ఇస్లామాబాద్‌లో జరిగిన షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ (ఎస్‌సిఓ) సమావేశంలో భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ పాల్గొన్నారు. కానీ, పాకిస్థాన్ ఆయన ప్రసంగాన్ని ప్రత్యక్ష ప్రసారం చేయలేదు. జైశంకర్ సూటిపోటి మాటలకు భయపడి పాక్ ఈ చాకచక్య చర్య తీసుకుందని చెబుతున్నారు.
S Jaishankar: షాంఘై సహకార సంస్థ (ఎస్‌సిఓ) శిఖరాగ్ర సమావేశం పాకిస్థాన్ రాజధాని ఇస్లామాబాద్‌లో జరుగుతోంది. బుధవారం ఎస్‌సీఓ మీటింగ్స్ ప్రారంభమయ్యాయి. భారతదేశం తరుపున విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ నిన్న ఇస్లామాబాద్ వెళ్లారు. ఇదిలా ఉంటే, పాకిస్తాన్ గడ్డపైనే ఆ దేశానికి జైశంకర్ చురకలంటించారు. రెండు దేశాల మధ్య సరిహద్దు కార్యకలాపాలు ఉగ్రవాదం, వేర్పాటువాదంతో కూడి ఉంటే, అది ద్వైపాక్షిక వాణిజ్యం, సంబంధాలు సహాయపడేందుకు సహకరించవని అన్నారు.
SCO Summit 2024: షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ సమ్మిట్ (SCO సమ్మిట్ 2024)లో పాల్గొనడానికి భారతదేశ విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ పాకిస్తాన్ లోని ఇస్లామాబాద్ చేరుకున్నారు. వివిధ దేశాల ప్రతినిధులతో అధికారిక సమావేశాలతో పాటు జైశంకర్ ఖాళీ సమయాన్ని అక్కడే ఎంజాయ్ చేస్తున్నారు. జైశంకర్ బుధవారం (16 అక్టోబర్ 2024) ఉదయం సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ Xలో ఓ చిత్రాన్ని పంచుకున్నారు. X లో ఫోటోను పంచుకుంటూ, “మా హైకమిషన్ ప్రాంగణంలో భారత్-పాకిస్తాన్ దేశాల సహచరులతో…
Pakistan SCO Meeting: పాకిస్థాన్ వేదికగా షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ (SCO) సదస్సు నేటి (మంగళవారం) నుంచి ప్రారంభం కానుంది. ఇందు కోసం పాక్ రాజధాని ఇస్లామాబాద్‌లో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు.
దాదాపు తొమ్మిదేళ్ల తర్వాత భారత్‌కు చెందిన విదేశాంగ మంత్రి జైశంకర్ పాకిస్థాన్ లో పర్యటించనున్నారు. గతంలో సుష్మా స్వరాజ్ పాక్ లో పర్యటించారు. ఇప్పటి నుంచి ఇప్పటి వరకు మన దేశం నుంచి ఎవ్వరూ మళ్లీ శత్రుదేశం పాకిస్థాన్ కి వెళ్లలేదు.
విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ జర్మనీ పర్యటనలో ఉన్నారు. ఈ సందర్భంగా.. ఛాన్సలర్ ఓలాఫ్ స్కోల్జ్, ఇతర మంత్రులతో వివిధ ద్వైపాక్షిక, ప్రపంచ సమస్యలపై చర్చించారు.
Jaishankar talked about Israel and Hamas issue: సౌదీ అరేబియా రాజధాని రియాద్ లో వ్యూహాత్మక చర్చల కోసం భారత్ – గల్ఫ్ సహకార మండలి (GCC) తొలి మంత్రివర్గ సమావేశంలో భారత విదేశాంగ మంత్రి జైశంకర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన పాలస్తీనాలోని పరిస్థితులపై మాట్లాడారు. ఎస్. జైశంకర్ గాజాలో పరిస్థితిని భారతదేశం యొక్క “అతిపెద్ద ఆందోళన” గా అభివర్ణించారు. అలాగే భారతదేశం ఇజ్రాయెల్-హమాస్ కాల్పుల విరమణకు అనుకూలంగా ఉందని తెలిపారు. iPhone 16…
Jaishankar on china: చైనాపై భారత విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్ హాట్ కామెంట్స్ చేశారు. భారత్‌తో పాటు ప్రపంచంలోని వివిధ దేశాలు చైనా నుంచి సమస్యలు ఎదుర్కొంటున్నాయని చెప్పుకొచ్చారు.
UPI Payments: మాల్దీవుల్లో యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ (UPI) వ్యవస్థను అమలు చేయడానికి మాల్దీవులతో భారతదేశం అవగాహన ఒప్పందం (MOU) పై సంతకం చేసింది. ఈ చొరవ వల్ల మాల్దీవుల పర్యాటక పరిశ్రమను గణనీయంగా పెంచుతుందని అంచనా వేస్తున్నారు. విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ మూడు రోజుల అధికారిక పర్యటన సందర్భంగా శుక్రవారం ఈ ఒప్పందాన్ని అధికారికంగా ప్రారంభించారు. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) యొక్క ఆవిష్కరణ అయిన యూపీఐ సిస్టమ్ మొబైల్ ఫోన్ల…