జమ్మూ కాశ్మీర్‌లోని అఖ్నూర్ సెక్టార్‌లో ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. నియంత్రణ రేఖ వెంబడి చొరబాటు ప్రయత్నాన్ని భారత సైన్యం తిప్పికొట్టింది. ఈ కాల్పుల్లో ఒక సైనికుడు మృతిచెందాడు. నియంత్రణ రేఖ వెంబడి జరిగిన కాల్పుల్లో ఒక జూనియర్ కమిషన్డ్ అధికారి తీవ్రంగా గాయపడి చనిపోయినట్లు సైన్యం తెలిపింది. బాధితుడిని ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ అమరుడయ్యాడు.
శుక్రవారం రాత్రి ఉగ్రవాదుల చొరబాటును భారత సైన్యం సమర్థవంతంగా తిప్పికొట్టిందని అధికారులు తెలిపారు. కాల్పుల్లో మాత్రం ఒక సైనికుడు చనిపోయినట్లుగా పేర్కొంది.
ఇదిలా ఉంటే జమ్మూ కాశ్మీర్‌లోని కిష్త్వార్ జిల్లాలోని మంచుతో కప్పబడిన ప్రాంతంలో జరిగిన ఆపరేషన్‌లో ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారని సైన్యం శనివారం తెలిపింది. పెద్ద ఎత్తున ఆయుధాలు స్వాధీనం చేసుకున్నారు. ఏకే 47, ఎం4 రైఫిల్ స్వాధీనం చేసుకున్నారు.
#GOC #WhiteKnightCorps and all ranks salute the supreme sacrifice of #Braveheart Sub Kuldeep Chand of 9 PUNJAB. He laid down his life while gallantly leading a #CounterInfiltration operation along the #LineofControl in the #Keri–#Battal area of #Sunderbani on the night of 11 Apr… pic.twitter.com/y6MmMcfTN9
— White Knight Corps (@Whiteknight_IA) April 12, 2025