EAM Jaishankar: పాకిస్తాన్‌లో మైనారిటీల అణచివేతపై భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ లోక్‌సభలో మాట్లాడారు. పాకిస్తాన్ మైనారిటీల పట్ల వ్యవహరిస్తున్న తీరునను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్తామని శుక్రవారం చెప్పారు. ప్రశ్నోత్తరాల సమయంలో, పాకిస్తాన్‌లో మైనారిటీలపై నేరాలు, దౌర్జన్యాలపై సమాధానం ఇస్తూ.
భారత విదేశాంగ మంత్రి జైశంకర్ లండన్ పర్యటనలో ఖలీస్తానీ ఉగ్రవాది దాడికి యత్నించాడు. అంతేకాకుండా భారత జాతీయ జెండాను చించేసి పడేశాడు. దీంతో అప్రమత్తమైన లండన్ పోలీసులు.. నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. ఖలీస్తానీ ఆందోళనకారులను చెదరగొట్టారు. అయితే ఈ ఘటనను భారత ప్రభుత్వం తీవ్రంగా ఖండిచింది.
భారత విదేశాంగ మంత్రి జైశంకర్ లండన్ పర్యటనలో ఉగ్ర కలకలం చోటుచేసుకుంది. ఖలీస్తానీ ఉగ్రవాదులు.. జైశంకర్ ప్రయాణిస్తున్న వాహనాన్ని అడ్డుకున్నారు. భారతీయ జెండాను చించేసి నానా హంగామా సృష్టించారు. దీంతో అప్రమత్తమైన లండన్ పోలీసులు.. ఖలీస్తానీ ఉగ్రవాదితో పాటు ఆందోళనకారులను చెదరగొట్టారు.
అమెరికా నుంచి భారతదేశానికి అక్రమ వలసదారులు తిరిగి వచ్చారు. ఈ అంశంపై మొదటిసారిగా విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ స్పందించారు. చట్టవిరుద్ధంగా నివసిస్తున్న పౌరులను తిరిగి స్వదేశానికి తీసుకురావడం దేశాల బాధ్యత అని ఆయన స్పష్టం చేశారు. అమెరికాలో అక్రమ వలసదారులుగా ప్రకటించిన 104 మంది భారతీయులు బుధవారం పంజాబ్‌లోని అమృత్సర్‌కు తిరిగి వచ్చారు. ఆ విమానం బుధవారం శ్రీ గురు రామ్‌దాస్ జీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ల్యాండ్ అయింది.
భారత్-చైనా మధ్య మెల్లమెల్లగా సంబంధాలు మళ్లీ మెరుగుపడుతున్నాయి. ఇటీవల రష్యాలో జరిగిన బ్రిక్స్ సమావేశానికి భారత్-చైనా బోర్డర్ సమస్యలు పరిష్కారం అయ్యాయి. చైనా సైనికులు వెనక్కి వెళ్లిపోయారు.
భారత విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్ ప్రెస్ కాన్ఫరెన్స్‌ను ప్రసారం చేసినందుకు ఆస్ట్రేలియా మీడియా సంస్థ అయిన ఆస్ట్రేలియా టుడేపై కెనడా ఆంక్షలు విధించింది. కెనడాలో ఆ సంస్థ ప్రసారాలు, వార్తలు ప్రజలకు చేయకుండా బ్లాక్ చేస్తున్నట్లు వెల్లడించింది.
S Jaishankar: అమెరికా అధ్యక్ష ఎన్నికలకు సంబంధించిన ఫలితాలు వస్తున్నాయి. డొనాల్డ్ ట్రంప్ విజయం దాదాపు ఫిక్స్ అయింది. ఈ సందర్భంగా భారత విదేశాంగ శాఖ మంత్రి ఎస్. జైశంకర్ కీలక వ్యాఖ్యలు చేశారు. తదుపరి అధ్యక్షులుగా ఎవరు ఎన్నికైనా వారి సొంత ప్రయోజనాల కోసమే పని చేస్తారని చెప్పుకొచ్చారు.
అమెరికాలో అధ్యక్ష పోలింగ్ తేదీ సమీపిస్తోంది. ఈసారి అమెరికా అధ్యక్షుడు ఎవరు అవుతారనే దానిపై యావత్ ప్రపంచం దృష్టి ఉంది. రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ కమలా హారిస్‌తో తలపడుతున్నారు. కాగా.. తాజాగా ఓ ఇంటర్య్వూలో విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ కి ఓ ప్రశ్న అడిగారు. ట్రంప్ కమలా హారిస్‌లో ఎవరకు బెటర్.. భారత్‌కి ఎవరు మద్దతు తెలుపతారని ప్రశ్నించారు.
Jaishankar: భారత-రష్యా సంబంధాల గురించి విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ కీలక వ్యాఖ్యలు చేశారు. స్వాతంత్ర్యం తర్వాత భారత రష్యా చరిత్రను పరిశీలిస్తే.. భారత ప్రయోజనాలను ప్రభావితం చేసేలా రష్యా ఎప్పుడూ ఏమీ చేయలేదని అన్నారు. ప్రధాని నరేంద్రమోడీ బ్రిక్స్ సమావేశం కోసం రష్యాకి వెళ్తున్న సందర్భంలో జైశంకర్ ఈ వ్యాఖ్యలు చేశాడు. రష్యా, ఇండియా ప్రయోజనాలకు ఎలాంటి విఘాతం కలిగించలేదని చెప్పారు.
Pakistan: పాకిస్థాన్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ భారత్‌తో మెరుగైన సంబంధాలను ఏర్పాటు చేసుకోవాలని కోరారు. ఈ సందర్భంగా మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌పై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. భారత్‌తో సంబంధాలను చెడగొట్టడంలో ఇమ్రాన్ కీలక పాత్ర పోషించారని ఆయన ఆరోపించారు.