జమ్మూ కాశ్మీర్ పహల్గామ్‌లోని బైసరన్ లోయలో జరిగిన ఉగ్రవాద దాడి యావత్ దేశాన్ని కుదిపేసింది. ఈ దాడిలో ఇప్పటివరకు 28 మంది మరణించినట్లు సమాచారం. ప్రభుత్వం నుంచి ఇప్పటి వరకు ఎలాంటి సమాచారం రాలేదు. ఈ దాడికి బాధ్యతను టీఆర్‌ఎఫ్ అనే ఉగ్రవాద సంస్థ తీసుకుంది. ఈ సంస్థ పాకిస్థాన్‌కు చెందిన ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబాకు చెందిన ‘ది రెసిస్టెన్స్ ఫ్రంట్’గా గుర్తించారు. జమ్మూ కాశ్మీర్‌లో లష్కరే, టీఆర్‌ఎఫ్ ఉగ్రవాద కార్యకలాపాల వెనుక ఉగ్రవాది సైఫుల్లా ఖలీద్ హస్తం ఉందని వర్గాలు వెల్లడించాయి. ఈ దాడులకు అతనే ప్రధాన సూత్రధారి అని తెలుస్తోంది. ఈ వార్తను జాతీయ మీడియా సంస్థ “ఆజ్‌తక్” క్లైమ్ చేసింది.
READ MORE; KCR : “ఇది అమానవీయ చర్య”.. ఉగ్రదాడిపై కేసీఆర్ దిగ్భ్రాంతి
ఆజ్‌తక్ ప్రకారం.. లష్కరే తోయిబా డిప్యూటీ చీఫ్ సైఫుల్లా ఖలీద్‌ను సైఫుల్లా కసూరి అని కూడా పిలుస్తారు. అతనికి భారతదేశ అతిపెద్ద శత్రువువైన హఫీజ్ సయీద్‌కు చాలా దగ్గర సంబంధాలు ఉన్నాయి. భారతదేశంలో జరిగిన అనేక ప్రధాన ఉగ్రవాద దాడులలో వీడి పేరు ప్రస్తావించబడింది. వీడు ఎప్పుడూ లగ్జరీ కార్లతో ప్రయాణిస్తాడట. ఎల్లప్పుడూ అత్యాధునిక ఆయుధాలను కలిగి ఉంటాడట. పాకిస్థాన్‌కి చెందిన సైనిక అధికారులు కూడా వీడిపై పూల వర్షం కురిపిస్తారట. వీడిని పాకిస్థాన్ ఆర్మీ సైనికులను రెచ్చగొట్టడానికి వాడుతారట.
READ MORE; Donald Trump : ప్రధాని మోడీకి ట్రంప్ ఫోన్.. కలిసి పోరాడుదామని మద్దతు
తాజా ఉగ్రవాద దాడికి కేవలం రెండు నెలల ముందు, సైఫుల్లా ఖలీద్ పాకిస్థాన్ పంజాబ్‌లోని కంగన్‌పూర్‌కు చేరుకున్నాడు. అక్కడి పాకిస్థాన్ బెటాలియన్ ఉంది. పాకిస్థానీ ఆర్మీ కల్నల్ జాహిద్ జరీన్ ఖట్టక్.. జిహాదీ ప్రసంగం చేయడానికి ఈ మూర్ఖుడిని ఆహ్వానించాడు. ఈ సైఫుల్లాఈ ఖలీద్ అక్కడికి చేరుకోగానే పాక్ కల్నల్ స్వయంగా అతనిపై పూల వర్షం కురిపించాడు. వీడి ప్రసంగం పాకిస్థాన్ సైన్యాన్ని తీవ్రంగా రెచ్చగొట్టింది. భారతీయ సైనికులను ఎంత ఎక్కువగా చంపితే, అల్లాహ్ వారికి అంత ఎక్కువ ప్రతిఫలం ఇస్తాడని ఈ మూర్ఖుడు ప్రసంగంలో చెప్పాడట.