PM Modi: ఉగ్ర దాడికి పాల్పడిన ఎవరినీ వదిలి పెట్టం
- జమ్మూ కాశ్మీర్‌లో ఉగ్ర దాడిని ఖండించిన ప్రధాని మోడీ..
- ఈ దాడికి పాల్పడిన వారిని ఎవరినీ వదిలి పెట్టమని హెచ్చరిక..
- మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపిన ప్రధాని మోడీ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
PM Modi: జమ్మూ కాశ్మీర్‌లో ఉగ్రవాదులు దుశ్చర్యకు పాల్పడ్డారు. అనంత్‌నాగ్ జిల్లాలోని పహల్గామ్‌లోని పర్యాటక ప్రాంతాలను సందర్శించేందుకు వచ్చిన టూరిస్టులపై కాల్పులకు తెగబడ్డారు. ఈ కాల్పుల్లో ఇప్పటి వరకు భారీగా ప్రాణ నష్టం వాటిల్లింది. అలాగే, అనేక మంది గాయపడ్డారు. ఈ ఘటనపై సౌదీ అరేబియా పర్యటనలో ఉన్న ప్రధాని నరేంద్ర మోడీ ఆరా తీశారు. దాడి గురించిన వివరాలను కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా నుంచి అడిగి తెలుసుకున్నారు. సంఘటన స్థలాన్ని సందర్శించాల్సిందిగా అమిత్ షాకు ప్రధాని మోడీ ఆదేశించారు. ఘటనపై తక్షణమే తగిన చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు.
Read Also: CM Revanth Reddy : ముగిసిన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి జపాన్ పర్యటన
Also Read
- PM Modi: ఢిల్లీలో నిరసనలు.. చెన్నైలో Gen Zతో మోడీ ముచ్చట్లు.!
- Police VS CJP: అభిజిత్ దీప్కే ఆరోపణలు.. సాక్ష్యంగా ఢిల్లీ పోలీసులు వీడియో రిలీజ్.
- Mahant Rajudas: మోడీ జీ, అలాంటి జెన్-జీపై చర్యలు తీసుకోండి.. సీజేపీపై మహంత్ రాజూదాస్ ఆగ్రహం..
- Abhijeet Dipke: ‘‘సంతకం చేయలేదు, మళ్లీ వీధుల్లోకి వస్తాం’’.. CJP దీప్కే సంచలన ప్రకటన.!
ఇక, ఎక్స్ వేదికగా స్పందించిన ప్రధాని మోడీ.. బైసరన్ లోయలోకి వెళ్లిన పర్యాటకులపై కాల్పులు జరిపిన ఉగ్రవాదులు తీవ్ర పరిణామాలు ఎదుర్కొంటారని తెలిపారు. ఈ దాడికి పాల్పడిన వారిని ఎవరినీ కూడా వదిలి పెట్టమని హెచ్చరించారు. నిందితులను న్యాయస్థానం ముందు నిలబెడుతామని ప్రతిజ్ఞ చేశారు. ఈ దాడుల్లో మరణించిన వారి కుటుంబాలకు ప్రధాన మంత్రి సంతాపాన్ని వ్యక్తం చేశారు. బాధితులకు సాధ్యమైనంత త్వరగా సహాయం అందిస్తామని ప్రధాని మోడీ చెప్పుకొచ్చారు.
Read Also: Vijayashanthi: ‘సరిలేరు నీకెవ్వరు‘ విషయంలో అంత తృప్తిగా లేరు.. ప్రేక్షకులు సంతృప్తి కోసమే ఇలా!
కాగా, జమ్ము కాశ్మీర్ లో జరిగిన ఉగ్రదాడి తర్వాత కేంద్రమంత్రి అమిత్ షా తన ఇంట్లో ఒక ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించారు. ఈ మీటింగ్ లో వర్చువల్ గా జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లాతో పాటు లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా, పోలీసులు, పారామిలిటరీ భద్రతా సంస్థ, సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ సీనియర్ అధికారులు హాజరయ్యారు. బైసరన్ లోయలో జరిగిన ఉగ్ర దాడి గురించి కీలక అంశాలపై చర్చించారు. కాగా, కాసేపట్లో శ్రీనగర్ కు అమిత్ షా చేరుకోనున్నారు.
I strongly condemn the terror attack in Pahalgam, Jammu and Kashmir. Condolences to those who have lost their loved ones. I pray that the injured recover at the earliest. All possible assistance is being provided to those affected.
Those behind this heinous act will be brought…
— Narendra Modi (@narendramodi) April 22, 2025
తాజావార్తలు
-
Shreyas Iyer: ఓడిపోతామనుకున్నా.. అక్కడే మ్యాచ్ మలుపు తిరిగింది..
-
Shai Hope: అదే మా కొంప ముంచింది.. చాలా బాధగా ఉంది.. వెస్టిండీస్ కెప్టెన్ ఆవేదన..
-
Ind vs WI : అభిషేక్ శర్మ మెరుపు అర్ధశతకం.. వెస్టిండీస్‌పై భారత్ ఘన విజయం.!
-
CM Revanth Reddy: గోవాలో బీజేపీపై రేవంత్ రెడ్డి ఫైర్.. ‘ప్రాపర్టీ సావంత్’ అంటూ సెటైర్లు!
-
Naresh: సినిమా నచ్చకపోతే గచ్చిబౌలికి రండి.. తేల్చుకుందాం: నరేష్ ఓపెన్ ఛాలెంజ్
ట్రెండింగ్
-
Wife for Hire : అద్దె భార్యలు.. లక్షల నుంచి కోట్ల వరకు ఒప్పందాలు
-
Most Intelligent: 12 ఏళ్ల వయసుకే 180 IQ.. ఐన్‌స్టీన్‌ను మించిన భారతీయ బాలమేధావి..
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!