అసెంబ్లీ సీట్ల సంఖ్యను 119 నుంచి 153కి, ఆంధ్రప్రదేశ్లో 175 నుండి 225 వరకు పెంచాలని.. ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టం, 2014లోని నిబంధనను అమలు చేసేలా కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ పర్యావర నిపుణుడు ప్రొఫెసర్ కె.పురుషోత్తంరెడ్డి దాఖలు చేసిన రిట్ పిటిషన్ను సుప్రీంకోర్టు విచారణకు స్వీకరించింది. ఈ సందర్భంగా ఈ అంశంపై వివరణ ఇవ్వాలంటూ తెలంగాణ,…
J&K L-G inaugurates cinema halls in Pulwama, Shopian: కాశ్మీర్ ప్రాంతం సినిమా షూటింగులకు ఫేమస్ కానీ.. అక్కడి ప్రజలు మాత్రం సినిమాకు దూరం అయ్యారు. జమ్మూ కాశ్మీర్ ప్రాంతంలో దశాబ్ధాలుగా నెలకొని ఉన్న ఉగ్రవాదం కారణంగా అక్కడి థియేటర్లు అన్ని మూతపడ్డాయి. మళ్లీ ఎవరూ కూడా థియేటర్లను తెరవడానికి ప్రయత్నించలేదు. ఆర్టికల్ 370 రద్దు తరవాత జమ్మూ కాశ్మీర్ లో సాధారణ పరిస్థితులు నెలకొన్నాయి. ఉగ్రవాద కార్యకలాపాలకు భద్రతా బలగాలు చెక్ పెడుతున్నాయి.
Jammu Kashmir Road Accident: జమ్మూ కాశ్మీర్లో గురువారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రాజౌరి జిల్లాలో ఓ బస్సు అదుపుతప్పి లోయలో పడింది. ఈ ఘటనలో ఆరుగురు దుర్మరణం పాలయ్యారు. మరో 25 మంది ప్రయాణికులు గాయపడ్డారు. గాయపడిన వారిలో కొంతమంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. పూంఛ్ నుంచి రాజౌరి వెళ్తున్న బస్సు మంజాకోట్ ప్రాంతం వద్ద అదుపుతప్పి లోయలో పడింది. గాయపడిన వారిని సమీపంలోని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. సమాచారం అందుకున్న…
ఉగ్రవాద సంస్థ అన్సార్ ఘజ్వత్-ఉల్-హింద్ (AGuH)కి అనుబంధంగా ఉండి, వలసదారులను హతమార్చడంలో పాల్గొన్న ఇద్దరు ఉగ్రవాదులు జమ్మూకశ్మీర్లోని శ్రీనగర్లో బుధవారం అర్ధరాత్రి పోలీసుల ఎన్కౌంటర్లో హతమయ్యారు.
జమ్మూకశ్మీర్లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. పూంఛ్ జిల్లాలోని సావ్జియాన్ ప్రాంతంలో మినీ బస్సు లోయలో పడిన ఘటనలో.. 11 మంది ప్రాణాలు కోల్పోగా.. మరో 25 మంది గాయాల పాలయ్యారు.
Mehbooba Mufti comments on Gyanvapi case: జ్ఞానవాపి మసీదు కేసులో వారణాసి జిల్లా కోర్టు ఇచ్చిన తీర్పుపై జమ్మూ కాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి మహబూబా ముఫ్తీ తీవ్రంగా స్పందించారు. ఇది స్పష్టంగా ప్రార్థన స్థలాల చట్టాలను ఉల్లఘించడమే అని అన్నారు. ఉద్యోగాలు కల్పించడంలో, ద్రవ్యోల్భాన్ని నియంత్రించడంలో బీజేపీ ఘోరంగా విఫలమైందని దుయ్యబట్టారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే.. మనం మసీదులు పడగొట్టడంలో ‘‘విశ్వగురువు’’ అవుతామని బీజేపీని ఎద్దేవా చేశారు.
జమ్మూ కాశ్మీర్లోని అనంత్నాగ్ జిల్లాలో బుధవారం భద్రతా దళాలతో జరిగిన ఎన్కౌంటర్లో అల్-ఖైదా అనుబంధ సంస్థ అన్సార్ గజ్వతుల్ హింద్కు చెందిన ఇద్దరు ఉగ్రవాదులను కాల్చిచంపినట్లు పోలీసులు తెలిపారు.
Ghulam Nabi Azad comments on congress party: కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన తర్వాత గులాం నబీ ఆజాద్ ఈ రోజు జమ్మూకాశ్మీర్ లోని జమ్మూ జిల్లాలో భారీ ర్యాలీ నిర్వహించారు. ఆజాద్ మద్దతుదారులు ఈ ర్యాలీలో పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన తర్వాత తొలిసారిగా మెగా ర్యాలీ నిర్వహించారు ఆజాద్. సుమారు 20,000 మంది మద్దతుదారులు ఈ ర్యాలీలో పాల్గొన్నారు. గులాం నబీ ఆజాద్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన…