వచ్చే నెలలో కజకిస్థాన్‌లో జరగనున్న షాంఘై సహకార సంస్థ (ఎస్‌సీవో) సదస్సుకు ప్రధాని మోడీ దూరం అయ్యారు. మోడీ తరపున కేంద్ర విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ హాజరుకానున్నారు. భారత ప్రతినిధి బృందానికి కేంద్రమంత్రి నాయకత్వం వహించనున్నారు .
విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ ఆదివారం యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యుఏఈ) కి చేరుకున్నారు. యూఏఈ అధ్యక్షుడు అబ్దుల్లా బిన్ జాయెద్ అల్ నహ్యాన్ తో సమావేశం కానున్నారు. ఈ సమావేశంలో ఇరువురు నేతలు ద్వైపాక్షిక సంబంధాలు, సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యంతో పాటు గాజాలో మొత్తం పరిస్థితిపై చర్చిస్తారని భావిస్తున్నారు.
Prajwal Revanna Scandal: గత నెలలో కర్ణాటకలో జేడీఎస్ మాజీ నేత, ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ సెక్స్ టేపుల వ్యవహారం రాజకీయంగా సంచలనంగా మారింది. ముఖ్యంగా రేవణ్ణ ఫ్యామిలీకి పట్టున్న హసన్ జిల్లాలో ఈ సెక్స్ వీడియోలు వైరల్‌గా మారాయి.
ఇజ్రాయెల్‌పై ఇరాన్ దాడి తర్వాత ప్రపంచవ్యాప్తంగా తీవ్ర అస్థిరత నెలకొంది. ఈ దాడి మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతను పెంచింది. అటువంటి పరిస్థితిలో, ఇరాన్ స్వాధీనం చేసుకున్న ఇజ్రాయెల్ నౌకలో ఉన్న 17 మంది భారతీయుల భద్రత గురించి భారత ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేసింది.
భారత్ లో లోక్ సభ ఎన్నికల వేళ సరిహద్దు రాష్ట్రమైన అరుణాచల్ ప్రదేశ్ విషయంలో చైనా మరో దుందుడుకు చర్యకు దిగింది. చైనా వాస్తవాధీన రేఖ వెంబడి సరిహద్దు వివాదం కొనసాగుతున్న వేళ చైనా ఇలాంటి కవ్వింపు చర్యలకు పాల్పడుతుంది.
Jaishankar: భారతదేశంలో రాబోయే 15 లేదా అంతకన్నా ఎక్కువ సంవత్సరాలు సుస్థిర ప్రభుత్వం ఉంటుందని విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ అన్నారు. దీర్ఘకాలిక రాజకీయ స్థిరత్వం ధైర్యంగా నిర్ణయాలు తీసుకునేందుకు సాయపడుతుందని చెప్పారు. భారత్-జపాన్ వ్యూహాత్మక భాగస్వామ్యంపై నిక్కీ ఫోరమ్‌లో జైశంకర్ మాట్లాడారు. 95 కోట్ల మంది పౌరులు ప్రభుత్వాన్ని ఎన్నుకునే హక్కును వినియోగించుకునేందుకు సిద్ధమవుతున్నారు. ఈ ఏడాది మేలో భారతదేశం సార్వత్రిక ఎన్నికలకు వెళ్తోంది. ఎన్నికలకు ముందు ఆయన ఈ వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యత సంతరించుకున్నాయి.
Students Died Abroad: ఇటీవల కాలంలో పలు ప్రమాదాల్లో, అనారోగ్య సమస్యలతో పలువురు భారతీయ విద్యార్థులు విదేశాల్లో మరణిస్తున్నారు. తమ బిడ్డలు ప్రయోజకులు అవుతారని ఎన్నో ఆశలతో తల్లిదండ్రులు విదేశాలకు పంపుతున్నారు. అయితే, కొన్ని సందర్భాల్లో పేరెంట్స్‌కి కన్నీటిని మిగులుస్తున్నారు. రోడ్డు యాక్సిడెంట్లు, దుండగుల చేతిలో మరణించడం, ఆరోగ్య సమస్యలు కారణంగా మరణాలు చోటు చేసుకుంటున్నాయి.
భారత్- మాల్దీవులతో కొనసాగుతున్న దౌత్యపరమైన వివాదంపై విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ ఇటీవల మౌనం వీడారు. ప్రతి దేశం మాకు మద్దతు ఇస్తారని నేను హామీ ఇవ్వలేను అని ఆయన తెలిపారు.