రాజ్ భవన్ వద్ద ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. నిరసన తెలుపుతున్న కాంగ్రెస్ శ్రేణులను పోలీసులు అడ్డుకుని, అరెస్ట్ చేస్తుండటంతో ఉద్రిక్తతకు దారితీసింది. అయితే రాజ్ భవన్ వైపు వెలుతున్న రేణుకా చౌదరిని పోలీసులు అడ్డుకున్నారు. నన్ను ఆపడానికి మీరెవరంటూ ఆమె ఆగ్రహం వ్యక్తం చేసారు. దీంతో పోలీసులకు రేణుకా చౌదరి మధ్య వాగివ్వాదం చోటుచేసుకుంది. ఆమెను పోలీసులు చుట్టుమట్టడంతో ఫైర్ అయ్యారు.
తనను అరెస్ట్ చేసేందుకు యత్నించిన పంజాగుట్ట ఎస్ఐ ఉపేంద్ర చొక్కా పట్టుకున్నారు రేణుకా చౌదరి. పోలీస్టేషన్ కి వచ్చి కొడతా అంటూ ఎస్సైకి వార్నింగ్ ఇచ్చారు. మహిళలను మహిళా పోలీసులు అరెస్ట్ చేయాలని ఆగ్రహం వ్యక్తంచేశారు. దీంతో పోలీసులకు రేణుకా చౌదరి మధ్య తోపులాట, వాగివ్వాదం చోటు చేసుకుంది. అయితే పోలీసులు రేణుకా చౌదరిని అదుపులో తీసుకున్నారు. రేణుకా చౌదరిని బలవంతా పోలీసు జీపులో ఎక్కిస్తుంటే నన్ను వదలండంటూ రేణుకా చౌదరి సీరియస్ అయ్యారు. మీరు నా..చీర లాగారు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. మర్యాద లేకుండా మహిళలపై దౌర్జన్యం ఏంటని మండిపడ్డారు. మమ్మల్ని ఆపడానికి మీరెవరంటూ ప్రశ్నించారు. ఈరోడ్డుకు నేను ట్యాక్స్ కట్టిందాన్ని అంటూ ఆగ్రహం వ్యక్తం చేసారు.
మీడియాతో మాట్లాడుతుంటే అడ్డుకోవడం ఏంటని నిప్పులు చెరిగారు. జీపు ఎక్కను అంటూ ఆమె ససేమిరా అనడంతో.. పోలీసులు ఆమెను బలవంతంగా జీపులో ఎక్కించారు. కాంగ్రెస్ ను ఎవరు అడ్డుకోలేరని హెచ్చరించారు. రాజ్ భవన్ ప్రాంతమంతా కాంగ్రెస్ నేతలతో అట్టుడుకింది. దీంతో .. రాజ్‌భవన్ ముట్టడికి యత్నించిన కాంగ్రెస్ శ్రేణులు జగ్గారెడ్డి, శ్రీధర్‌బాబు, గీతారెడ్డి, భట్టి విక్రమార్క, అంజన్‌కుమార్, రేణుకాచౌదరి లను అరెస్ట్ చేశారు పోలీసులు.