జమ్మూ కాశ్మీర్ అనంత్‌నాగ్ జిల్లా పహల్గామ్‌లోని బైసరన్‌లో మంగళవారం హృదయ విదారక ఉగ్రవాద దాడి జరిగింది. ఈ దాడి తర్వాత దేశవ్యాప్తంగా ఆగ్రహ వాతావరణం నెలకొంది. ఉగ్రవాదులు పర్యాటకులను లక్ష్యంగా చేసుకున్నారు. ఇప్పటి వరకు 28 మంది మరణించినట్లు సమాచారం. ఈ సంఘటనపై ఐపీఎల్ జట్టు ఢిల్లీ క్యాపిటల్స్ కూడా తీవ్ర విచారం వ్యక్తం చేసింది. ఆ బృందం సోషల్ మీడియాలో ఒక భావోద్వేగ పోస్ట్‌ను పంచుకుంది.
READ MORE: Pahalgam Terror Attack : మా హృదయాలను పిండేస్తోంది.. పహల్గాం దాడిపై సెలబ్రిటీలు
జమ్మూ కాశ్మీర్‌లో జరిగిన ఉగ్రదాడిపై ఢిల్లీ క్యాపిటల్స్ విచారం వ్యక్తం చేసింది. ఈ దాడిలో మరణించిన వారి కుటుంబాలకు సానుభూతి తెలియజేసింది. గాయపడ్డవారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించింది. “పహల్గామ్‌లో జరిగిన విషాద సంఘటనలతో హృదయం బద్దలైంది. బాధితులు, వారి కుటుంబ సభ్యులు, ఈ దారుణమైన చర్య వల్ల ప్రభావితమైన ప్రతి ఒక్కరిని చూసి మా హృదయాలు విలపిస్తున్నాయి. ఈ దుఃఖ సమయంలో మేము వారితో ఉన్నాం. వారికి సంఘీభావం తెలియజేస్తున్నాం.” అని రాసుకొచ్చిన ఢిల్లీ.. వారికి సంఘీభావం ప్రకటించింది. ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు చేసిన ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అభిమానులు కూడా బాధితుల కోసం ప్రార్థిస్తున్నారు.
READ MORE: Pahalgam Terror Attack: 5 రోజుల క్రితమే పెళ్లి.. ఇంతలోనే ప్రాణాలు కోల్పోయిన నేవీ ఆఫీసర్