దాదాపు తొమ్మిదేళ్ల తర్వాత భారత్‌కు చెందిన విదేశాంగ మంత్రి జైశంకర్ పాకిస్థాన్ లో పర్యటించనున్నారు. గతంలో సుష్మా స్వరాజ్ పాక్ లో పర్యటించారు. ఇప్పటి నుంచి ఇప్పటి వరకు మన దేశం నుంచి ఎవ్వరూ మళ్లీ శత్రుదేశం పాకిస్థాన్ కి వెళ్లలేదు. ఈసారి షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ (SCO) సమావేశం పాక్ లో నిర్వహిస్తున్నారు. ఈ సమావేశంలో భారత్ కూడా పాల్గొంటుంది. సమ్మిట్ కోసం దేశ విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ పాకిస్థాన్ వెళ్లనున్నారు. దాదాపు తొమ్మిదేళ్ల తర్వాత తర్వాత భారత విదేశాంగ మంత్రి పాకిస్థాన్‌లో పర్యటించనుండగా.. ఆసక్తి నెలకొంది. పొరుగున ఉన్న పాకిస్థాన్‌లో జరగనున్న ఎస్‌సీఓ సమావేశంలో భారత్ పాల్గొనాలా వద్దా అనే అంశంపై చాలా కాలంగా చర్చలు జరిగాయి. ఇప్పుడు ఎట్టకేలకు భారత్ ఇందులో పాల్గొనాలని నిర్ణయించుకుంది. దీనిని ధృవీకరిస్తూ.. విదేశీ వ్యవహారాల మంత్రి ఎస్ జైశంకర్ ఎస్‌సీఓ సమావేశంలో భారతదేశానికి ప్రాతినిధ్యం వహిస్తారని విదేశాంగ మంత్రిత్వ శాఖ శుక్రవారం తెలిపింది.
READ MORE: Passive Smoking: పాసివ్ స్మోకింగ్ అంటే ఏమిటి..? దీనికి మహిళలే ఎక్కువ బాధితులు..!
పాకిస్థాన్ పర్యటనకు సంబంధించిన ప్రశ్నకు విదేశాంగ మంత్రి జైశంకర్ స్పందిస్తూ.. “ఈ పర్యటన బహుపాక్షిక కార్యక్రమం కోసం నిర్వహిస్తున్నారు. నేను అక్కడ భారత్-పాకిస్థాన్ సంబంధాల గురించి చర్చించడం లేదు. నేను కేవలం ఎస్‌సీఎస్‌లో సభ్యుడిగా అక్కడికి వెళ్తున్నాను. కానీ.. నేను మర్యాదపూర్వకంగా వ్యవహరిస్తాను. అది మీకు కూడా తెలుసు. అయితే ఈ కాలంలో ద్వైపాక్షిక చర్చలు ఉండవు.” అని పేర్కొన్నారు.
READ MORE:Game Changer : గేమ్ ఛేంజర్.. థర్డ్ సాంగ్ లెక్క వేరే?