Jaishankar: భారత-రష్యా సంబంధాల గురించి విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ కీలక వ్యాఖ్యలు చేశారు. స్వాతంత్ర్యం తర్వాత భారత రష్యా చరిత్రను పరిశీలిస్తే.. భారత ప్రయోజనాలను ప్రభావితం చేసేలా రష్యా ఎప్పుడూ ఏమీ చేయలేదని అన్నారు. ప్రధాని నరేంద్రమోడీ బ్రిక్స్ సమావేశం కోసం రష్యాకి వెళ్తున్న సందర్భంలో జైశంకర్ ఈ వ్యాఖ్యలు చేశాడు. రష్యా, ఇండియా ప్రయోజనాలకు ఎలాంటి విఘాతం కలిగించలేదని చెప్పారు.
Read Also: Cabbage Benefits: క్యాబేజీతో గుండె జబ్బులను చెక్ పెట్టండి!
మాస్కో, న్యూఢిల్లీ మధ్య సంబంధాలు ప్రత్యేకమైనవిగా చెప్పారు. ఈ రోజు రష్యా పరిస్థితి భిన్నంగా ఉందని, వెస్ట్రన్ దేశాలతో సంబంధాలు దిగజారిన సమయంలో, రష్యా ఆసియా వైపు చూస్తుందని చెప్పారు. రష్యాకి ఆసియాలో చాలా అవకాశాలు ఉన్నాయని చెప్పారు. మన జాతీయ ప్రయోజనాలకు ఏది అవసరమవుతుందో ఆ పని చేస్తున్నామని అన్నారు. రష్యా సహజ వనరులకు కేంద్రంగా ఉందని చెప్పారు. ఇప్పుడున్న డెవలప్మెంట్ స్టేజ్‌లో భారత్ అతిపెద్ద వనరుల వినియోగదారుగా ఉందని అన్నారు. రష్యా ఆయిల్ గురించి అంతా మాట్లాడుతారు కానీ, చమురుతో పాటు ఎరువులు, ఖనిజాలు, బొగ్గుని కూడా భారత్ పొందుతుందని వెల్లడించారు. రెండు దేశాల సంబంధాల చరిత్ర చాలా పాజిటివ్‌గా ఉందని, ఇదే కొనసాగుతుందని చెప్పారు.
జైశంకర్ వ్యాఖ్యలు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ఇటీవల కాలంలో అమెరికా, కెనడాలు భారత అంతర్గత విషయాల్లో వ్యాఖ్యలు చేయడం, ఖలిస్తానీ ఉగ్రవాదులకు మద్దతు ఇస్తూ భారత సార్వభౌమాధికారాన్ని, సమగ్రతను దెబ్బతిస్తున్నాయి. ముఖ్యంగా ఖలిస్తాన్ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్యలో భారత్ ప్రమేయం ఉందని ఆరోపించింది. దీంతో ఇరు దేశాల మధ్య దౌత్యయుద్ధం ప్రారంభమైంది. ఇదిలా ఉంటే, అమెరికా మరో ఖలిస్తానీ ఉగ్రవాది గురపత్వంత్ సింగ్ పన్నూకి అండగా వ్యవహరిస్తోంది. చాలా సార్లు భారత్‌ని భయపెట్టేలా పన్నూ వ్యాఖ్యలు చేశాడు. ఈ వ్యాఖ్యల్ని అమెరికా ఖండించడం లేదు. ఈ రెండు దేశాలు కూడా వారి వ్యాఖ్యల్ని ‘‘భావ ప్రకటనా స్వేచ్ఛ’’గా అభివర్ణిస్తున్నాయి.