Jammu Kashmir-person acting as a spy was arrested: భద్రతా బలగాలు, ఆర్మీకి సంబంధించి సున్నిత సమాచారాన్ని చేరవేస్తున్న వ్యక్తిని అరెస్ట్ చేశారు జమ్మూ కాశ్మీర్ పోలీసులు. జమ్మూ కాశ్మీర్ కిష్త్వార్ జిల్లాకు చెందిన ముస్లిం మత గురువును అరెస్ట్ చేశారు. కాశ్మీరీ జన్బాజ్ ఫోర్స్ అనే పాక్ ఆధారిత ఉగ్రవాద సంస్థతో సన్నిహితంగా ఉన్నట్లు పోలీసులు ఆరోపించారు. భద్రతాబలగాలకు సంబంధించిన కదలికలు, ఫోటోలు వంటి సమాచారాన్ని కూడా ఉగ్రవాదులకు చేరవేసేందుకు సహకరించాడు.
Two terrorists killed in Shopian encounter in jammu kashmir: జమ్మూకాశ్మీర్ లో భద్రతాబలగాలు మరోసారి పైచేయి సాధించాయి. ఉగ్రవాదులను మట్టుపెట్టాయి. జమ్మూ కాశ్మీర్ లో గత కొంత కాలంగా ఉగ్రవాదులు ఏదైనా దాడికి పాల్పడాలని ఉగ్రవాదులు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇటీవల కాలంలో పలువురు స్థానికులు, భద్రతా బలగాలను లక్ష్యంగా చేసుకుని దాడులకు తెగబడ్డారు. కానీ ఎప్పటికప్పుడు ఉగ్రవాదుల ప్లాన్స్ ను భగ్నం చేస్తున్నాయి భద్రతా బలగాలు. ఉగ్రవాదుల ఏరివేతే లక్ష్యంగా ముందుకు సాగుతున్నాయి భద్రతా…
Jammu and Kashmir Congress leaders resign: కాంగ్రెస్ పార్టీకి వరసగా ఎదురుదెబ్బలు తగులుతూనే ఉన్నాయి. ఇప్పటికే పలువురు సీనియర్ నాయకులు కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. ఇప్పటికే కపిల్ సిబల్, జ్యోతిరాథిత్యా సింథియా వంటి నేతలు కాంగ్రెస్ పార్టీకి రాంరాం చెప్పి వేరే పార్టీల్లో చేరారు. ఇటీవల కాంగ్రెస్ సీనియర్ నేత గులాం నబీ ఆజాద్ కూడా కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. ఈ రాజీనామా కాంగ్రెస్ పార్టీకి బిగ్ షాకే అని చెప్పవచ్చు. ఆజాద్…
గత వారం కాంగ్రెస్ నుంచి వైదొలిగిన గులాం నబీ ఆజాద్ కాంగ్రెస్ అత్యున్నత నిర్ణయాధికార సంస్థ, కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ "అర్ధరహితంగా" ఉందని ఆరోపించారు. జీ23 లెటర్ రాయడమే రాహుల్ ఆగ్రహానికి కారణమని ఆయన ఈ సందర్భంగా వెల్లడించారు. తాను కాంగ్రెస్ను వీడాలని పార్టీ పెద్దలు కోరుకున్నారని, తన అవసరం లేదని కాంగ్రెస్ అనుకుందని.. అందుకే న కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసినట్లు ఆయన చెప్పుకొచ్చారు.
ఇదిలా ఉంటే శ్రీనగర్ లోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ( ఎన్ఐటీ) విద్యార్థులకు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఇండియా, పాకిస్తాన్ మ్యాచ్ ఉద్రిక్తతలకు దారి తీసే అవకాశం ఉండటంతో కొన్ని ఆదేశాలను జారీ చేసింది. విద్యార్థులు గ్రూపులగా మ్యాచ్ చూడద్దని.. సోషల్ మీడియా వేదికగా పోస్టులు చేయవద్దని స్టూడెంట్స్ వెల్ఫెర్ డీన్ నోటీసులు జారీ చేశారు. ఎన్ఐటీ విద్యార్థులు మ్యాచ్ సమయంలో తమకు కేటాయించిన గదుల్లోనే ఉండాలని వర్సిటీ అధికారులు కోరారు. మ్యాచ్ జరుగుతున్న సమయంలో…
కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన సీనియర్ నాయకుడు గులాం నబీ ఆజాద్ 14 రోజుల్లో కొత్త పార్టీ పెట్టబోతున్నట్లు తెలుస్తోంది. రెండు వారాల్లోనే కొత్త పార్టీ స్థాపిస్తారని.. గులాం నబీ ఆజాద్కు అత్యంత సన్నిహితుడైన జీఎం సరూరీ వెల్లడించారు.
Three Lashkar Terrorists Arrested In Jammu And Kashmir: జమ్మూ కాశ్మీర్ లో ఉగ్రవేట కొనసాగుతోంది. తాజాగా ముగ్గురు లష్కరే తోయిబా ఉగ్రవాదులను భద్రతా బలగాలు పట్టుకున్నాయి. లష్కరే తోయిబాకు వీరంతా ఓవర్ గ్రౌండ్ వర్కర్లుగా పనిచేస్తున్నారని జమ్మూ కాశ్మీర్ పోలీసులు వెల్లడించారు. 22 రాష్ట్రీయ రైఫిల్స్, సెంట్రల్ రిజర్వ్ ఫోర్స్ జాయింట్ ఆపరేషన్ లో వీరిని పట్టుకున్నారు. సోపోర్ పోలీసులు శుక్రవారం సాయంత్రం పోలీస్ స్టేషన్ పరిధిలోని బొమై చౌక్ వద్ద తనిఖీలు చేస్తున్న…
జమ్మూకశ్మీర్లో కాంగ్రెస్ పార్టీకి మరో ఎదురుదెబ్బ తగిలింది. కాంగ్రెస్ సీనియర్ నేత గులాం నబీ ఆజాద్ రాజీనామాకు మద్దతుగా కాంగ్రెస్కు చెందిన ఐదుగురు నేతలు తమ పదవులకు రాజీనామా చేశారు.
కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ తీరుతో విసుగు చెంది పార్టీకి రాజీనామా చేసిన కశ్మీర్ నేత గులాం నబీ ఆజాద్ జమ్మూ కశ్మీర్లో కొత్తగా పార్టీ పెట్టనున్నట్లు వార్తలొస్తున్నాయి. బీజేపీలో చేరకుండా.. జమ్మూకశ్మీర్లో సొంత పార్టీ పెట్టే అవకాశాలు ఉన్నట్లు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. కశ్మీర్లో అసెంబ్లీ ఎన్నికలకు ఆజాద్ సమాయత్తం అవుతున్నట్లు తెలుస్తోంది.
Terrorist captured along LoC: జమ్మూ కాశ్మీర్ లో పాకిస్థాన్ ఉగ్రవాది పట్టుబడ్డాడు. సరిహద్దులు దాటి భారత సైన్యంపై దాడి చేసేందుకు వచ్చినట్లు తెలుస్తోంది. కాశ్మీర్ రాజౌరీ జిల్లాలో గత రెండు మూడు రోజులుగా చొరబాటుదారుల కదలికలు ఎక్కువయ్యాయి. ఆగస్టు 21న నౌషేరాలోని ఝంగర్ సెక్టార్ లో నియంత్రణ రేఖకు సమీపంలో ఉగ్రవాదులను కదలికను సైన్యం గుర్తించింది. కంచెను కత్తెరించి భారత్ లోకి చొరబడేందుకు ప్రయత్నించారు. అయితే సైనికులు కాల్పుల జరపడంతో ఒకరు గాయపడ్డారు. అతన్ని భద్రతా…