భారత్-అమెరికా మధ్య వాణిజ్య ఒప్పందంపై కీలక అడుగులు పడుతున్నట్లుగా తెలుస్తోంది. గత కొద్ది రోజులుగా వాణిజ్య ఒప్పందంపై రెండు దేశాల మధ్య చర్చలు తర్జన భర్జన జరుగుతున్నాయి. చర్చలు ఫలించకపోవడంతో ఇరు దేశాల మధ్య దూరం నడుస్తోంది.
భారత విదేశాంగ మంత్రి జైశంకర్ బంగ్లాదేశ్‌లో పర్యటించారు. మాజీ ప్రధాని ఖలీదా జియా అంత్యక్రియల్లో పాల్గొనేందుకు బుధవారం ఢాకా వెళ్లారు. నాలుగు గంటల పాటు బంగ్లాదేశ్‌లో పర్యటించారు. పర్యటనలో భాగంగా పలువురిని కలిశారు.
మలేషియా వేదికగా ఆసియాన్ శిఖరాగ్ర సమావేశాలు జరుగుతున్నాయి. ఈ సమావేశాలకు ప్రధాని మోడీ గైర్హాజరయ్యారు. మోడీ తరపున భారత విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్ మలేషియాకు వెళ్లారు. ఈ సందర్భంగా అమెరికా విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియోను జైశంకర్ కలిశారు.
టారిఫ్ ఉద్రిక్తతల వేళ భారత్-అమెరికా మధ్య కీలక పరిణామం చోటుచేసుకుంది. భారత విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్, అమెరికా విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియో సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలపై చర్చలు జరిగాయి. సుంకాలు కారణంగా రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు నెలకొన్న తరుణంలో ఈ సమావేశం శుభపరిణామంగా భావించొచ్చు.
Donald Trump: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి అదే మాటలు చెప్పారు. భారత్, పాకిస్తాన్ మధ్య కాల్పుల విరమణకు తానే కారణమని చెప్పుకొచ్చారు. భారత్-పాకిస్తాన్ సంఘర్షణతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఘర్షణలను ఆపినందుకు ట్రంప్ తనకు తాను ఘనత వహించారు. అమెరికా మధ్యవర్తిత్వంతో ‘సుదీర్ఘ రాత్రి’ చర్చల తర్వాత భారత్, పాక్ ‘‘పూర్తి, తక్షణ’’ కాల్పుల విరమణకు అంగీకరించాయని ఆదివారం ట్రంప్ సోషల్ మీడియాలో ప్రకటించారు.
S Jaishankar: 2020లో భారత్-చైనా సరిహద్దుల్లో జరిగిన గల్వాన్ ఘర్షణల తర్వాత తొలిసారిగా భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్, చైనా అధ్యక్షుడు షి జిన్‌పింగ్‌ను మంగళవారం కలిశారు. షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ (SCO) విదేశాంగ మంత్రుల సమావేశానికి హాజరయ్యేందుకు ఆయన డ్రాగన్ కంట్రీకి వెళ్లారు. ఇరు దేశాల సంబంధాలను సాధారణ స్థాయికి తెచ్చేందుకు రెండు దేశాలు ప్రయత్నిస్తున్నాయి. ద్వైపాక్షిక సంబంధాల్లో పురోగతిని చైనా అధ్యక్షుడికి వివరించినట్లు ఆయన చెప్పారు. Read Also: Lokesh : నాగ్…
S Jaishankar: భారతదేశ విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ చైనా పర్యటనకు వెళ్లనున్నట్లు తెలుస్తోంది. ఐదేళ్లలో మొదటిసారిగా ఈ వీకెండ్‌లో చైనాను సందర్శిస్తారని పలు రిపోర్టులు చెబుతున్నాయి. 2020లో గల్వాన్ ఘర్షణ జరిగిన తర్వాత, ఇరు దేశాలు తమ సంబంధాలను సాధారణం చేసుకునేందుకు కృషి చేస్తున్నాయి. ఈ పర్యటనలో జైశంకర్, చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీతో ద్వైపాక్షిక సమావేశాలు నిర్వహించనున్నారు.
Jaishankar: పాకిస్తాన్తో ఇటీవల నెలకున్న ఉద్రిక్తతలు, ఆపరేషన్ సిందూర్ గురించి విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ సోమవారం పార్లమెంటరీ సంప్రదింపుల కమిటీ సభ్యులకు వివరించారు. ఉద్రిక్తతల గురించి విదేశాలకు చాలా సులభంగా వివరించిందని.. ‘‘వారు కాల్పులు జరుపుతారు, మేము కాల్పులు జరుపుతాము,
Operation Sindoor: పహల్గామ్ ఉగ్రవాద దాడికి ప్రతీకారంగా భారత్, పాకిస్తాన్, పీఓకేలోని ఉగ్రవాద స్థావరాలను లక్ష్యంగా చేసుకుని ‘‘ఆపరేషన్ సిందూర్’’ ప్రారంభించింది. మొత్తం 09 లష్కరేతోయిబా, జైషే మహ్మద్ ఉగ్రవాద స్థావరాలపై దాడులు చేసింది. ఈ దాడుల్లో 100 మందికి పైగా ఉగ్రవాదులు హతమయ్యారు.
Jai shankar: భారత్–పాకిస్తాన్ మధ్య గత కొన్ని రోజులుగా కొనసాగిన ఉద్రిక్తతల తరువాత, ఈరోజు భారత్ పూర్తి, తక్షణ కాల్పుల విరమణ ప్రకటించింది. అయితే, ఈ ప్రకటన అనంతరం దేశ విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ ఉగ్రవాదాన్ని ప్రోత్సహించే వారికి సోషల్ మీడియా వేదికగా గట్టి హెచ్చరికలు జారీ చేశారు. జైశంకర్ తన ట్వీట్లో.. “భారత్ ఉగ్రవాదం ఏ రూపంలో వచ్చినా నిర్దాక్షిణ్యంగా వ్యతిరేకిస్తుంది. భారతదేశం, పాకిస్తాన్ మధ్య ఈరోజు ఒక అవగాహనకు వచ్చాయి. రెండు దేశాలూ…