Jairam Ramesh: కాంగ్రెస్ లేకుండా బీజేపీ ఎదుర్కోవడం ఏ ఫ్రంట్ కు సాధ్యం కాదని, 2024 సార్వత్రిక ఎన్నికల్లో కూటమి ఏర్పడితే అందులో కాంగ్రెస్ పార్టీదే ప్రధాన పాత్ర అని కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేష్ అన్నారు. అయితే రాబోయే కర్ణాటక ఎన్నికలతో పాటు ఇతర రాష్ట్రాల ఎన్నికలు ఉన్నాయని, ఇప్పుడే పొత్తుల గురించి మాట్లాడటం తొందరపాటు అవుతుందని ఆయన అన్నారు. ఇటీవల బెంగాల్ సీఎం మమతా బెనర్జీతో భేటీ అయిన సమాజ్ వాదీ పార్టీ…
మహిళా రిజర్వేషన్ బిల్లుపై తమ వైఖరిని స్పష్టం చేయాలని కాంగ్రెస్ శుక్రవారం బీజేపీని కోరింది. పార్లమెంటు బడ్జెట్ సమావేశాల రెండో భాగంలో లోక్‌సభలో ప్రవేశపెట్టాలని డిమాండ్ చేసింది.
కాంగ్రెస్ చేపట్టిన భారత్ జోడో యాత్ర విజయవంతమైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మరో యాత్రకు శ్రీకారం చుట్టనున్నట్లు తెలుస్తోంది. కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర దిగ్విజయంగా పూర్తైంది.
త్తీస్‌గఢ్‌లోని రాయ్‌పూర్‌లో జరుగుతున్న కాంగ్రెస్ 85వ ప్లీనరీ సమావేశాల్లో పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది. కాంగ్రెస్ వర్కింగ్ కమిటీకి సభ్యులందరినీ నామినేట్ చేసే అధికారాన్ని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు కట్టబెడుతూ పార్టీ స్టీరింగ్ కమిటీ శుక్రవారం నిర్ణయం తీసుకుంది.
Bharat Jodo Yatra: భారత్ జోడో యాత్ర ఎన్నిలక యాత్ర కాదని అన్నారు కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేష్. రాహుల్ గాంధీని ప్రధాని అభ్యర్థిగా చూపించడం ఈ యాత్ర ఉద్దేశం కాదని స్పష్టం చేశారు. ఇది సైద్ధాంతిక యాత్ర అని.. ఈ యాత్రలో రాహుల్ గాంధీ ప్రముఖంగా వ్యవహరిస్తున్నారని అన్నారు. 2024 సార్వత్రిక ఎన్నికలకు ముందు రాహుల్ గాంధీని ప్రధాని అభ్యర్థిగా ప్రకటించేందుకు ‘భారత్ జోడో యాత్ర’ కసరత్తు చేస్తుందనే వాదనలను ఆయన శనివారం కొట్టిపారేశారు.
లక్ష్మణరేఖ ఎవరు దాటినా చర్యలు తప్పవని కేంద్ర మాజీమంత్రి జైరాం రమేశ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇప్పటికే కోమటిరెడ్డి వెంకట్.రెడ్డికి నోటీసులు జారీ చేశామన్నారు. సమాధానం రాకపోతే చర్యలుంటాయని అన్నారు.
ఇద్దరు కోటీశ్వరులతో పోటీపడ్డారని, కాంగ్రెస్ అభ్యర్థి పాల్వయి స్రవంతికి కేంద్ర మాజీమంత్రి జైరాం రమేశ్ కితాబు ఇచ్చారు. కామారెడ్డి జిల్లా జైరాం రమేశ్ మాట్లాడుతూ.. తెలంగాణలో భారత్ జోడోయాత్ర పదకొండు రోజుల పాటు 319 కిలోమీటర్లు, 8 జిల్లాల్లో సాగిందని తెలిపారు. దక్షిణ భారతంలో ఐదు రాష్ట్రాల్లో ఈ యాత్ర పూర్తి చేసుకుని.. ఈరోజు మహారాష్ట్రలోకి చేరుకుంటుందని అన్నారు.
డబుల్ ఇంజన్ లకు ట్రబుల్ మొదలైందని కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేష్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అందోల్ మండలం దానంపల్లి వద్ద జైరాం రమేష్ మాట్లాడారు. పాదయాత్ర సందర్భంగా ఇప్పటికే వందలమంది విద్యార్థులు, కార్మికులు, సామాజిక వేత్తలను కలిశారని చెప్పారు.