Jaishankar : భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ ఐదు రోజుల రష్యా పర్యటనలో ఉన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తమిళనాడులోని కూడంకుళం అణువిద్యుత్ ప్లాంట్ భవిష్యత్ విద్యుత్ ఉత్పత్తి యూనిట్ల నిర్మాణానికి సంబంధించిన కొన్ని ముఖ్యమైన ఒప్పందాలపై భారత్, రష్యా మంగళవారం సంతకాలు చేశాయన్నారు.
S JaiShankar: హిందూ మహాసముద్రం ప్రాంతంలోని అభివృద్ధి సవాళ్లను ఎదుర్కోవాలని బుధవారం ఇండియా పిలుపునిచ్చింది. శ్రీలంక రాజధాని కొలంబోలో జరుగుతున్న ఇండియన్ ఓషియన్ రిమ్ అసోసియేషన్(IORA) సమావేశంలో విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ.. యూఎన్ కన్వెన్షన్ ఆధారంగా హిందూ మహాసముద్రం స్వేచ్ఛా, బహిరంగ, సమ్మిళిత ప్రదేశంగా ఉండాలని అన్నారు.
చైనా సోమవారం రిలీజ్ చేసిన కొత్త మ్యాప్ ను చైనా వార్తాపత్రిక గ్లోబల్ టైమ్స్ సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ X (ట్విట్టర్)లో పోస్ట్ చేసింది. అందులో తమ భూభాగంలో భారతదేశ ప్రాంతాలను చూపించింది. ఈ వ్యూహంపై విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్. జైశంకర్ స్పందించారు.
మళ్లీ రాజ్యసభ సభ్యుడిగా విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ సోమవారం ప్రమాణ స్వీకారం చేశారు. రాజ్యసభ సభ్యులుగా ప్రమాణ స్వీకారం చేసిన వారిలో 9 మంది ఎంపీలు ఉన్నారు.
చైనాతో దౌత్యానికి సమయం పడుతుందని భారత విదేశాంగ శాఖ మంత్రి ఎస్ జైశంకర్ చెప్పారు. గత మూడేళ్లలో చర్చల ద్వారా తూర్పు లడఖ్‌లో ఐదు, ఆరు ఘర్షణ పాయింట్లలో భారత్, చైనాలు పురోగతి సాధించాయని తెలిపారు.
ఈ సంవత్సరం జూన్ నాటికి 87 వేల 26 మంది భారతీయులు తమ పౌరసత్వాన్ని వదులుకున్నారని విదేశాంగ మంత్రి జైశంకర్ వెల్లడించారు. దీంతో 2011 నుంచి ఇప్పటి వరకు 17.50 లక్షల మంది భారత పౌరసత్వాన్ని వదులుకున్నారని మంత్రి లిఖితపూర్వక ఆన్సర్ ఇచ్చారు. కాగా, 2020 నుంచి ఇప్పటి వరకు 5లక్షల 61వేల 272 మంది భారత పౌరసత్వాన్ని వదులుకున్నారని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ పేర్కొంది.
ఇద్దరు సైన్య అధికారుల మధ్య ఆధిపత్య పోరాటంతో సూడాన్ లో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. అధికారం కోసం ఇద్దరు నేతలు చేస్తున్న పోరాటంతో ప్రజలు బిక్కుబిక్కుమంటున్నారు. సూడాన్ లో సైన్యం, పారామిలిటరీ దళాల మధ్య పోరు సాగుతూనే ఉంది. కాల్పులు, పేలుళ్ల మోతతో అనేక ప్రాంతాలు దద్దరిల్లుతున్నాయి.
కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్యపై విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. సూడాన్‌లో చిక్కుకున్న కర్ణాటకకు చెందిన 31 మంది గిరిజనులపై చేసిన వ్యాఖ్యలపై విదేశాంగ మంత్రి శంకర్ ఈ సాయంత్రం కాంగ్రెస్ సీనియర్ నాయకుడు సిద్ధరామయ్యపై తీవ్రంగా మండిపడ్డారు.
భారత అంతర్గత విషయాల్లో వ్యాఖ్యానించే పాశ్చాత్య దేశాలకు చెడు అలవాటు అంటూ వ్యాఖ్యలు చేసిన విదేశీ వ్యవహారాల మంత్రి ఎస్ జైశంకర్ పై కాంగ్రెస్ నేత, ఎంపీ శశి థరూర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.