కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీపై అనర్హత వేటు పడిన తర్వాత దేశ రాజకీయాలు వేడెక్కాయి. ఓవైపు కేంద్రాన్ని టార్గెట్ చేస్తూనే మరోవైపు రాహుల్ గాంధీకి మద్దతు ఇస్తున్నారు. విపక్షాలు ఏకం అవుతున్నట్లు తెలుస్తోంది. పార్లమెంటు సభ్యునిగా రాహుల్ గాంధీపై అనర్హత వేటు వేయడాన్ని నిరసిస్తూ కాంగ్రెస్ దేశవ్యాప్త “ప్రజాస్వామ్యాన్ని రక్షించండి” ఉద్యమాన్ని ప్లాన్ చేసింది. పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ, కేంద్ర మాజీ మంత్రి పి చిదంబరం సహా కాంగ్రెస్ అగ్రనేతలు ఈ సాయంత్రం జరిగిన కీలక సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.
Also Read:Train Stopped: దక్షిణ్ ఎక్స్‌ప్రెస్ రైలును అడ్డుకున్న కాంగ్రెస్.. ఇది విప్లవానికి నాంది
ఖర్గే అధ్యక్షతన కాంగ్రెస్ పార్టీ విస్తృత సమావేశం జరిగింది. ఈ సందర్భంగా రాహుల్ గాంధీ అనర్హత వేటు, భవిష్యత్ కార్యాచరాణపై చర్చించారు. అయితే, ఈ సమావేశానికి రాహుల్ గాంధీ హాజరుకాలేదు. రానున్న రోజుల్లో దేశవ్యాప్తంగా నిరసనలు చేపట్టేందుకు ప్లాన్ చేస్తున్నాం అని కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేష్ అన్నారు. ప్రతిపక్ష నాయకులందరి మద్దతు ప్రకటనను పార్టీ స్వాగతించించారు. ప్రతిపక్ష ఐక్యతకు అన్ని పార్టీలు కలిసి రావాలని ఆయన పిలుపునిచ్చారు.
Also Read:Summer Drinks: వేసవిలో ఈ డ్రింక్స్ తాగండి.. డీహైడ్రేషన్‌కు చెక్ పెట్టండి
మరోవైపు అనేక మంది కాంగ్రెస్ శాసనసభ్యులు, ప్రాంతీయ ప్రతిపక్ష పార్టీల నాయకులు మమతా బెనర్జీ, అరవింద్ కేజ్రీవాల్, MK స్టాలిన్, ఉద్ధవ్ థాకరే, కెసిఆర్, అఖిలేష్ యాదవ్ తదితర నాయకులు రాహుల్ గాంధీకి మద్దతు ఇచ్చారు. అధికార బిజెపి ప్రభుత్వ నియంతృత్వంపై పోరాడాలని భావిస్తున్నాయి. ప్రతిపక్ష నేతలందరి మద్దతు ప్రకటనను కాంగ్రెస్ స్వాగతించింది. ఇప్పుడు మనం ప్రతిపక్షాల ఐక్యతను ఒక క్రమపద్ధతిలో ముందుకు తీసుకెళ్లాలి అని జైరామ్ రమేష్ అన్నారు. కాంగ్రెస్ అధ్యక్షుడు పార్లమెంటులో ప్రతిరోజూ ప్రతిపక్ష పార్టీలతో సమన్వయం చేస్తున్నారు.
కాగా, ఈ సమావేశంలో ఖర్గే, సోనియా గాంధీలతో పాటు కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శులు ప్రియాంక గాంధీ వాద్రా, కెసి వేణుగోపాల్, జైరాం రమేష్, రాజీవ్ శుక్లా, తారిక్ అన్వర్, సీనియర్ నేతలు ఆనంద్ శర్మ, అంబికా సోనీ, ముకుల్ వాస్నిక్, సల్మాన్ ఖుర్షీద్, పవన్ కుమార్ బన్సాల్ తదితరులు పాల్గొన్నారు.