ఇస్లామాబాద్‌లో జరిగిన షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ (ఎస్‌సిఓ) సమావేశంలో భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ పాల్గొన్నారు. కానీ, పాకిస్థాన్ ఆయన ప్రసంగాన్ని ప్రత్యక్ష ప్రసారం చేయలేదు. జైశంకర్ సూటిపోటి మాటలకు భయపడి పాక్ ఈ చాకచక్య చర్య తీసుకుందని చెబుతున్నారు. భారత విదేశాంగ మంత్రి పాకిస్థాన్‌లో పర్యటించడం దాదాపు 10 ఏళ్ల తర్వాత జరిగింది. అయితే, ఇది ద్వైపాక్షికం కోసం కాదు. జైశంకర్ కఠినమైన షరతు కారణంగా పాకిస్థాన్ కూడా ఉద్రిక్తతలో ఉంది. ఎందుకంటే భారతదేశంతో సంబంధాలను మెరుగుపరచడానికి అంతర్జాతీయ వేదికలపై పాకిస్థాన్‌పై ఒత్తిడి ఉంది.
READ MORE: Bomb threats: మరో రెండు విమానాలకు బాంబు బెదిరింపులు.. రెండు రోజుల్లో 12 విమానాలకు హెచ్చరికలు..
భయపడిన పాకిస్తాన్ SCO సమ్మిట్‌ను ప్రత్యక్షంగా నిలిపివేసింది
ఎస్‌సీఓ సమ్మిట్‌లో.. జైశంకర్ పాకిస్థాన్, చైనాలను పేర్లు ప్రస్తావించకుండానే సూచనలు చేశారు. “పరస్పర గౌరవం, సార్వభౌమ సమానత్వం ఆధారంగా సహకారం ఉండాలి. ప్రాదేశిక సమగ్రతను మరియు సార్వభౌమత్వాన్ని గుర్తించాలి. ఇది నిజమైన భాగస్వామ్యంతో నిర్మించబడాలి. ఇందులో ఏకపక్ష ఎజెండా ఉండకూడదు.” అని జై శంకర్ తన ప్రసంగంలో తెలిపారు. దీంతో ఆయన ప్రసంగిస్తుండగా.. పాకిస్థాన్ టెలివిజన్ సమ్మిట్ ప్రత్యక్ష ప్రసారాన్ని నిలిపివేసింది. అనంతరం ఆయన మాట్లాడుతూ.. చైనా-పాకిస్తాన్ కూటమిపై దాడి చేస్తూ.. ఈ ప్రాంతంలోని ఉగ్రవాదం, తీవ్రవాదం, వేర్పాటువాదం అనే మూడు దెయ్యాలతో రాజీపడకూడదని అన్నారు.
READ MORE:Allu Arjun: అరాచకం సార్ ఇది.. బన్నీ కోసం 1600 కి.మీ సైకిల్ తొక్కుతూ?
2008లో ద్వైపాక్షిక చర్చలు విచ్ఛిన్నం..
ఇదిలా ఉండగా.. పాకిస్థాన్‌కు చెందిన లష్కరే తోయిబా 2008లో ముంబై ఉగ్రదాడులకు పాల్పడిన తర్వాత ఇరు దేశాల ద్వైపాక్షిక చర్చలు పూర్తిగా విచ్ఛిన్నమయ్యాయి. కానీ భారత్, పాకిస్థాన్ కలిసి పనిచేస్తున్న అరుదైన బహుళపక్ష సంస్థల్లో ఎస్‌సీఓ ఒకటి. ద్వైపాక్షిక అంశాలను లేవనెత్తడానికి ఎస్‌సీఓ చార్టర్ అనుమతించకపోవడమే ఇందుకు ప్రధాన కారణం! ఎస్సీఓలో చైనా, రష్యా, ఇరాన్, కజకిస్థాన్, కిర్గిజిస్తాన్, తజికిస్థాన్, ఉజ్బెకిస్థాన్ సైతం సభ్యదేశాలుగా ఉన్నాయి. ఎస్‌సీఓ సమావేశానికి జైశంకర్‌ను పంపాలని నిర్ణయించడం ద్వారా భారత్ సాహసోపేతమైన నిర్ణయం తీసుకుందని ఇస్లామాబాద్‌లో భారత చివరి హైకమిషనర్‌గా, ఇరు దేశాల మధ్య సంబంధాలను నిశితంగా గమనిస్తున్న మాజీ రాయబారి అజయ్ బిసారియా అన్నారు. “షాంఘై సహకార సంస్థ సమావేశానికి తమ విదేశాంగ మంత్రిని పంపడం ద్వారా సమస్యాత్మక సంబంధంలో స్థిరత్వాన్ని తీసుకొచ్చేందుకు తన ఆకాంక్షను భారత్ తెలియజేసింది. బంతి ఇప్పుడు పాక్ కోర్టులో ఉంది. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని అర్థవంతమైన ద్వైపాక్షిక సమావేశాన్ని ప్రతిపాదించాలి,” అని అజయ్ అన్నారు.