Congress: కాంగ్రెస్ నాయకుడు జైరామ్ రమేష్, ఆపరేషన్ సిందూర్, పహల్గామ్ ఉగ్రదాడులపై ప్రధాని నరేంద్రమోడీని విమర్శించారు. అటల్ బిహారీ వాజ్‌పేయి సమయంలో కార్గిల్ యుద్ధ సమయంలో ఉన్న బీజేపీకి, ఇప్పటి బీజేపీ చాలా మార్పు ఉందని అన్నారు. 1999 కార్గిల్ యుద్ధం తర్వాత నలుగురు సభ్యులతో కార్గిల్ సమీక్ష కమిటిని ఏర్పాటు చేయాలనే వాజ్‌పేయి నిర్ణయాన్ని ఆయన గుర్తు చేశారు. ఆ సమయంలో ప్రధానికిగా ఉన్న వాజ్‌పేయికి, ఇప్పుడు ఉన్న ప్రధాని మోడీ వేరు వేరు అని…
ఉపరాష్ట్రపతి పదవికి జగదీప్ ధన్‌ఖర్ రాజీనామా చేయడం రాజకీయ నాయకులకు దిగ్భ్రాంతి కలిగించింది. సోమవారం పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభమయ్యాయి. రాజ్యసభలో ధన్‌ఖర్ ఉల్లాసంగానే కనిపించారు.
హోసబాలే వ్యాఖ్యలపై ఎక్స్ (ట్విట్టర్) వేదికగా కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేశ్ తీవ్రంగా మండిపడ్డారు. ఆర్ఎస్ఎస్ రాజ్యాంగాన్ని "ఎప్పుడూ" అంగీకరించలేదని ఆరోపించారు. అలాగే, డాక్టర్ బిఆర్ అంబేద్కర్, మాజీ ప్రధాన మంత్రి జవహర్‌లాల్ నెహ్రూతో సహా దాని వ్యవస్థాపక పితామహులపై దాడులు చేస్తుందని ఆర్‌ఎస్‌ఎస్‌ను విమర్శించారు.
Asim Munir: అమెరికా మిలిటరీ 250వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని వాషింగ్టన్‌లో జరుగుతున్న మిలిటరీ పరేడ్‌కి పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ జనరల్ ఆసిమ్ మునీర్‌ని అమెరికా ఆహ్వానించినట్లు వార్తలు వచ్చాయి. అయితే, ఈ ఊహాగానాలను అమెరికా తోసిపుచ్చింది. ఇది తప్పుడు వార్త అని, విదేశీ సైనిక నాయకులను ఎవరూ ఆహ్వానించలేదు అని వైట్ హౌజ్ అధికారి ఒకరు చెప్పినట్లు వార్తాసంస్థ ఏఎన్ఐ పేర్కొంది.
Jairam Ramesh: భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ జవాబుదారీతనం నుంచి తప్పించుకోవడానికి, ప్రజలను మభ్య పెట్టేందుకే అఖిలపక్షం ఏర్పాటు చేసి ఎంపీలను విదేశాలకు పంపిస్తున్నారని కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేశ్ ఆరోపణలు చేశారు.
కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ చేసిన వ్యాఖ్యలపై పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు సభను తప్పుదారి పట్టించారని కాంగ్రెస్ చీఫ్ విప్ జైరామ్ రమేశ్ ఆరోపించారు. రాజ్యసభలో ఆయన మాట్లాడుతూ.. సోమవారం కిరణ్ రిజిజుపై హక్కుల ఉల్లంఘన నోటీసు ఇచ్చారు. రాజ్యసభ పనితీరుకు సంబంధించిన 188వ నిబంధన కింద రమేష్ ఈ నోటీసు ఇచ్చారు.
Waqf Bill: బీజేపీ ప్రభుత్వం తీసుకురాబోతున్న ‘‘వక్ఫ్ బిల్లు’’పై కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది సామాజిక సామరస్యాన్ని దెబ్బతీస్తుందని, మైనారిటీలను చెడుగా చూపిస్తుందని బీజేపీపై విమర్శలు చేశారు.
రూపాయి విలువ ఈ మధ్య భారీగా పడిపోయింది. రూపాయి విలువ భారీగా క్షీణించింది. తాజాగా ఇదే అంశంపై కాంగ్రెస్ సీనియర్ నాయకుడు జైరాం రమేష్ స్పందిస్తూ కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు.
Jairam Ramesh: కాంగ్రెస్ ఎంపీ అభిషేక్ మను సింఘ్వీకి కేటాయించిన రాజ్యసభ సీటు వద్ద నుంచి రూ. 50,000 దొరకడం వివాదాస్పదంగా మారింది. ఈ ఘటనపై సభ చైర్మన్ జగదీప్ ధంఖర్ విచారణకు ఆదేశించారు. అయితే, ఈ వివాదంపై కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేష్ శుక్రవారం స్పందించారు.
Rahul Gandhi: అదానీ వ్యవహారం మరోసారి దేశవ్యాప్తంగా రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. అదానీ గ్రూప్ ఛైర్మన్ గౌతమ్ అదానీతో సహా అతడి మేనల్లుడు సాగర్ అదానీ మరికొందరు 2020-2024 మధ్యాలంలో రూ. 2,029 కోట్లు అంచాలు ఇచ్చారని అమెరికా న్యాయవాదులు ఆరోపించారు. ఈ ఆరోపణల్ని అదానీ గ్రూప్ ఖండించింది.