Amit Shah: ఉగ్రవాదంపై యుద్ధం ఇంకా ముగిసిపోలేదు.. మా పోరాటాన్ని కొనసాగిస్తాం!
- పోలీసు అమరవీరులకు నివాళులర్పించిన కేంద్రమంత్రి అమిత్ షా..
- దేశంలో ఉగ్రవాదాన్ని పూర్తిగా తుడిచిపెట్టాలనే సంకల్పంతో చేస్తున్నాం..
- ఉగ్రవాదంపై యుద్ధం ఇంకా ముగిసిపోలేదు.. మా పోరాటాన్ని కొనసాగిస్తాం: అమిత్ షా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Amit Shah: భారతదేశంలో ఉగ్రవాదాన్ని పూర్తిగా తుడిచి పెట్టాలనే సంకల్పంతో తమ సర్కార్ పని చేస్తోందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా వెల్లడించారు. ఢిల్లీలో జరిగిన పోలీసు అమరవీరుల సంస్మరణ కార్యక్రమంలో మాట్లాడుతూ.. జమ్మూకాశ్మీర్‌లో ఉగ్రవాదుల కార్యకలాపాలను అణచివేసేందుకు మా బలగాలు గత పదేళ్లుగా కృషి చేస్తున్నాయి.. అయినప్పటికీ ఉగ్రవాదంపై యుద్ధం ఇంకా ముగిసిపోలేదన్నారు. డ్రగ్స్, భారత వ్యతిరేక చర్యలు, ఉగ్రవాదాన్ని తుడిచి పెట్టడానికి ఎన్డీయే ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోందని తెలిపారు. 2047 నాటికి భారతదేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా మార్చడమే తమ టార్గెట్ అని అమిత్ షా చెప్పుకొచ్చారు.
Read Also: Yahya Sinwar: హమాస్ చీఫ్ సిన్వార్ రహస్య బంకర్లో భారీగా డబ్బు, వ్యక్తిగత షవర్
Also Read
- Central Govt: అడ్వాన్స్ టిప్ విధానాన్ని ఆపేయండి.. క్యాబ్ కంపెనీలకు కేంద్రం ఆదేశాలు
- UPI Charges: ‘‘యూపీఐ ఛార్జీలు రద్దు చేయాలి’’.. సుప్రీంకోర్టులో పిటిషన్..
- UPI Charges: మళ్లీ క్యాష్ ఎకానమీ వైపు భారత్? రిటైలర్ల ఆందోళన
- Cooking Oil Prices: పండగల వేళ సామాన్యుడికి ఊరట.. వంటనూనెలపై దిగుమతి కేంద్రం కీలక అడుగు!
ఇక, స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు దేశాన్ని రక్షించడానికి 36, 468 మంది పోలీసులు తమ ప్రాణాలను కోల్పోయారు.. వారి త్యాగాల వల్లే దేశం సురక్షితంగా ఉందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలిపారు. గత ఏడాది కాలంలో దాదాపు 216 మంది పోలీసు సిబ్బంది విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయారన్నారు. వీరి త్యాగాలను దేశం ఎప్పటికీ మరిచిపోదని చెప్పారు. మా పదేళ్ల పాలనలో జమ్ము కశ్మీర్, వామపక్ష అతివాద ప్రభావిత ప్రాంతాల్లో శాంతి నెలకొంది అని పేర్కొన్నారు. అయినా మా పోరాటాన్ని కొనసాగిస్తామన్నారు. కాశ్మీర్‌లో డ్రగ్స్, సైబర్ నేరాలు, మతపరమైన ఉద్రిక్తతలను సృష్టించేందు కుట్రలు, చొరబాట్లకు పాల్పడుతున్న ఉగ్రవాదులకు వ్యతిరేకంగా పోరాడుతూనే ఉంటామని అమిత్ షా వెల్లడించారు. అయితే, విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన పోలీసు అమరవీరులకుకేంద్ర హోం మంత్రి అమిత్ షా నివాళులర్పించారు. 1959లో లడఖ్‌లో చైనా సైనికులు జరిపిన ఆకస్మిక దాడిలో చనిపోయిన పోలీసులు, ఇతర అధికారుల త్యాగాలను గుర్తు చేసుకుంటూ ప్రతి సంవత్సరం అక్టోబర్ 21వ తేదీన పోలీసు సంస్మరణ దినోత్సవాన్ని భారత ప్రభుత్వం నిర్వహిస్తుంది.
తాజావార్తలు
-
Afghanistan: ఆఫ్ఘాన్‌లో అమ్మాయిగా పుట్టడమే శాపమా?
-
Russia Sanctions Bill: రష్యా నుంచి చమురు కొంటే భారత్‌పై 100% టారిఫ్‌లు? అమెరికా హౌస్‌లో కీలక బిల్లు పాస్
-
Hyderabad Liberation Day : హైదరాబాద్ విమోచన దినోత్సవం.. సెప్టెంబర్ 17 చరిత్ర ఇదే!
-
NTV Comment : కంటెంట్ బాగుంటే ఏ సినిమాని ఎవ్వరూ ఆపలేరు బాస్!
-
OTR : చంద్రగిరి కూటమి పార్టీల ముఖ్యుల మధ్య విభేదాలు
ట్రెండింగ్
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్‌ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్‌లోనే ఐపీఎల్ 2027 వేలం!
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!