First multiplex in Jammu Kashmir: శ్రీనగర్‌లో తొలి మల్టీప్లెక్స్ ప్రారంభం.. మూడు దశాబ్ధాల తరువాత ఇప్పుడే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
First multiplex in Jammu Kashmir: జమ్మూ కాశ్మీర్ లో కొత్త చరిత్ర మొదలైంది. మూడు దశాబ్దాల కాశ్మీరీ ప్రజల కల నెరవేరింది. గతంలో నిత్యం ఉగ్రవాద దాడులు, కాల్పులతో అట్టుడుకుతూ ఉండే కాశ్మీర్ లో ప్రజలు ఇప్పుడిప్పుడే వినోదానికి దగ్గర అవుతున్నారు. కాశ్మీర్ జిల్లాల్లో థియేటర్లు ఓపెన్ అవుతున్నాయి. ఆదివారం పుల్వామా, షోఫియాన్ జిల్లాల్లో మల్లిపర్సస్ థియేటర్లను ప్రారంభించారు జమ్మూ కాశ్మీర్ లెఫ్టినెంట్ జనరల్ మనోజ్ సిన్హా. దీన్ని చారిత్రాత్మక రోజుగా ఆయన అభివర్ణించారు. రానున్న రోజుల్లో కాశ్మీర్ వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో థియేటర్లు ప్రారంభం అవుతాయని ఆయన వెల్లడించారు.
Read Also: Bengaluru: నగ్న చిత్రాలను షేర్ చేసిన డాక్టర్‌ని హత్య చేసిన ప్రియురాలు
Also Read
తాజాగా జమ్మూ కాశ్మీర్ చరిత్రలోనే తొలిసారిగా మల్టీప్లెక్స్ ప్రారంభం అయింది. మూడు దశాబ్దాల తర్వాత తొలిసారిగా జమ్మూ కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా మంగళవారం శ్రీనగర్ పట్టణంలో మల్టీప్లెక్స్‌ను ప్రారంభించారు. ఈ ఐనాక్స్ మల్టీప్లెక్స్ పూర్తి కావడానికి మొత్తం 5 ఏళ్ల సమయం పట్టింది. తొలి సినిమాగా అమీర్ ఖాన్ ‘లాల్ సింగ్ చద్ధా’ సినిమాను ప్రదర్శించారు. మొత్తం 520 మంది సీటింగ్ కెపాసిటీతో ఈ థియేటర్ ప్రారంభం అయింది.
1990 నుంచి కాశ్మీర్ ప్రాంతంలో ఉగ్రవాదం ఎక్కువ కావడంతో.. థియేటర్లు నడుపుతున్న యజమానులకు బెదిరింపులు ఎదురయ్యేవి. దీంతో కాశ్మీర్ వ్యాప్తంగా థియేటర్లు మూతపడ్డాయి. 1999లో శ్రీనగర్ లోని రీగల్ థియేటర్ ప్రారంభించాలని చూశారు. అయితే థియేటర్ ప్రారంభం తొలిరోజే ఉగ్రవాదులు దాడి చేశారు. ఈ దాడిలో ఒకరు మరణించగా.. 12 మంది వరకు గాయపడ్డారు. అప్పటి నుంచి థియేటర్ల పూర్తిగా మూతపడ్డాయి. ఆర్టికల్ 370, 35 ఏ రద్దు తర్వాత నుంచి నెమ్మదిగా కాశ్మీర్ లో సాధారణ పరిస్థితులు ఏర్పడ్డాయి. ఉగ్రవాదులను భద్రతాబలగాలు మట్టుపెడుతుండటంతో కాశ్మీర్ లోయ వ్యాప్తంగా శాంతి నెలకొంది.
తాజావార్తలు
-
AP Cabinet: రేపు ఏపీ కేబినెట్ అత్యవసర సమావేశం.. వాటిపైనే కీలక చర్చ..
-
Supreme Court: ‘‘రవాణాను పూర్తిగా నిలిపివేయలేరు’’.. ఢిల్లీ ఆంక్షలపై సుప్రీంకోర్టు
-
Amit Shah: రాహుల్ గాంధీ అబద్ధాల మధ్య బీజేపీ వరస విజయాలు..
-
Delhi Traffic: ఢిల్లీ ట్రాఫిక్‌పై ఆంక్షలు.. 30 ప్రాంతాల్లో వాహనాల రాకపోకలకు అంతరాయం..
-
Netanyahu: ఆమె యూదు వ్యతిరేకి.. నవీ పిళ్లైకు నోబెల్ బహుమతి ఇవ్వడంపై నెతన్యాహు తీవ్ర వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు