S Jaishankar: పాకిస్తాన్ గడ్డపైనే ఆ దేశానికి వార్నింగ్ ఇచ్చిన జైశంకర్..
- పాకిస్తాన్ గడ్డ పై నుంచే ఆ దేశానికి చురకలంటించిన జైశంకర్..
- ఉగ్రవాదం..వేర్పాటువాదం..తీవ్రవాదంపై భారత వైఖరి స్పష్టం..
- ఈ మూడు చెడులను ఎదుర్కోవాలని ఎస్‌సీఓ సమ్మిట్‌లో పిలుపు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
S Jaishankar: షాంఘై సహకార సంస్థ (ఎస్‌సిఓ) శిఖరాగ్ర సమావేశం పాకిస్థాన్ రాజధాని ఇస్లామాబాద్‌లో జరుగుతోంది. బుధవారం ఎస్‌సీఓ మీటింగ్స్ ప్రారంభమయ్యాయి. భారతదేశం తరుపున విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ నిన్న ఇస్లామాబాద్ వెళ్లారు. ఇదిలా ఉంటే, పాకిస్తాన్ గడ్డపైనే ఆ దేశానికి జైశంకర్ చురకలంటించారు. రెండు దేశాల మధ్య సరిహద్దు కార్యకలాపాలు ఉగ్రవాదం, వేర్పాటువాదంతో కూడి ఉంటే, అది ద్వైపాక్షిక వాణిజ్యం, సంబంధాలు సహాయపడేందుకు సహకరించవని అన్నారు.
‘‘అభివృద్ధి, ఆర్థిక వృద్ధికి శాంతి, స్థిరత్వం అవసరం. చార్టర్ పేర్కొన్నట్లుగా మూడు చెడులను ఎదుర్కోవడంలో దృఢంగా, రాజీపడకుండా ఉండటం దీని అర్థం. సరిహద్దు వెంబడి ఉగ్రవాదం, తీవ్రవాదం, వేర్పాటువాదం ఉన్నట్లైయితే వాణిజ్యం, ఎనర్జీ ఫ్లో, ప్రజల మధ్య పరస్పర మార్పిడి, కనెక్టవిటిని ప్రోత్సహించదు’’ అని జైశంకర్ కుండబద్ధలు కొట్టినట్లుగా చెప్పారు.
Also Read
- Ram Mandir Trust First CEO: రామ మందిర ట్రస్ట్ సీఈవో రేసులో ఆ నలుగురు.. తొలి CEOపై తుది నిర్ణయం రేపే..
- Mahua Moitra: ఎంపీ మహువా మొయిత్రా భద్రతపై కలకత్తా హైకోర్టు కీలక ఆదేశాలు.. కారణమిదే!
- Nitin Nabin: రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలిసిన నితిన్ నబిన్
- Chirag Paswan Death Threat: కేంద్రమంత్రి చిరాగ్ పాస్వాన్‌కు ముప్పు?.. కేంద్రం అలర్ట్
Read Also: Bahraich Violence : బహ్రైచ్ హింసలో ఇప్పటివరకు 50 మంది అరెస్టు.. కొనసాగుతున్న ఇంటర్నెట్ బంద్
ఉగ్రవాదం, వేర్పాటువాదాన్ని ఎదుర్కోవడం ఎస్‌సీఓ ప్రాథమిక లక్ష్యాల్లో ఒకటని ఆయన చెప్పారు. గ్లోబలైజేషన్, రీబ్యాలెన్సింగ్ ప్రస్తుత వాస్తవాలని, ఎస్‌సీఓ దీనిని ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. దీనికి నిజాయితీతో కూడిన చర్చలు, విశ్వాసం పునరుద్ఘాటించడం అవసరం. ఎస్‌సీఓ మూడు చెడులను ఎదుర్కోవడంలో రాజీపడకుండా ఉండాలని సూచించారు.
సహకారం, పరస్పర గౌరవం, సార్వభౌమ సమానత్వంపై ఆధారపడి ఉండాలని, ప్రాదేశిక సమగ్రతను, సార్వభౌమాధికారాన్ని గుర్తించి, నిజమైన భాగస్వామ్యాలను నిర్మించబడాలని, ఏకపక్ష ఎజెండాతో కాదు అని భారతదేశం ప్రకటనని ఎస్‌సీఓ సమ్మిట్‌లో జైశంకర్ చెప్పారు. అంతర్జాతీయ సౌర కూటమి, విపత్తు తట్టుకునే మౌలిక సదుపాయాల కోసం కూటమి, సుస్థిర జీవనశైలిని సూచించే మిషన్ లైఫ్, యోగా, గ్లోబల్ బయో ఫ్యూయల్ అలయన్స్, ఇంటర్నేషనల్ అండ్ క్యాట్ అలయన్స్, ఇంటర్నేషనల్ ప్రోమోషన్ వంటి సుస్థిరత మరియు సమగ్ర అభివృద్ధికి భారతదేశం యొక్క ప్రపంచ కార్యక్రమాలు, జాతీయ ప్రయత్నాలను జైశంకర్ హైలెట్ చేశారు.
తాజావార్తలు
-
Elephant Death: విద్యుత్ షాక్‌తో ఏనుగు మృతి.. పవన్ కల్యాణ్ సీరియస్.. కీలక ఆదేశాలు
-
Sofa Cleaning Tips: సోఫాపై మొండి మరకలా? ఈ ఇంటి చిట్కాతో సులభంగా క్లీన్ చేయండి
-
OTR: కవిత మాటలు నిజామాబాద్ పాలిటిక్స్‌లో మంటలు రేపుతున్నాయా..?
-
Off The Record: వైసీపీ నేతలకు రిపోర్ట్ కార్డ్స్ పెట్టారా..? ఫెయిల్ అయిన నేతలకు నో టికెట్..?
-
US-Iran: రెండేళ్లలో ‘హార్ముజ్’ విలువలేనిదిగా మారొచ్చు.. ఇరాన్‌పై కఠిన ఆంక్షలకు అమెరికా ప్లాన్
ట్రెండింగ్
-
PhonePe UPI 123Pay: ఫీచర్ ఫోన్లలోనూ UPI పేమెంట్స్.. ఇంటర్నెట్ లేకుండానే PhonePe సేవలు.!
-
Glenn Phillips Catch: ఒంటిచేత్తో ఊహించని క్యాచ్.. నేనేనా పట్టింది అంటూ షాకైన గ్లెన్ ఫిలిప్స్.. వీడియో తప్పక చూడాల్సిందే!
-
AMOLED డిస్ప్లే, 66W ఫాస్ట్ ఛార్జింగ్, 50MP కెమెరాతో Lava AGNI 4N లాంచ్.!
-
IBPS RRB Recruitment: ఉద్యోగార్థులకు శుభవార్త.. బ్యాంకింగ్ రంగంలో 13,706 ఉద్యోగాల జాతర.!
-
Navagraha Pradakshina: నవగ్రహాలకు ప్రదక్షిణలు చేశాక కాళ్లు కడుక్కోవాలా? అసలు రహస్యం ఇదే..!