రాష్ట్రపతి ఎన్నికల్లో విపక్షాల అభ్యర్థిగా బరిలోకి దిగిన యశ్వంత్ సిన్హా హైదరాబాద్ పర్యటన తెలంగాణ కాంగ్రెస్ పార్టీ రచ్చగా మారుతుంది.. యశ్వంత్ హైదరాబాద్ పర్యటనకు టీఆర్ఎస్ ఓన్ చేసుకుంది.. సీఎం కేసీఆర్, మంత్రులు, ఎంపీలు.. బేగంపేట్ ఎయిర్‌పోర్ట్‌కు వెళ్లి.. యశ్వంత్ సిన్హాకు ఆహ్వానం పలికారు.. ఇక, భారీ ర్యాలీ నిర్వహించింది టీఆర్ఎస్ పార్టీ.. ఆ తర్వాత జలవిహార్‌లో టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులతో ప్రత్యేకంగా సమావేశం అయ్యారు.. అయితే, యశ్వంత్ సిన్హా ని కలిసేది లేదని పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి ప్రకటించడంతో.. కొందరు సీనియర్లు తప్ప ఎవరూ అటువైపు మళ్లిచూసింది లేదు.. కానీ, ఈ విషయంలో సీఎల్పీ నేత భట్టి విక్రమార్కును తప్పుబట్టారు ఎమ్మెల్యే జగ్గారెడ్డి.. ఇదే సమయంలో యశ్వంత్ సిన్హా అపాయింట్‌మెంట్ కూడా కోరారు.. భట్టి తీరుపై అధిష్టానానికి లేఖరాయనున్నట్టు ఓ ప్రకటన విడుదల చేశారు.. కాంగ్రెస్ మద్దతు సిన్హాకి ఇచ్చినప్పుడు ఆయన ఇక్కడి వచ్చారు కాబట్టి సీఎల్పీకి పిలిస్తే బాగుండేది అని ఆయన అభిప్రాయపడుతున్నారు.
Read Also: Kolkata: పెంపుడు కుక్క సాహసం.. దొంగ నుంచి కుటుంబాన్ని కాపాడిన వైనం
రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్ సిన్హా ని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క అధిష్టానంతో మాట్లాడి సీఎల్పీ కి ఆహ్వానిస్తే బాగుండేది అన్నారు జగ్గారెడ్డి.. సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఆ ప్రయత్నం ఎందుకు చేయలేదు..? అని ప్రశ్నించిన ఆయన.. యూపీఏలో టీఆర్‌ఎస్ – ఎంఐఎం భాగ్యస్వామ్యం కాకపోయినా విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థిగా ఉన్న యశ్వంత్ సిన్హా ని టీఆర్ఎస్ ఆహ్వానించిందని.. కాంగ్రెస్ పార్టీ, సీఎల్పీ పక్షాన మనం కూడా యశ్వంత్ సిన్హా ని ఆహ్వహించేది ఉండే అన్నారు.. రాజకీయంగా రెండు పార్టీలు వేరు వేరు…. సిద్ధాంతాపరంగా, ప్రజా సమస్యల పై సోనియా గాంధీ, రాహుల్ గాంధీ నాయకత్వంలో కాంగ్రెస్ ఎప్పుడు బీజేపీ ని ప్రశ్నిస్తూనే ఉంటుందన్నారు.. తెలంగాణ రాష్ట్రంలో ప్రజలకు అందుబాటులో లేని టీఆర్ఎస్ ప్రభుత్వనికి వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ పోరాడుతూనే ఉంటుందని స్పష్టం చేశారు. విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థిగా ఉన్న యశ్వంత్ సిన్హా ని సీఎల్పీకి పిలిపించి మద్దతు తెలిపితే బాగేంది అన్నారు. దీని పై పూర్తిగా సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ని తప్పు పడుతూ ఢిల్లీకి లేఖ రాయనున్నట్టు తెలిపారు.. అంతే కాదు, యశ్వంత్ సిన్హా అపాయింట్‌మెంట్ కోసం ప్రయత్నం చేస్తున్నా.. దొరికితే ఆయనను కలిసి మద్దతు ప్రకటిస్తానని వెల్లడించారు.. కాగా, టీఆర్ఎస్ పార్టీతో కలిసి ఎలాంటి వేదికను పంచుకునే అవకాశం లేదని.. యశ్వంత్ సిన్హా ని కలిసేది లేదని రేవంత్‌రెడ్డి స్పష్టం చేసిన విషయం తెలిసిందే.. దీనిపై తెలంగాణ కాంగ్రెస్‌లో భిన్నమైన వాదనలు వినిపిస్తున్నాయి.. మొత్తంగా యశ్వంత్ సిన్హా హైదరాబాద్ టూర్.. తెలంగాణ కాంగ్రెస్‌లో మరో వివాదాన్ని రాజేసినట్టు అయ్యింది.