తూర్పు జయ ప్రకాష్‌రెడ్డి. ఈ పేరుకంటే జగ్గారెడ్డిగానే అందరికీ పరిచయం ఈ కాంగ్రెస్ ఎమ్మెల్యే. ప్రస్తుతం పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్. కొద్దిరోజులుగా పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి అంటే కయ్ మంటున్నారు. ఇటీవల పార్టీలో క్రమశిక్షణ తప్పిన ఎవరినైనా.. గోడకేసి కొడతానని రేవంత్ అనడంతో.. అంతే స్థాయిలో భగ్గుమన్నారు జగ్గారెడ్డి. గోడకేసి కొట్టడానికి నువ్వెవడివి అని నేరుగానే రేవంత్‌కు గురిపెట్టారు. ఆ వివాదం కాంగ్రెస్ పొలిటికల్ టెంపరేచర్‌ను అమాంతం పెంచేసింది. చివరకు వివాదం అటు తిరిగి.. ఇటు తిరిగి…
తెలంగాణ కాంగ్రెస్‌లో వివాదాలు కామన్. ఒకరు ఎడ్డెం అంటే.. ఇంకొకరు తెడ్డం అంటారు. గట్టిగా ప్రశ్నిస్తే.. అంతర్గత ప్రజాస్వామ్యం.. భిన్నాభిప్రాయాలు అనే డైలాగులు వినిపిస్తారు. అయితే తరచూ ఇలాంటి అంశాలు చర్చగా మారడంతో.. వాటికి స్వస్తి పలకాలని నిర్ణయించారా అనే ప్రచారం జరుగుతోంది. పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి, సీఎల్పీ లీడర్ మల్లు భట్టి విక్రమార్క మధ్య సఖ్యత లేదని గుర్తించి.. వారిని ఢిల్లీకి పిలిచి మాట్లాడారనే వాదన వినిపిస్తోంది. పార్టీలో ఇటీవల పెద్ద దుమారం రేగింది. పీసీసీ…
ఆరే ఆరు నెలలు. తెలంగాణ కాంగ్రెస్‌లో సీనియర్లు.. ఇతర నాయకులు నోళ్లు కట్టుకుని కూర్చున్నారు. తమ సహజ శైలికి భిన్నంగా మౌనం దాల్చారు. ఆ కూలింగ్ పీరియడ్ అయిపోయిందని అనుకున్నారో ఏమో.. మళ్లీ పూర్వ పద్ధతిలోకి వచ్చేశారు. కాంగ్రెస్‌లో అంతే అనే రీతిలో విభేదాలకు ఆజ్యం పోస్తున్నారు. నేరుగా పీసీసీ చీఫ్‌కే గురిపెట్టేవారు కొందరైతే.. సీనియరైతే నాకేంటి అనేలా మరికొందరి వైఖరి ఉంది. ఇలాంటి సమస్యలు వస్తే గతంలో AICC రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్‌గా ఉన్నవాళ్లు వెంటనే…
ఇటీవల టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిపై జగ్గా రెడ్డి చేసిన సంచలన వ్యాఖ్యలపై తాము కేసీ వేణుగోపాల్‌తో చర్చించామని మల్లు భట్టి విక్రమార్క అన్నారు. తమ పార్టీ అంతర్గత విషయాలన్నీ సర్దుకున్నాయని చెప్పారు. రాబోయే రోజుల్లో కాంగ్రెస్‌లో భారీ చేరికలు ఉంటాయన్నారు. ఇదే సమయంలో.. మోదీ పర్యటన ద్వారా బీజేపీ, టీఆర్ఎస్ పార్టీల మధ్య దోస్తీ బయటపడిందన్నారు. బీజేపీ, టీఆర్ఎస్‌లు ఒకరిపై మరొకరు విమర్శలు కూడా చేసుకోలేదని గుర్తుచేశారు. ప్రధాని మోదీ విభజన చట్టంలోని హామీలను నెరవేరుస్తారని…
తెలంగాణ కాంగ్రెస్ లోకి వలసలు పెరిగాయి. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత మల్లు రవి తెలిపారు. అయితే.. కార్యకర్తలలో భరోసా.. ప్రజల్లో పార్టీ పట్ల విశ్వాసం పెరిగిందన్నారు. టీఆర్‌ఎస్‌తో పొత్తు ఉండదని పార్టీ సీనియర్ నేతల రాహుల్ స్పష్టం చేశారని ఆయన వెల్లడించారు. పొత్తుల విషయం మాట్లాడవద్దని రాహుల్ ఆదేశాలు జారీ చేశారన్నారు. ఇక పార్టీలో ప్రతి ఒక్కరూ క్రమశిక్షణ పాటించాలని రాహుల్ సూచించారన్నారు. అయితే.. ఎమ్మెల్యే జగ్గారెడ్డి వ్యాఖ్యలు క్రమశిక్షణా రాహిత్యమని మల్లు రవి పేర్కొన్నారు.…
రాజ్ భవన్ వద్ద ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. నిరసన తెలుపుతున్న కాంగ్రెస్ శ్రేణులను పోలీసులు అడ్డుకుని, అరెస్ట్ చేస్తుండటంతో ఉద్రిక్తతకు దారితీసింది. అయితే రాజ్ భవన్ వైపు వెలుతున్న రేణుకా చౌదరిని పోలీసులు అడ్డుకున్నారు. నన్ను ఆపడానికి మీరెవరంటూ ఆమె ఆగ్రహం వ్యక్తం చేసారు. దీంతో పోలీసులకు రేణుకా చౌదరి మధ్య వాగివ్వాదం చోటుచేసుకుంది. ఆమెను పోలీసులు చుట్టుమట్టడంతో ఫైర్ అయ్యారు. తనను అరెస్ట్ చేసేందుకు యత్నించిన పంజాగుట్ట ఎస్ఐ ఉపేంద్ర చొక్కా పట్టుకున్నారు రేణుకా చౌదరి. పోలీస్టేషన్…
హైద్రాబాద్ లోని రాజ్ భవన్ ముట్టడికి కాంగ్రెస్ నేతలు ముట్టడికి పిలుపు నిచ్చిన విషయం తెలిసిందే. విడతల వారీగా కాంగ్రెస్ కార్యకర్తలు రాజ్ భవన్ ముట్డడికి వచ్చారు. మోదీ కొ హటావ్ దేశ్ కొ బచావ్ అనే నినాదాలతో రాజ్ భవన్ అట్టుడికింది. ముట్టడికి వచ్చిన కాంగ్రెస్ నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసులతో కాంగ్రెస్ కార్యకర్తలు వాగ్వావాదానికి దిగారు. ఇరువర్గాల మధ్య తోపులాట చోటు చేసుకొంది. దీంతో ఉద్రిక్తత నెలకొంది. ఖైరతాబాద్ సెంటర్లో కాంగ్రెస్ పార్టీ…