Congress: కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేష్ సంచలన ఆరోపణలు చేశారు. మధ్యప్రదేశ్ రాష్ట్రంలో కాంగ్రెస్ నేతృత్వంలోని కమల్‌నాథ్ ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు కోవిడ్ మహమ్మారి లాక్‌డౌన్‌ని ఆలస్యం చేశారని బీజేపీై ఆరోపణలు గుప్పించారు. జ్యోతిరాదిత్య సింధియా వర్గం ఎమ్మెల్యేలు తిరుగుబాటు చేయడంతో 2020లో మధ్యప్రదేశ్‌లో కమల్ నాథ్ ప్రభుత్వం పడిపోయింది. ఆ తర్వాత సీఎం శివరాజ్‌సింగ్ నేతృత్వంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడింది.
ఇజ్రాయెల్‌పై హమాస్ దాడిని కాంగ్రెస్ ఖండించింది. పాలస్తీనా ప్రజల సమస్యలను చర్చల ద్వారానే పరిష్కరించుకోవాలని కాంగ్రెస్ ఎప్పటి నుంచో విశ్వసిస్తోందని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరాం రమేష్ అన్నారు.
G20 Summit: సెప్టెంబర్ 9-10 తేదీల్లో ఢిల్లీలో జీ20 సదస్సు జరగబోతోంది. అయితే ఈ సమావేశానికి హాజరయ్యే దేశాధినేతలకు విందు ఇచ్చేందుకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆహ్వానం పలికారు. ప్రస్తుతం ఈ ఆహ్వానమే వివాదాస్పదం అవుతోంది. సాధారణంగా రాష్ట్రపతి ఆహ్వానంలో ‘‘ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా’’ అని ఉంటుంది. అయితే ఈ ఆహ్వానంలో మాత్రం ‘‘ ప్రెసిడెంట్ ఆఫ్ భారత్’’గా ఉంది. ఇప్పుడు ఇదే కొత్త రచ్చకు కారణమవుతోంది. సెప్టెంబర్ 9న రాష్ట్రపతి జీ20 దేశాధినేతలను విందుకు…
మణిపూర్‌లో జాతి హింసపై పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ప్రతిష్టంభన కొనసాగుతుండగా.. కాంగ్రెస్ మణిపూర్ అంశంపై కీలక వ్యాఖ్యలు చేసింది. ఎన్ బీరెన్ సింగ్ ముఖ్యమంత్రిగా ఉన్నంత కాలం మణిపూర్‌లో శాంతిస్థాపన దిశగా ఉద్యమం ఉండదని కాంగ్రెస్ ఆదివారం పేర్కొంది.
Congress: బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం కేంద్రంలో అధికారంలోకి వచ్చి మే 30తో 9 ఏళ్లు పూర్తయ్యాయి. ప్రధానిగా నరేంద్ర మోడీ బాధ్యతలు చేపట్టి 9 ఏళ్లు గడుస్తున్న సందర్భంగా కాంగ్రెస్ ‘9 ఏళ్లు, 9 ప్రశ్నలు’ పేరుతో ఒక పత్రాన్ని విడుదల చేసింది. బీజేపీ హాయాంలో జరిగిన ద్రోహానికి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేసింది.
Congress: రూ. 2000 నోట్ల రద్దును ప్రకటించిన వెంటనే కాంగ్రెస్ ప్రధాని నరేంద్ర మోడీని లక్ష్యంగా చేసుకుని విమర్శలకు దిగింది. ఈ చర్య ‘‘స్వయం శైలి విశ్వగురువు’’, ‘‘ఫస్ట్ యాక్ట్, సెకండ్ థింక్’’( మొదట చేసి, తర్వాత ఆలోచించడం)
Jairam Ramesh: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ప్రధాని నరేంద్రమోడీ పేరుతో బీజేపీ ఓట్లు అడుగుతోంది, కానీ కాంగ్రెస్ మాత్రం స్థానికతకు పెద్ద పీట వేస్తోందని కాంగ్రెస్ సీనియర్ నేత జైరాంరమేష్ అన్నారు. నాలుగు ఏళ్ల బీజేపీ పాలన తర్వాత కర్ణాటక ప్రజలకు విటమిన్-పి కావాలని ఆయన అన్నారు.
కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీపై అనర్హత వేటు పడిన తర్వాత దేశ రాజకీయాలు వేడెక్కాయి. ఓవైపు కేంద్రాన్ని టార్గెట్ చేస్తూనే మరోవైపు రాహుల్ గాంధీకి మద్దతు ఇస్తున్నారు. విపక్షాలు ఏకం అవుతున్నట్లు తెలుస్తోంది.