Congress: మహిళా రిజర్వేషన్ బిల్లుపై తమ వైఖరిని స్పష్టం చేయాలని కాంగ్రెస్ శుక్రవారం బీజేపీని కోరింది. పార్లమెంటు బడ్జెట్ సమావేశాల రెండో భాగంలో లోక్‌సభలో ప్రవేశపెట్టాలని డిమాండ్ చేసింది. మార్చి 13 నుంచి ప్రారంభమయ్యే బడ్జెట్ సెషన్‌ల రెండో భాగంలో దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న బిల్లును ఆమోదించాలని కోరుతూ బీఆర్‌ఎస్ నాయకురాలు కె.కవిత నిరాహార దీక్ష చేస్తున్న రోజున కాంగ్రెస్ ఈ ప్రకటన చేసింది.
కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరాం రమేష్ ఒక ట్వీట్‌లో, “కాంగ్రెస్ నాయకత్వం కృషి కారణంగానే 2010 మార్చి 9న మహిళా రిజర్వేషన్ బిల్లు రాజ్యసభలో ఆమోదించబడింది” అని అన్నారు. “కానీ లోక్‌సభలో దానికి మద్దతు లభించలేదు. బిల్లు ముగియలేదు. అది సజీవంగా ఉంది. పెండింగ్‌లో ఉంది. దానిని పునరుద్ధరించకుండా ఆపింది ఎవరు? ” జైరాం రమేష్ ట్విట్టర్ వేదికగా ప్రశ్నించారు.
బిల్లు గురించి అడిగిన ప్రశ్నకు కాంగ్రెస్ నాయకురాలు అల్కా లాంబా.. రాజ్యసభలో బిల్లు ఆమోదించబడినప్పుడు, లోక్‌సభలో కాంగ్రెస్‌కు మెజారిటీ లేదని, అప్పుడు సంకీర్ణ ప్రభుత్వమని అన్నారు. “మహిళా రిజర్వేషన్ బిల్లును రాజ్యసభలో ఆమోదించడంలో మేము విజయం సాధించాము. ఇది సజీవంగా ఉంది. లోక్‌సభలో బీజేపీ ప్రభుత్వానికి మెజారిటీ ఉంది, వారు తమ 2019 మేనిఫెస్టోలో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని హామీ ఇచ్చారు. కానీ ప్రభుత్వం వచ్చి తొమ్మిదేళ్లు గడిచినా ఇంకా మౌనంగానే ఉన్నారు’’ అని ఆమె అన్నారు.
Read Also: MLC Kavitha : మహిళ రిజర్వేషన్ అంశము రాజకీయం చేయడానికి కాదు
పార్లమెంటు సమావేశాలు ప్రారంభమవుతున్నాయని, బీజేపీ ప్రభుత్వం తన వైఖరిని స్పష్టం చేయాలని, మహిళా రిజర్వేషన్ బిల్లును లోక్‌సభలో ప్రవేశపెట్టాలని, మహిళల హక్కులకు హామీ ఇవ్వాలని తాము కోరుతున్నట్లు కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి జైరాం రమేష్ అన్నారు. రెండో విడత బడ్జెట్ సెషన్ ఏప్రిల్ 6తో ముగియనుంది.