Jagga Reddy: కాంగ్రెస్ నేత, సంగారెడ్డి ఎమ్మెల్యే సీఎం కేసీఆర్ తో భేటీ అయ్యారు. అసెంబ్లీ హాల్ లో సీఎంని కలిశారు జగ్గారెడ్డి. సీఎంని కలిసేందుకు అపాయింట్మెంట్ కోరడంతో, సీఎం ఛాంబర్ లోకి వెళ్లిన తరువాత జగ్గారెడ్డిని పిలిచారు. ఈ సందర్భంగా పలు ప్రాజెక్టులు, పథకాల కోసం సీఎంని కోరారు. సంగారెడ్డి వరకు మెట్రో రైలు వేయాలని కోరారు.
తెలంగాణ కాంగ్రెస్ నేతల మధ్య విభేదాలకు చెక్ పెట్టేందుకు హైకమాండ్ దూత దిగ్విజయ్ సింగ్ కొద్దిసేపటి క్రితం గాంధీభవన్ చేరుకున్నారు. గాంధీభవన్‌లో ఆయన పలువురు నేతలను వేర్వేరుగా కలుస్తున్నారు.
కాంగ్రెస్ నేతల నిరసనలు ఉద్రిక్తంగా మారింది. దీంతో పలువురు కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలను అదుపులోకి తీసుకున్న పోలీసులు. ఈనేపథ్యంలో.. గాంధీభవన వద్ద ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. కేసీఆర్ దిష్టిబొమ్మను కాంగ్రెస్ కార్యకర్తలు దగ్ధం చేయడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
రేవంత్‌రెడ్డి దిగిపోయిన తర్వాత తానే పీసీసీ అధ్యక్షుడిని అవుతానని సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి అన్నారు. అసెంబ్లీ అవరణలో రేవంత్‌రెడ్డి, జగ్గారెడ్డి ఎదురుపడ్డారు. ఈ సందర్భంగా వారిద్దరిమధ్య ఆసక్తికర సంభాషణ చోటుచేసుకుంది.
టీవల ఢిల్లీ లిక్కర్ స్కాం, ఎమ్మెల్యేలకు ఎర వ్యవహారాలు తెలంగాణ రాజకీయాలను తీవ్రంగా ప్రభావితం చేస్తున్నాయి. లిక్కర్ స్కాంలో టీఆర్ఎస్, ఎమ్మెల్యేలకు ప్రలోభాల కుంభకోణంలో బీజేపీకి చెందిన నేతలు ఉండడంతో దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి మీడియా సమావేశంలో కీలక విషయాలు వెల్లడించారు.
పీసీసీ హోదాలో వున్న రేవంత్ రెడ్డి ఇంటి పెద్దమనిషిగా వ్యవహరించాలని, 24 గంటలు సర్వీస్ ఇవ్వాల్సిందే అని సంగారెడ్డి కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి అన్నారు. ఉన్నది ఉన్నట్టు మాట్లాడటం నాకు అలవాటని, అసమ్మతి కాంగ్రెస్ లో సహజమని, అన్ని పార్టీలలో అసమ్మతి ఉంటుందని అన్నారు.
తెలంగాణలో కాంగ్రెస్ భవిష్యత్ కార్యచరణను రూపొందించేందుకు పార్టీ రాష్ట్ర నాయకత్వం ఈరోజు సాయంత్రం జూమ్ మీటింగ్‌ను ఏర్పాటు చేసింది. ఈనేపథ్యంలో.. నేరుగా సమావేశం పెట్టకుండా జూమ్ మీటింగ్ ఏర్పాటు చేయడంపై సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి మండిపడ్డారు.