Terror Attack: జమ్ము కాశ్మీర్‌లోని అనంత్‌నాగ్ జిల్లాలోని పహల్గామ్‌లోని బైసరన్ లోయను చూసేందుకు వచ్చిన పర్యటకులపై ఉగ్రవాదులు కాల్పులకు తెగ బడ్డారు. ఈ ఉగ్ర దాడిలో మృతుల సంఖ్య క్రమంగా పెరిగే అవకాశం ఉంది. అయితే, ఇప్పటి వరకు సుమారు 27 మంది టూరిస్టులు మృతి చెందినట్లు సమాచారం. కాగా, ఈ ఘటనలో గాయపడిన వారిని హెలికాప్టర్ ద్వారా చికిత్స కోసం తరలించారు. వీరిలో పలువురి పరిస్థితి విషమంగా ఉంది. అయితే, మృతుల్లో ఇజ్రాయెల్, ఇటాలియన్ దేశాలకు చెందిన పలువురు పర్యటకులు ఉన్నారు.
Read Also: Tilak Varma: నేను ఉంటే గెలిపించేవాడిని.. తిలక్ వర్మ హాట్ కామెంట్స్
అయితే, జమ్మూ కాశ్మీర్‌లో జరిగిన ఉగ్రవాద దాడిపై ఇజ్రాయెల్ రాయబారి రూవెన్ అజార్ ఎక్స్ (ట్వీట్టర్) వేదికగా స్పందించారు. అమాయక ప్రజల ప్రాణాలను బలి తీసుకుందని విచారం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మరణించిన వారి కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను అని రాసుకొచ్చారు. బాధిత కుటుంబాలకు భారత ప్రభుత్వం అండగా ఉంటుందని పేర్కొన్నారు. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా చేస్తున్న పోరాటంలో భద్రతా దళాలకు మా మద్దతు ఉంది అని భారతదేశంలో ఇజ్రాయెల్ రాయబారి రూవెన్ అజార్ వెల్లడించారు.
Read Also: Pahalgam terror attack: ‘‘వెళ్లి మోడీకి చెప్పండి’’.. పహల్గామ్ దాడి తర్వాత టెర్రరిస్టుల పైశాచికం..
మరోవైపు, ఈ ఉగ్ర దాడిలో హిందువులను గుర్తించి మరి చంపేసినట్లు తేలింది. సుమారు 27 మందికి పైగా మృతి చెందారు. ఈ అంశాన్ని కేంద్ర ప్రభుత్వం అత్యంత సీరియస్ గా తీసుకుంది. ప్రధాని మోడీ ఆదేశాలో హుటాహుటిన జమ్మూ కాశ్మీర్ కు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా బయలుదేరి వెళ్లిపోయారు. ఉగ్రవాదుల ఏరివేతపై ప్రత్యేక కార్యాచరణను కేంద్రం సిద్ధం చేయనుంది.
Ambassador of Israel to India, Reuven Azar tweets, "Sad and appalled following the terrorist attack in J&K which took the lives of innocent civilians. Our thoughts are with the victims and their families, and our support is for the security forces in their struggle against… pic.twitter.com/TIkIWSmIKV
— ANI (@ANI) April 22, 2025