Protem Speaker: కేంద్రపాలిత ప్రాంతం జమ్ము అండ్ కాశ్మీర్‌లో సుదీర్ఘకాలం తర్వాత కొత్త ప్రభుత్వం ఏర్పడింది. మొత్తం 90 స్థానాలకు గాను నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ 42 స్థానాల్లో విజయం సాధించగా.. కాంగ్రెస్, ఆప్ మద్దతుతో ప్రభుత్వం ఏర్పడింది. ఇక, ఒమర్ అబ్దుల్లా సీఎంగా ప్రమాణస్వీకారం చేసిన తర్వాత బాధ్యతలను తీసుకున్నారు. ఆయనతో పాటు మరికొందరు మంత్రులుగా బాధ్యతలు చేపట్టారు. త్వరలో కొత్త అసెంబ్లీ కొలువుదీరబోతుంది. ఈ నేపథ్యంలో ఈరోజు (శనివారం) ప్రొటెం స్పీకర్ ప్రమాణస్వీకారం చేశారు.
Read Also: TB Disease: ఈ లక్షణాలు ఉన్నాయా? అయితే టిబి కావొచ్చు.. జాగ్రత్త సుమీ
ఇక, శ్రీనగర్‌లోని రాజ్ భవన్‌లో నేషనల్ కాన్ఫరెన్స్ (ఎన్సీ) పార్టీ సీనియర్ నేత ముబారక్ గుల్ ప్రొటెం స్పీకర్ ప్రమాణస్వీకార కార్యక్రమం జరిగింది. జమ్ముకశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా.. ముబారక్ గుల్ చేత ప్రమాణం చేయించారు. కొత్తగా కొలువుదీరబోయే అసెంబ్లీలో ఎమ్మెల్యేలందరితో గుల్ ప్రమాణ స్వీకారం చేయించనున్నారు. స్పీకర్, డిప్యూటీ స్పీకర్‌ల ఎన్నిక కూడా జరగనుంది. అలాగే, ఒమర్ అబ్దుల్లా క్యాబినెట్ ఇటీవల సమావేశమై జమ్ముకశ్మీర్‌కు రాష్ట్ర హోదా కల్పించాలని తొలి తీర్మానం చేసింది.
Read Also: Sarfaraz-Pant: భాయ్ వెనక్కి వెళ్లిపో.. చిన్నపిల్లాడిలా గంతులేసిన సర్ఫరాజ్! నవ్వుకుండా ఉండలేరు
అయితే, జమ్ము కాశ్మీర్ లో చివరగా బీజేపీ- పీడీపీ సంకీర్ణ ప్రభుత్వం కుప్పకూలడంతో, ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించే ఆర్టికల్ 370ని కేంద్ర సర్కార్ రద్దు చేసి జమ్ము కశ్మీర్, లఢఖ్ అనే రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా విభజించింది. దీంతో కేంద్రం తీరును నిరసిస్తూ పెద్ద ఎత్తున ఆందోళనలు చెలరేగాయి. దీంతో జమ్మూ కాశ్మీర్ లో 2018 నుంచి రాష్ట్రపతి పాలన కొనసాగింది. ప్రస్తుతం పరిస్థితులు మెరుగు పడటంతో ఇటీవల అసెంబ్లీ ఎన్నికలను ఈసీ నిర్వహించింది.
#WATCH | Srinagar: National Conference leader Mubarak Gul takes oath as the J&K Assembly Protem Speaker at Srinagar Raj Bhawan administered by LG Manoj Sinha pic.twitter.com/vzrhI4lhvB
— ANI (@ANI) October 19, 2024