రాహుల్‌గాంధీ (Rahul Gandhi) చేపట్టిన భారత్ జోడో న్యాయ యాత్ర (Bharat Jodo Nyay Yatra) బుధవారం జరగడం లేదని కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేష్ (Jairam Ramesh) తెలిపారు.
ఇద్దరు మాజీ ప్రధానులు పీవీ.నరసింహారావు (PV Narasimha Rao), చరణ్ సింగ్ (Charan Singh), ప్రముఖ వ్యవసాయ శాస్త్రవేత్త ఎంఎస్ స్వామినాథన్‌కు శుక్రవారం కేంద్ర ప్రభుత్వం దేశ అత్యున్నత పురస్కారం భారతరత్న ప్రకటించింది.
Jairam Ramesh: బీజేపీ నేత ఎల్‌కే అద్వానీకి భారతరత్న ఇవ్వడంపై కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేష్ స్పందించారు. ప్రధాని మోడీ, ఎల్‌కే అద్వానీకి సంబంధించి రెండు సంఘటనల గురించి ఆయన మాట్లాడారు. 2002లో నరేంద్రమోడీ గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో అద్వానీ, ఆయనను కాపాడారని, ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి మోదీని సీఎం పదవి నుంచి తప్పించాలనుకున్నారని, వాజ్‌పేయి మోడీకి రాజధర్మాన్ని గుర్తు చేశారని జైరాం రమేష్ అన్నారు. ఆ సమయంలో ఎల్‌కే అద్వానీ నరేంద్రమోడీకి…
బీహార్ సంకీర్ణ ప్రభుత్వం కుప్పకూలింది. ఆర్జేడీ, కాంగ్రెస్, వామపక్షాలతో కూడిన మహాకూటమి సర్కార్ పడిపోయింది. గత వారం రోజులుగా చోటుచేసుకున్న రాజకీయ సంక్షోభానికి ముగింపు పలుకుతూ ముఖ్యమంత్రి పదవికి ఆదివారం ఉదయం నితీష్ రాజీనామా చేశారు.
Congress: రామ మందిర వేడుకలపై మరిసారి కాంగ్రెస్, బీజేపీని టార్గెట్ చేస్తూ విమర్శలు చేసింది. జనవరి 22న రామ మందిర ప్రాణప్రతిష్ట వేడుకలు జరగనున్నాయి. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే, సోనియా గాంధీ, అధిర్ రంజన్ చౌదరిలకు రామ మందిర ట్రస్ట్ ఆహ్వానం పంపింది. అయితే ఇది ఆర్ఎస్ఎస్/బీజేపీ కార్యక్రమని, తాము హాజరుకాబోవడం లేదని ఇప్పటికే కాంగ్రెస్ స్పష్టం చేసింది.
2024 ఎన్నికలకు ముందు అంటే అధికారం కోసం కాంగ్రెస్ 'భారత్ జోడో న్యాయ యాత్ర' చేపట్టబోతోంది. కాంగ్రెస్ ఈ యాత్ర 6,700 కి.మీ. కంటే ఎక్కువ దూరాన్ని కవర్ చేస్తుంది. 110 జిల్లాలు, 100 లోక్‌సభ స్థానాలు, 337 అసెంబ్లీ స్థానాల్లో 67 రోజుల పాటు యాత్ర సాగనుంది.
Jairam Ramesh React on PM Modi comments on Parliament Security Breach: పార్లమెంట్‌లో చోటుచేసుకున్న ఘటనపై చర్చించేందుకు ప్రధాని మోడీ ముఖం చాటేస్తున్నారని కాంగ్రెస్ జనరల్ సెక్రెటరీ జైరాం రమేశ్ అన్నారు. పార్లమెంట్ అలజడిపై చర్చ అవసరమే అని పేర్కొన్నారు. అసలు ఏం జరిగిందనే దానిపై హోం మంత్రి అమిత్ షా వివరణ ఇవ్వాలని, అప్పటి వరకు ఇండియా కూటమి ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తూనే ఉంటుందని స్పష్టం చేశారు. పార్లమెంట్‌లో భద్రతా వైఫల్యం ఘటనపై…
Congress: కాంగ్రెస్ రాజ్యసభ ఎంపీ ధీరజ్ సాహు దేశవ్యాప్తంగా ఫేమస్ అయ్యారు. ఆయన నివాసాల్లో ఐటీ దాడులు జరిగాయి. ఏకంగా రూ. 300 కోట్లకు పైగా లెక్కల్లో చూపని నగదు పట్టుబడిండి. ఒడిశా, జార్ఖండ్ రాష్ట్రాల్లో బుధవారం నుంచి ఐటీ అధికారులు సాహు టార్గెట్‌గా సోదాలు నిర్వహిస్తున్నారు. ఎప్పుడూ లేని విధంగా ఏకంగా కోట్లకు కోట్ల నగదు బయటపడటం దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. మద్యం వ్యాపారంతో సంబంధం ఉన్న ధీరజ్ సాహు ఈ కేసులో ప్రధానంగా ఉన్నారు.
నవంబర్ 30న జరుగునున్న ఎన్నికల్లో తెలంగాణ ప్రజల భవిష్యత్తు నిర్వహించబడుతుందని మాజీ కేంద్ర మంత్రి జైరాం రమేష్ అన్నారు. 9 సంవత్సరాల క్రితం సోనియాగాంధీ తెలంగాణ రాష్ట్రాన్ని ప్రకటించారు.. కేవలం ప్రకటించడమే మాత్రమే కాదు తెలంగాణ అభివృద్ధి చేసే బాధ్యతను కూడా కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుందని ఆయన తెలిపారు.
కేసిఆర్ నయా నిజాంలాగే పాలన చేస్తున్నాడని కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి, రాజ్యసభ ఎంపీ జైరాం రమేష్ విమర్శించారు. తెలంగాణ ప్రకటన సమయంలో కేసీఆర్ అసలు పార్లమెంటులోనే లేరని ఆయన ఆరోపించారు. ఈ మేరకు నల్గొండ జిల్లా మునుగోడులో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి క్యాంపు కార్యాలయంలో శుక్రవారం జరిగిన మీడియా సమావేశంలో జైరాం రమేష్ మాట్లాడారు. కోట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో రైతులకు, యువతకు ఎలాంటి న్యాయం జరగలేదన్నారు. Also Read: Priyanka Gandhi: మార్పు కావాలి, కాంగ్రెస్…