పీసీసీ చీఫ్‌గా రేవంత్‌రెడ్డి పగ్గాలు చేపట్టిన తర్వాత బహిరంగంగానే విమర్శలు గుప్పిస్తూ వచ్చిన ఎమ్మెల్యే జగ్గారెడ్డి… ఓ దశలో రాజీనామాకు సిద్ధపడ్డారు.. సోనియా, రాహుల్ గాంధీకి లేఖ రాసి.. ఇక, నేను కాంగ్రెస్ గుంపులో లేనట్టే అని పేర్కొన్నారు.. ఎంతమంది సముదాయించినా వెనుకడుగు వేసినట్టు కనిపించలేదు.. కానీ, రాహుల్ గాంధీతో రాష్ట్ర కాంగ్రెస్ ముఖ్యనేతల సమావేశం తర్వాత మనసు మార్చుకుని రాజీనామా లేఖను ఉపసంహరించుకుంటున్నట్టు ప్రకటించారు. ఇవాళ కుటుంబ సమేతంగా రాహుల్ గాంధీని కలిసిన ఆయన.. ఇకపై…
ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీతో నేడు తెలంగాణ కాంగ్రెస్ నేతలు సమావేశమయ్యారు. సమావేశం అనంతరం ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ.. మాలో ఉన్న విబేధాలపై రాహుల్ గాంధీతో చర్చ జరిగిందని, జరిగింది జరిగి పోయింది. ఇక అందరం కలిసి పని చేస్తామని ఆయన వెల్లడించారు. టీఆర్ఎస్, ఎంఐఎం లతో సంబంధం ఉండదని ఆయన స్పష్టం చేశారు. ఎన్నికలకు ఆరు నెలల ముందు, రాహుల్ టికెట్లు అనౌన్స్ చేస్తారని ఆయన వెల్లడించారు. తెలంగాణ కాంగ్రెస్ ముఖ్య నేతలంతా కలిసి…
కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ, రాహుల్ గాంధీకి లేఖ రాసిన టి.పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి లేఖ.. ఈ లేఖ రాసిన క్షణం నుంచి తాను కాంగ్రెస్ గుంపులో లేనట్లేనని పేర్కొన్న విషయం తెలిసిందే.. సడెన్‌గా వచ్చి లాబీయింగ్ చేస్తే ఎవరైనా పీసీసీ కావొచ్చని లేఖలో పేర్కొన్న ఆయన.. తనపై కోవర్ట్ అనే నిందలు వేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలోనూ కాంగ్రెస్‌లో వర్గ పోరు వుండేదని గుర్తుచేసిన ఆయన.. త్వరలో టీపీసీసీ వర్కింగ్…
ఆ మధ్య కాంగ్రెస్‌కు రాజీనామా చేస్తానంటూ ప్రకటించిన జగ్గారెడ్డి.. మళ్లీ కాస్త వెనక్కి తగ్గారు.. అయితే, పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి.. జగ్గారెడ్డిని కలిసి చర్చలు జరపడంతో ఆయన తన ఆలోచన విరమించుకున్నారనే ప్రచారం కూడా సాగింది.. అయితే, రేవంత్ రెడ్డి తనతో జరిగిన చర్చలను ఇవాళ బయటపెట్టారు జగ్గారెడ్డి.. అసెంబ్లీకి రేవంత్ వచ్చాడు.. జగ్గన్న అంటే నేను కూడా కలిశాను.. ఇద్దరూ కలిశారు సినిమా క్లోజ్ అని అనుకున్నారు.. కానీ, లోపలికి రండి అని పిలిచిన రేవంత్‌రెడ్డి..…
పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి నాకు ఝలక్ ఇచ్చుడు కాదు.. నేనే ఝులక్ ఇస్తానని వార్నింగ్ ఇచ్చారు కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి… టి.పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా ఉన్న నాకు ఝలక్ ఇచ్చానని రేవంత్‌రెడ్డి చెప్పుకుంటున్నాడు.. ఈ పరిణామంతో నన్ను మరింత హట్ చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు.. నాకు రాజకీయ ఝలక్ రేవంత్ ఇచ్చుడు కాదు.. నేను ఇస్తా అని ప్రకటించారు.. కాంగ్రెస్ పార్టీలో ఉన్న మజా ఇంకో పార్టీలో ఉండదన్న ఆయన.. రేవంత్ పై బురద జల్లే…
తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో హీట్ పుట్టించిన జగ్గారెడ్డి ఇష్యూ చల్లబడినట్టే అనిపించింది.. అయితే, జగ్గారెడ్డి పదవులకు కోత విధిస్తూ తెలంగాణ పీసీసీ తీసుకున్న నిర్ణయంతో.. మరోసారి పార్టీలో కాక రాజేసినట్టు అయ్యింది.. ఇక, ఈ వ్యవహారంపై చర్చించేందుకు ఢిల్లీ వెళ్లారు పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి.. మరోవైపు పీసీసీ చర్యపై మీడియాతో మాట్లాడేందుకు సిద్ధం అవుతున్నారు జగ్గారెడ్డి.. ఇలాంటి పరిస్థితుల్లో మీడియా ప్రతినిధులు ఓసారి జగ్గారెడ్డిని ప్రశ్నించారు.. ప్రస్తుతం నాతో భట్టి, ఉత్తమ్ సహా ఎవరూ మాట్లాడట్లేదన్న ఆయన..…
తెలంగాణ కాంగ్రెస్ చీఫ్‌గా రేవంత్‌రెడ్డి పగ్గాలు చేపట్టిన తర్వాత.. పార్టీలో కొన్ని కీలక మార్పులు చోటు చేసుకున్నాయి.. ఇదే సమయంలో.. ఆయను టార్గెట్ చేసే బ్యాచ్ కూడా పెద్దదే.. క్రమంగా అందరితో కలిసిపోయే ప్రయత్నాలు జరుగుతున్నా.. పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డిపై డైలాగ్స్ పేల్చడంలో… జగ్గారెడ్డి ముందు వరుసలో ఉన్నారు.. పార్టీ వ్యక్తిగత ఇమేజ్ కోసం రేవంత్ పని చేస్తున్నారంటూ విమర్శలు చేస్తూనే ఉన్నారు. సీనియర్స్ సమావేశం తర్వాత… ఏకంగా రేవంత్‌కే సవాల్ విసిరారు. సంగారెడ్డి ఎమ్మెల్యే పదవికి…
సంగారెడ్డిలో కాంగ్రెస్ పార్టీ నేతలు, కార్యకర్తలతో జగ్గారెడ్డి సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాజీనామా, కొత్త పార్టీ అనే చర్చ ఈ రోజు లేదని… మీ అందరి ఆలోచన ఏంటో తనకు తెలుసు అని జగ్గారెడ్డి వ్యాఖ్యానించారు. తనకు టీఆర్ఎస్‌లోకి వెళ్లే ఉద్దేశం లేదని.. బీజేపీలోకి వెళ్లే మాటే లేదని స్పష్టం చేశారు. ఇండిపెండెంట్‌గా ఉండాలని భావిస్తున్నట్లు పార్టీ కార్యకర్తలతో ఆయన అన్నారు. ఒకవేళ కొత్త పార్టీ పెడితే తనతో ఎంతమంది వస్తారని ఆయన అడిగారు.…
జగ్గారెడ్డి వ్యవహారం తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో హాట్ టాపిక్‌గా మారిపోయింది.. అధిష్టానానికి లేఖరాసి.. ఇక తాను కాంగ్రెస్ గుంపులో లేనని పేర్కొన్న ఆయనను సముదాయించడానికి సీనియర్లు రంగంలోకి దిగారు.. జగ్గారెడ్డి రాజీనామా చేయకుండా సముదాయించామని, ఆయన లేవనెత్తిన అంశాలపై అధిష్టానంతో మాట్లాడుతామని సీఏల్పీ నేత భట్టి విక్రమార్క, ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వెల్లడించిన విషయం తెలిసిందే.. జగ్గారెడ్డికి కొన్ని ఇబ్బందులున్నాయని, తమ దృష్టికి తెచ్చారని తెలిపిన ఆ నేతు.. జగ్గారెడ్డి కార్యకర్తల సమావేశానికి రాజీనామాకు సంబంధం…